పంచెకట్టుతో నోబెల్ స్వీకారం.. ఇదే భారతీయ సంప్రదాయం

ఆర్ధిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన బెంగాలీ ఆర్థికవేత్త అభిజిత్ వినాయక్ బెనర్జీ మంగళవారం స్వీడన్ లో నోబెల్ బహుమతి స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన అచ్ఛమైన పంచెకట్టుతో.. భారతీయతను ప్రతిబింబిస్తూ అవార్డు స్వీకరించడంపై సామాజిక మాధ్యమాల్లో అనేకమంది ప్రశంసలు కురిపించారు. ఆయన తీరు ఇంటర్నెట్ ని ఎంతగానో ఇంప్రెస్ చేసింది. అభిజిత్ కు ముందు రవీంద్ర నాథ్ ఠాగూర్, అమర్త్య సేన్ కూడా నోబెల్ బహుమతి పొందిన విషయం తెలిసిందే. నాడు స్టాక్ హామ్ లో […]

పంచెకట్టుతో నోబెల్ స్వీకారం.. ఇదే భారతీయ సంప్రదాయం
Follow us

|

Updated on: Dec 11, 2019 | 3:39 PM

ఆర్ధిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన బెంగాలీ ఆర్థికవేత్త అభిజిత్ వినాయక్ బెనర్జీ మంగళవారం స్వీడన్ లో నోబెల్ బహుమతి స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన అచ్ఛమైన పంచెకట్టుతో.. భారతీయతను ప్రతిబింబిస్తూ అవార్డు స్వీకరించడంపై సామాజిక మాధ్యమాల్లో అనేకమంది ప్రశంసలు కురిపించారు. ఆయన తీరు ఇంటర్నెట్ ని ఎంతగానో ఇంప్రెస్ చేసింది. అభిజిత్ కు ముందు రవీంద్ర నాథ్ ఠాగూర్, అమర్త్య సేన్ కూడా నోబెల్ బహుమతి పొందిన విషయం తెలిసిందే. నాడు స్టాక్ హామ్ లో జరిగిన కార్యక్రమానికి రవీంద్ర నాథ్ ఠాగూర్ హాజరు కాలేకపోయారు. అయితే అమర్త్యసేన్ సూట్ ధరించి నోబెల్ పురస్కారాన్ని అందుకున్నారు. ఇక అభిజిత్ బెనర్జీ తన వెంట ధోతీ-పంజాబీని తీసుకువెళ్లడం విశేషం. ఆయన భార్య ఎస్తేర్ డఫ్లో సైతం చీరకట్టులో హుందాగా కనిపించారు. పైగా నుదుట ఎర్రని సిందూర బొట్టుతో పూర్తి ఇండియన్ ట్రెడిషనల్ అపియరెన్స్ ఇచ్చారు. అభిజిత్ కొల్లీగ్ మైఖేల్ క్రెమర్ కూడా నోబెల్ అందుకున్నారు.