ఆ భూభాగాలు మావే, అప్ డేట్ చేసిన మ్యాప్ తో నేపాల్

భారత భూభాగాలైన లింపియాధుర, లిపు లేఖ్, కాలాపానీలను తమ ప్రాంతాలుగా చెప్పుకుంటూ అప్ డేట్ చేసిన మ్యాప్ ను నేపాల్ ఇండియాకు, ఐక్యరాజ్య సమితికి పంపనుంది. ఈ నెల రెండో వారం నాటికి ఈ మ్యాప్..

ఆ భూభాగాలు మావే, అప్ డేట్ చేసిన మ్యాప్ తో నేపాల్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 02, 2020 | 10:41 AM

భారత భూభాగాలైన లింపియాధుర, లిపు లేఖ్, కాలాపానీలను తమ ప్రాంతాలుగా చెప్పుకుంటూ అప్ డేట్ చేసిన మ్యాప్ ను నేపాల్ ఇండియాకు, ఐక్యరాజ్య సమితికి పంపనుంది. ఈ నెల రెండో వారం నాటికి ఈ మ్యాప్ ను ఐరాస లోని వివిధ ఏజన్సీలతో బాటు ఇండియా సహా అంతర్జాతీయ దేశాలకు పంపుతామని నేపాల్ మంత్రి పద్మా ఆర్యల్ తెలిపారు. సవరించిన ఈ మ్యాప్ తాలూకు నాలుగు వేల కాపీలను ఇంగ్లీషులో ముద్రిస్తున్నామని, ఇప్పటికే 25 వేల కాపీల ముద్రణ జరిగిందని ఆ మంత్రి చెప్పారు. వీటిని ప్రభుత్వ కార్యాలయాలకు ఉచితంగాను, ప్రజలకు నేపాలీ కరెన్సీ లో 50 రూపాయలకు అమ్మనున్నారు.

కాగా నేపాల్ ప్రభుత్వ చర్యను ఖండించిన ఇండియా.. ఈ సవరించిన మ్యాప్ ను అంగీకరించే ప్రసక్తి లేదని  స్పష్టం చేసింది. వాస్తవ ఆధారాలను ప్రతిబింబించని ఈ మ్యాప్ విషయంలో నేపాల్.. ఇరు దేశాల ద్వైపాక్షిక నియమావళిని అతిక్రమిస్తోందని ఆరోపించింది.