అయ్యన్న హత్యకు కుట్ర.? ఒకరి అరెస్ట్..

టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు హత్యకు కుట్ర జరిగిందా.? ఇందుకు సంబంధించిన లావాదేవీలు కూడా జరిగాయా అంటే.?

  • Ravi Kiran
  • Publish Date - 5:04 pm, Sat, 24 October 20

TDP Leader Ayyanna Patrudu: టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు హత్యకు కుట్ర జరిగిందా.? ఇందుకు సంబంధించిన లావాదేవీలు కూడా జరిగిపోయాయా అంటే.? అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా అలాంటి బెదిరింపు మెసేజ్ ఒకటి ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో తాతారావు అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిని హత్య చేసేందుకు కొందరు పక్కా ప్లాన్ వేశారని.. మావోయిస్టుల ఎటాక్‌లా క్రియేట్ చేసేలా స్కెచ్ వేస్తున్నారని.. అందుకు సంబంధించిన లావాదేవీలు కూడా జరిగాయంటూ ఓ వ్యక్తి ఆయనకు మెసేజ్ పంపడమే కాకుండా తాను ఓ ఎస్సై అని కూడా చెప్పుకొచ్చాడు. ఈ బెదిరింపు మెసేజ్‌కు సంబంధించి అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం పోలీసులుకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు బుచ్చయ్యపేట మండలం కేపీ అగ్రహారానికి చెందిన వియ్యపు తాతారావు అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అసలు ఎవరీ తాతారావు అని పోలీసులు ఆరా తీయగా.. ప్రజా ప్రతినిధులను టార్గెట్ చేస్తూ అతడు డబ్బులు దండుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు.

Also Read: మహిళా ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త..