విషాదం: ‘ఈత సరదా‘ ముగ్గురిని బలి తీసుకుంది..

సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా స్కూళ్లు సెలవులు కావడంతో తోటి స్నేహితులతో కలిసి విద్యార్థులంతా పిక్నిక్‌ కోసమని స్థానికంగా ఉన్న జలపాతం వద్దకు వెళ్లారు. ఈ క్రమంలోనే

విషాదం: ‘ఈత సరదా‘ ముగ్గురిని బలి తీసుకుంది..
Follow us

|

Updated on: Jul 14, 2020 | 2:46 PM

సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా స్కూళ్లు సెలవులు కావడంతో తోటి స్నేహితులతో కలిసి విద్యార్థులంతా పిక్నిక్‌ కోసమని స్థానికంగా ఉన్న జలపాతం వద్దకు వెళ్లారు. ఈ క్రమంలోనే నీళ్లలో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు ముగ్గురు విద్యార్థులు మరణించారు. ఈ ఘటన బీహార్‌ రాష్ట్రంలో సోమవారం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

బీహార్‌లోని ఫజల్‌గంజ్, భారతీగంజ్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు కైమూర్‌ హిల్స్‌లోని జలపాతం సమీపంలోకి సైకిళ్లపై పిక్నిక్‌కు వెళ్లారు. జలపాతంలో ఒడ్డుకు నీటిలో ఆడుకుంటుండగా.. ప్రమాదవశాత్తు నీళ్లలో పడి కొట్టుకుపోయి మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు దరిగాన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు ..రాష్ట్రంలో నదులు, చెరువులు, జలపాతాల్లో నీరు ప్రమాదకరంగా ఉందని, పిల్లలు అటువైపు వెళ్లకుండా చూసుకోవాలని పోలీసులు ప్రజలకు సూచించారు. ఐదు రోజుల క్రితం జలపాతం సమీపంలోని కొలనులో పడిపోయిన నలుగురు విద్యార్థులను పోలీసులు సకాలంలో వచ్చి రక్షించినట్లు పేర్కొన్నారు.