అక్కడ ఖైదీలకు ఆన్‌లైన్‌ ద్వారా యోగా శిక్షణ!

యోగా ఆన్‌లైన్ సెషన్లు జూలై 28 న ప్రారంభమయ్యాయి. ‘ఖైదీల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వ జైళ్ల శాఖ ఈ అభ్యర్థన చేసింది. యోగా నమస్కార్‌. సింహక్రియ, ఈషా క్రియలో శిక్షణ ఇస్తున్నారు.

అక్కడ ఖైదీలకు ఆన్‌లైన్‌ ద్వారా యోగా శిక్షణ!
Follow us

| Edited By:

Updated on: Aug 11, 2020 | 6:49 PM

దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో తమిళనాడు రాష్ట్రంలోని వివిధ నగరాల్లోగల అన్ని కేంద్ర జైళ్లలో ఖైదీల కోసం ఈషా యోగా సెంటర్ ఆన్‌లైన్ యోగా సెషన్లు నిర్వహిస్తున్నట్లు తమిళనాడు జైళ్ల విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. తమిళనాడు జైళ్ల శాఖ అభ్యర్థన మేరకు ఈషా యోగా సెంటర్ చెన్నై, వెల్లూరు, కడలూరు, త్రిచి, సేలం, పాలయన్కోట్టైలోని అన్ని కేంద్ర జైళ్లలో ఖైదీల కోసం ఆన్‌లైన్ యోగా సెషన్లను నిర్వహిస్తోందని పేర్కొంది. సద్గురువు వద్ద శిక్షణ పొందిన ఈషా ఉపాధ్యాయులు తమిళంలో ఆన్‌లైన్ మాడ్యూళ్ళను అందిస్తున్నారని తెలిపింది.

ఖైదీల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు యోగా నేర్పించాలని జైళ్ల విభాగం అభ్యర్థన చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. యోగా నమస్కార్‌. సింహక్రియ, ఈషా క్రియలో శిక్షణ ఇస్తున్నారు. సింహక్రియ అనేది మూడు నిమిషాల యోగా సాధన. దీనిని సద్గురువు రూపొందించారు. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు శ్వాసకోశ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఒక సాధనంగా ఉపయోగపడుతుంది.’ అని జైళ్ల విభాగం పేర్కొంది. ఆన్‌లైన్ సెషన్ల ద్వారా తమిళనాడు వ్యాప్తంగా వేలాది మంది ఖైదీలు లబ్ధి పొందుతున్నారని ఆ విభాగం తెలిపింది. ఈషా సంస్థ దాదాపు 20 సంవత్సరాలుగా రాష్ట్ర జైళ్లలో యోగా సెషన్లు నిర్వహిస్తున్నది.

Read More:

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై పీహెచ్‌సీల్లో 24 గంటల సేవలు..

గుడ్ న్యూస్: ఔట్‌సోర్సింగ్‌ నర్సుల జీతాల పెంపు