చంద్రునిపై వింత జీవులు… ఏమిటవి ?

చంద్రగ్రహంపై వేలాది వింత జీవులు ఉన్నాయన్న కొత్త విషయం బయటపడింది. ‘ టార్టి గ్రేడ్స్ ‘ గా పిలుస్తున్న వీటిని ‘ వాటర్ బేర్స్ ‘ (నీటి ఎలుగులు) గా కూడా వ్యవహరిస్తున్నారు. అత్యంత దుర్భరమైన వాతావరణ పరిస్థితుల్లోనూ జీవించే ‘ సత్తా ‘ వీటికి ఉందట. ఆహారం గానీ, నీరు గానీ లేకుండానే ఎంతోకాలం బతకగలవని, హాఠాత్తుగా తమ కణజాలాన్ని గట్టి గ్లాసు టైపులో మార్చుకోగలవని రీసెర్చర్లు చెబుతున్నారు. గత ఏప్రిల్ లో ఇజ్రాయెల్ తన […]

చంద్రునిపై వింత జీవులు... ఏమిటవి ?
Follow us

|

Updated on: Aug 08, 2019 | 4:36 PM

చంద్రగ్రహంపై వేలాది వింత జీవులు ఉన్నాయన్న కొత్త విషయం బయటపడింది. ‘ టార్టి గ్రేడ్స్ ‘ గా పిలుస్తున్న వీటిని ‘ వాటర్ బేర్స్ ‘ (నీటి ఎలుగులు) గా కూడా వ్యవహరిస్తున్నారు. అత్యంత దుర్భరమైన వాతావరణ పరిస్థితుల్లోనూ జీవించే ‘ సత్తా ‘ వీటికి ఉందట. ఆహారం గానీ, నీరు గానీ లేకుండానే ఎంతోకాలం బతకగలవని, హాఠాత్తుగా తమ కణజాలాన్ని గట్టి గ్లాసు టైపులో మార్చుకోగలవని రీసెర్చర్లు చెబుతున్నారు. గత ఏప్రిల్ లో ఇజ్రాయెల్ తన ‘ బెరెషీట్ ‘ మిషన్ ని చంద్రునిపైకి ప్రయోగించింది. ఆ ప్రయోగం విఫలమైనప్పటికీ.. ఈ జీవులు మాత్రం ఎలాగో చంద్ర ఉపగ్రహం మీదికి చేరాయట. అతి సూక్ష్మమైన వీటి జాడను పరిశోధకులు కనుగొని ఆశ్చర్యపోయారు. ఇవి చాలాకాలం పాటు జీవం చచ్చిన స్థితిలో ఉన్నట్టు కనిపిస్తాయని, కానీ అంతమాత్రాన చనిపోవని అంటున్నారు. ఎనిమిది కాళ్ళు, ఒక్కో కాలికి ఎలుగుబంటి కాలికి ఉన్నట్టే చిన్నసైజు పంజా కూడా ఉంటుందని తేల్చారు. రేడియేషన్ ని కూడా తట్టుకోగల ఈ వాటర్ బేర్స్ శరీర నిర్మాణం వారిని షాక్ కి గురి చేసింది. అతిశీతలమైన, ఎత్తయిన పర్వత ప్రాంతాల్లోనే కాదు.. లోతైన సముద్ర జలాల్లో కూడా జీవించగలిగే ఈ జీవుల విశేషాలు ఇంకా చాలా ఉన్నాయని అంటున్నారు. దాదాపు 200 సంవత్సరాల వరకు ఈ సూక్ష్మ జీవులు బతకగలవని కీటక నిపుణులు చెబుతున్నారు. అయితే ఇజ్రాయెల్ తన బెరెషీట్ మిషన్ లో వీటిని ఎలా చేర్చగలిగిందన్నది మిస్టరీగా ఉంది. తన ‘ స్పేస్ రీసెర్చ్ లైబ్రరీ ‘ నుంచి వీటిని ఆ దేశం సేకరించి ఉండవచ్ఛునన్నది ఒక అంచనా. పీ హెచ్ డీ గ్రాడ్యుయేట్ ఒకరు మైక్రోస్కోప్ లో ఈ వింత జీవి చలనాల తాలూకు వీడియో తీసి వదిలాడు.

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?