Breaking News
  • ఢిల్లీ భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. 2 లక్ష 26 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 226770. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 110960. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 109462. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 6348. . కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • విజయవాడ గ్యాంగ్ వార్ కేసులో వెలుగు చూస్తున్న ఆసక్తికర విషయాలు దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు పోలీసుల అదుపులో 25 మంది స్ట్రీట్ ఫైటర్లు.. పండుగ్యాంగ్ లొ గుంటూరు, మంగళగిరి చెందిన యువకులు ఉన్నట్టు తేల్చినా పోలీసులు.. పాతనేరస్థుల పైనా అనుమానాలు..
  • అమరావతి లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపు నేపథ్యంలో ఈ నెల 8వ తేదీ నుంచి అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు తిప్పడానికి రంగం సిద్ధమవుతోంది. బస్సులు తిప్పడానికి అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం పొరుగు రాష్ట్రాలను కోరింది. ఈ విషయంలో తమిళనాడు మినహా తెలంగాణ, కర్ణాటక, ఒడిశా ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని లేఖ రాశారు. ఏపీఎస్‌ ఆర్టీసీ కూడా అంతర్రాష్ట్ర సర్వీసులు తిప్పేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది.
  • ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డిఎంఆర్సి) లోని సిబ్బందికి కరోనా పాజిటివ్. దాదాపు 20 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరణ. డీఎంఆర్‌సీ అధికారులు.
  • విశాఖ: క్రికెట్ గ్రౌండ్లో కత్తిపోట్లు. మూలపేట మైదానంలో యువకుల మధ్య వివాదం వ్యవహారం. ఆసుపత్రిలో నిలకడగా సాయి ఆరోగ్యం. 3 గంటలపాటు శ్రమించి వైద్యం చేసిన డాక్టర్లు. కత్తిపోటుకు విరిగిన దవడ కిందభాగం.. సాయి ముక్కు, నుదుటిపైనా గాయాలు.. చాతీ, వీపుపైనా కత్తిగాట్లు. దవడలో 6 సెంటీమీటర్ల వెడల్పు.. 3 సెంటీమీటర్ల లోతు గాయం. ఆందోళనలో కుటుంబసభ్యులు. సూర్యపై కఠిన చర్యలు తీసుకోవాలి.. సూర్య నుంచి మాకు ప్రాణ భయముంది.. : సాయి కుటుంబ సభ్యులు. పోలీసుల అదుపులో నిందితుడు సూర్య.
  • అమరావతి డాక్టర్ సుధాకర్ తల్లి దాఖలు చేసిన హెబియస్ కార్పోస్ హౌస్ మోషన్ పిటిషన్ పై హైకోర్టు లో విచారణ. సుధాకర్ పిటిషన్ ను అనుమతించిన కోర్టు హాస్పిటల్ superendent అనుమతి తో సుధాకర్ డిశ్చార్జ్ కావచ్చు సీబీఐ విచారణకు సహకరించాలని సుధాకర్ ను ఆదేశించిన కోర్టు.

మూడు ముక్కలాటలో ఈ ముగ్గురి రూటే సెపరేటు

three mlas route separate, మూడు ముక్కలాటలో ఈ ముగ్గురి రూటే సెపరేటు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి. రాజధానిపై మాటల తూటాలు పేలుతున్నాయి. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. అదే సమయంలో సీఆర్డీఏ రద్దు చేసింది. మరోవైపు శాసనమండలికి బిల్లును పంపింది ప్రభుత్వం. అక్కడ ఆ బిల్లు ఆమోదం పొందుతుందా..లేదా అనే సంగతి పక్కన పెడితే..ఏపీ అసెంబ్లీలో ముగ్గురు ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎవరా ముగ్గురు..ఏంటా కథ అనేది చూడాలంటే కొద్దిగా అమరావతి రాజధానిలో ఉన్న అసెంబ్లీ కథలోకి వెళ్లాల్సిందే..

అసెంబ్లీలో 151 ఎమ్మెల్యేలతో సంపూర్ణ మెజార్టీతో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. టీడీపీకి 23 మంది ఉండగా..జనసేనకు ఒకే ఒక్కరు ఎమ్మెల్యేగా ఉన్నారు. మరో పార్టీ ఎమ్మెల్యేల అవసరం లేకుండానే అధికార పక్షం బిల్లులను ఆమోదించింది. కానీ అనుకోకుండా ముగ్గురు సభ్యుల మద్దతు ఇప్పుడు వైసీపీకి లభించింది. వారే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుంటూరు ఎమ్మెల్యే మద్దాల గిరి, రాజోలు ఎమ్మెల్యే రాపాకా వర ప్రసాద్. మొదటి ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు కాగా…మరొకరు జనసేన నేత.

పేరుకు టీడీపీలో ఉన్నా…వంశీ, మద్దాల గిరి జగన్ సర్కార్ చేస్తున్న పనులను ప్రశంసిస్తున్నారు. అద్భుతమని చెబుతున్నారు. తాను టీడీపీ వారితో కూర్చోలేనని…స్పీకర్ తమ్మినేని సీతారాంకు విన్నవించారు వల్లభనేని. ఫలితంగా ఆయన్ని ప్రత్యేకంగా కూర్చో పెట్టారు. ఇప్పుడు ఆయనకు తోడుగా మద్దాలగిరి వచ్చారు. జై జగన్ అనకపోయినా…అన్నంత పని చేశాడు. అమ్మ ఒడి మహాద్భుతమని కితాబునిచ్చారు. తాను ఏ గట్టునుంటానో చెప్పకనే చెప్పినట్లు అయింది. ఫలితంగా టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య రెండు అంకెలు తగ్గి.. 21కి చేరింది.

ఇక మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఓటేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్‌కు చెప్పారు. పార్టీ కీలక సమావేశాలకు హాజరు కానీ రాపాక ఇప్పుడు తనదైన పంథాలోనే వెళుతున్నాడు. పార్టీ అధినేత నిర్ణయాన్ని కాదని..జగన్ సర్కార్ చేస్తున్న సంక్షేమ పథకాలు బాగున్నాయని చెప్పారు. మరోవైపు మూడు రాజధానులు ఉంటేనే అభివృద్ధి సాధ్యమని చెప్పాడు. ఫలితంగా పవన్ కల్యాణ్ ఆదేశాలను బేఖాతరు చేసినట్లు అయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన పై చర్య తీసుకుంటారా..తీసుకోరా అనే చర్చ సాగుతోంది. ఉన్నది ఒక్కరే ఎమ్మెల్యే కాబట్టి ఆయన్ను అనర్హుడిగా చేయమని చెప్పే పరిస్థితి లేదు. కాబట్టే రాపాక తన దారి తనదే అన్నట్లుగా ఉన్నారని చెప్పవచ్చు. మొత్తంగా మూడు ముక్కలాటలో ఆ ముగ్గురి రూటే సపరేట్ అని చెప్పాలి.

Related Tags