Breaking News
  • భారత్ లో కరోనా కల్లోలం 18 లక్షల 55 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 1855746 దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 586298 కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 1230510 దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 38938 దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటలలో 52050 కరోనా కేస్ లు, 803 మంది మృతి
  • వేర్‌హౌజ్‌లో నిల్వ చేసిన అమ్మోనియం నైట్రేట్. జాగ్రత్తలు తీసుకోకుండా నిల్వచేయడమే కారణమని లెబనాన్ అధ్యక్షుడు మైఖేల్ ఔన్ ట్వీట్. సమగ్ర దర్యాప్తు చేపట్టిన సుప్రీం డిఫెన్స్ కౌన్సిల్ . బాధ్యులపై తీవ్రమైన చర్యలు, కఠిన శిక్షలు అమలు చేస్తామని వెల్లడి . పేలుడు ధాటికి పూర్తిగా ధ్వంసమైన బీరుట్ పోర్ట్. అత్యవసర నిధి కింద 100 బిలియన్ లీరాలు విడుదల చేసిన లెబనాన్ అధ్యక్షుడు. లెబనాన్‌కి 240 కి.మీ దూరంలోని సైప్రస్ దీవుల వరకు వినిపించిన పేలుడు శబ్దాలు. పేలుళ్లు 3.4 తీవ్రత కల్గిన భూకంపాన్ని సృష్టించాయని నిపుణుల అంచనా. వ్యవసాయంలో ఎరువుగా ఉపయోగించే అమ్మోనియం నైట్రేట్‌కు నిప్పు తగిలితే అత్యంత తీవ్రతతో పేలుతుంది. పేలుడుతో నైట్రోజన్ ఆక్సైడ్, అమ్మోనియా వంటి విషవాయువులు విడుదల.
  • తిరుపతి...పేరూరు వకుళామాత ఆలయంలో చారిత్రాత్మిక శాసనం లభ్యం. 1101 వ శతాబ్దం కిచేందిన శాసనంగా గుర్తించిన పురావస్తు శాఖ అధికారులు. విష్ణు మూర్తి అలయంతో పాటు, అమ్మవారి ఆలయం ఉన్నట్టు చెప్తున్న శాసనం. టిటిడి ఇప్పటివరకు వకుళామాత ఆలయానికి సంభందించి ఎప్పుడు దొరకనట్టువంటి చారిత్రక ఆధారాలు.. తొలిసారిగా శాసనం బయటపడినా దానిపై పూర్తి సమాచారం సేకరిస్తున్న పురవస్తూశాఖ అధికారులు.
  • పేరూరు వకులమాత ఆలయంలో దొరికిన1101 శతాబ్దపు శాసనాలను పరిరక్షిస్తున్న అధికారులు. బండరాళ్లపై శాసనం ఉండటంతో దాని చుట్టూ కాంక్రీట్ దిమ్మను నిర్మిస్తున్న అధికారులు. వందల ఏళ్ల తర్వాత అమ్మవారి ఆలయానికి సంబంధించి దొరికి న శాసనం.
  • నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద. పూర్తిస్థాయి నీటిమట్టం : 590.00 అడుగులు. ప్రస్తుత నీటిమట్టం : 554.60 అడుగులు. ఇన్ ఫ్లో : 40,150 క్యూసెక్కులు. అవుట్ ఫ్లో : 2200 క్యూసెక్కులు. పూర్తిస్థాయి నీటి నిల్వ : 312.0405 టీఎంసీలు. ప్రస్తుత నీటి నిల్వ : 215.5430 టీఎంసీలు.
  • కాంగ్రెస్ సీనియర్ నేత మహారాష్ట్ర మాజీ సిఎం శివాజీరావు పాటిల్ నీలంగేకర్ పూణేలో కన్నుమూశారు.
  • చెన్నై విమానాశ్రయం లో భారీ గా పట్టుబడ్డ బంగారం , ఇద్దరు అరెస్ట్ . దుబాయ్ - షార్జా నుండి చెన్నై అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని గుర్తించినచిన కస్టమ్స్ అధికారులు . పట్టుబడ్డ 1 .48 కేజీల బంగారం విలువ 82 లక్షలు . చెన్నై కి చెందిన ఖలీల్ అహమద్ ,కాజా మొయిద్దీన్ అరెస్ట్ విచారణ చేపట్టిన కస్టమ్స్ అధికారులు.

జాక్‌పాట్ కొట్టిన ముగ్గురు నానీలు

AP CM Jagan Cabinet, జాక్‌పాట్ కొట్టిన ముగ్గురు నానీలు

151 మంది ఎమ్మెల్యేలతో ఘన విజయం సాధించిన వైసీపీ 25 మంది మంత్రులతో తాజాగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుంది. అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యతనిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం జగన్ ఆచితూచి మంత్రుల పేర్లను ఖరారు చేశారు. రేపు ఉదయం 11.49 గంటలకు వెలగపూడిలోని సచివాలయ ప్రాంగణంలో నూతన మంత్రులతో గవర్నర్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తాజా మంత్రివర్గంలో ఆనూహ్యంగా ముగ్గురు ‘నాని’లకు చోటు దక్కడం విశేషం. వారే  కొడాలి నాని, పేర్ని నాని, ఆళ్ల నాని. వారి రాజకీయ నేపథ్యం ఓసారి చూస్తే…

కొడాలి నాని..

కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నుంచి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) నాలుగోసారి విజయం సాధించారు. గత ఎన్నికల్లోనే హ్యాట్రిక్‌ రికార్డు నమోదు చేసిన ఆయన నాలుగోసారి విజయం సాధించి తనకు తిరుగులేదనిపించుకున్నారు. జిల్లాలో సీనియర్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2004, 2009లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందిన నాని తర్వాత వైసీపీలో చేరారు. 2014లో ఆ పార్టీ తరపున గెలుపొందారు. తాజా ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేశారు.

ఆళ్లనాని..

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు శాసనసభ స్థానం నుంచి బరిలోకి దిగిన ఆళ్లనాని వరుసగా మూడో సారి విజయం సాధించారు. 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఆళ్ల నాని వరుసగా విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో ఆళ్ల నాని కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేశారు. ఆయన సమీప ప్రత్యర్ధి, మరడాని రంగారావుపై 33,053 ఓట్ల మెజార్టీని సాధించారు. 2009 ఎన్నికల్లో ఆళ్ల సమీప ప్రత్యర్థి, ప్రజారాజ్యం అభ్యర్థి బడేటి బుజ్జిపై 13,682 ఓట్ల మెజార్టీని సాధించారు. 2014లో నిర్వహించిన ఎన్నికల్లో ఆళ్ల నాని వైసీపీ తరఫున పోటీ చేశారు. మరోసారి బడేటి బుజ్జిపై పోటీ చేయగా..నాని ఓటమి పాలయ్యారు. బడేటి బుజ్జికి ఆ ఎన్నికల్లో 24780 ఓట్ల మెజార్టీ లభించింది. 2019లో నిర్వహించిన ఎన్నికల్లో ఆళ్ల నాని వైసీపీ తరఫున పోటీచేసి గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బడేటి బుజ్జిపై ఆళ్ల నానికి  4072 ఓట్లు మెజార్టీ దక్కింది.

పేర్ని నాని..

కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన వైసీపీ అభ్యర్థి పేర్ని వెంకట రామయ్య ( నాని) సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై 5,590 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. గ‌త ఎన్నిక‌ల్లో 15 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలైన పేర్ని నాని..తాజా ఎన్నికల్లో తీవ్రంగా శ్రమించారు. జ‌గ‌న్ ప్రకటించిన న‌వ‌ర‌త్నాలు త‌న‌కు అనుకూలంగా మార‌తాయని ఆయన ప్రగాఢ నమ్మకంతో ఉండేవారు. తాజాగా అదే నిరూపితమైంది. సామాజికంగానూ  ఆర్థికంగానూ ఇద్దరు ప్రత్యర్థూలు బ‌లంగా ఉండ‌డం, ఇద్దరూ వివాదాల‌కు దూరంగా ఉండ‌డంతో పోటీ కూడా అదే స్థాయిలో జ‌రిగింది. చివ‌ర‌కు పేర్ని నాని మ‌రోసారి విజ‌యం సాధించారు.

Related Tags