సరిహద్దుల్లో టెన్షన్ టెన్షన్.. ముగ్గురు పౌరులు మృతి..

ఓ వైపు ప్రపంచమంతా కరోనాతో యుద్ధం చేస్తుంటే.. పాకిస్థాన్ మాత్రం భారత్‌పై కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ..దాడులకు దిగుతోంది. తాజాగా ఆదివారం కుప్వారా జిల్లాలోని రంగవర్‌ ప్రాంతంలో కాల్పుల విమరణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ.. దాడులకు దిగింది. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు మృతి చెందగా..పలువురు గాయపడ్డారు. ఇంకా సరిహద్దుల్లో ఉన్న అనేక ఇళ్లు, వాహనాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. మరోవైపు సైన్యం కూడా పాక్ కవ్వింపు చర్యలకు ఎప్పటికప్పుడు చెక్ పెడుతున్నారు. ఇటీవల […]

సరిహద్దుల్లో టెన్షన్ టెన్షన్.. ముగ్గురు పౌరులు మృతి..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 13, 2020 | 5:08 PM

ఓ వైపు ప్రపంచమంతా కరోనాతో యుద్ధం చేస్తుంటే.. పాకిస్థాన్ మాత్రం భారత్‌పై కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ..దాడులకు దిగుతోంది. తాజాగా ఆదివారం కుప్వారా జిల్లాలోని రంగవర్‌ ప్రాంతంలో కాల్పుల విమరణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ.. దాడులకు దిగింది. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు మృతి చెందగా..పలువురు గాయపడ్డారు. ఇంకా సరిహద్దుల్లో ఉన్న అనేక ఇళ్లు, వాహనాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. మరోవైపు సైన్యం కూడా పాక్ కవ్వింపు చర్యలకు ఎప్పటికప్పుడు చెక్ పెడుతున్నారు. ఇటీవల సైన్యం జరిపిన దాడిలో పాక్‌ భారీగా నష్టపోయింది. దాదాపు 15 మంది పాక్‌ జవాన్లు, 8మంది ఉగ్రవాదులు హతమైనట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.