మూడు కుటుంబాల్లో విషాదం నింపిన విహారయాత్ర.. బైక్ అదుపుతప్పి ముగ్గురు యువకుల దుర్మరణం

మెదక్ జిల్లాలో ఈ దుర్ఘటన జరిగింది. సరదాగా ద్విచక్ర వాహనంపై బయలుదేరిన ముగ్గురు యువకులు మృత్యు ఒడికి చేరారు.

  • Balaraju Goud
  • Publish Date - 2:45 pm, Wed, 13 January 21
మూడు కుటుంబాల్లో విషాదం నింపిన విహారయాత్ర.. బైక్ అదుపుతప్పి ముగ్గురు యువకుల దుర్మరణం

Road accident: పండుగ పూట ముగ్గురి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. విహారయాత్రకు వెళ్లిన ముగ్గురు యువకులు రోడ్డుప్రమాదంలో మృత్యువాతపడ్డారు. మెదక్ జిల్లాలో ఈ దుర్ఘటన జరిగింది. సరదాగా ద్విచక్ర వాహనంపై బయలుదేరిన ముగ్గురు యువకులు మృత్యు ఒడికి చేరారు. పుల్కల్ దగ్గర సింగూరు డ్యామ్ చూసేందుకు ముగ్గురు యువకులు బైక్‌పై వెళ్లారు. వీరు ప్రయాణిస్తున్న బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు సోఫిక్‌, జమీర్‌, సమీర్‌ అక్కడిక్కడే మృతిచెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీంతో ముగ్గురి కుటుంబాల్లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.