యూపీలో మరో ప్రమాదం.. గాల్లో కలుస్తున్న వలస కూలీల ప్రాణాలు..

కరోనా కాలంలో జాతీయ రహదారులు  పలుచోట్ల యమపురికి మార్గాలుగా మారుతున్నాయి. దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌ కారణంగా ఇతర ప్రాంతాలకు వెళ్లే వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో స్వగ్రామాలకు వెళ్లేందుకు వలస కూలీలు కొందరు కాలిబాటన వెళ్తుంటే.. మరికొందరు ట్రక్కులు, లారీలను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో పలువురు ప్రమాదాలకు గురవుతూ.. అనంతలోకాలకు వెళ్తున్నారు. తాజాగా యూపీలోని మహోబా జిల్లాలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఝాన్సీ- మీర్జాపూర్ హైవే మీదుగా వెళ్తున్న ఓ డీసీఎం […]

యూపీలో మరో ప్రమాదం.. గాల్లో కలుస్తున్న వలస కూలీల ప్రాణాలు..
Follow us

| Edited By:

Updated on: May 19, 2020 | 11:11 AM

కరోనా కాలంలో జాతీయ రహదారులు  పలుచోట్ల యమపురికి మార్గాలుగా మారుతున్నాయి. దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌ కారణంగా ఇతర ప్రాంతాలకు వెళ్లే వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో స్వగ్రామాలకు వెళ్లేందుకు వలస కూలీలు కొందరు కాలిబాటన వెళ్తుంటే.. మరికొందరు ట్రక్కులు, లారీలను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో పలువురు ప్రమాదాలకు గురవుతూ.. అనంతలోకాలకు వెళ్తున్నారు. తాజాగా యూపీలోని మహోబా జిల్లాలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఝాన్సీ- మీర్జాపూర్ హైవే మీదుగా వెళ్తున్న ఓ డీసీఎం ప్రమాదానికి గురైంది. వాహనం టైరు పేలడంతో బోల్తా కొట్టింది. దీంతో అందులో ఉన్న ముగ్గురు వలస కూలీలు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే.. పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందింస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో మొత్తం 17 మంది ఉన్నట్లు స్థానిక పోలీస్ అధికారులు తెలిపారు. వీరంతా ఢిల్లీ నుంచి యూపీకి వస్తున్నట్లు పేర్కొన్నారు.