మహబూబాబాద్ జిల్లాలో రైతులకు కొత్త టెన్షన్, ధాన్యం బస్తాలు ఎత్తుకెళ్తోన్న దోపిడి దొంగలు

మహబూబాబాద్ జిల్లాలో దోపిడి దొంగలు రెచ్చిపోతున్నారు. కొత్తగూడలో ఇంతకాలం స్థబ్దుగా ఉన్న దొంగలు మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఈ సారి ఏకంగా రైతు పండించిన...

  • Ram Naramaneni
  • Publish Date - 3:17 pm, Mon, 30 November 20
మహబూబాబాద్ జిల్లాలో రైతులకు కొత్త టెన్షన్, ధాన్యం బస్తాలు ఎత్తుకెళ్తోన్న దోపిడి దొంగలు

మహబూబాబాద్ జిల్లాలో దోపిడి దొంగలు రెచ్చిపోతున్నారు. కొత్తగూడలో ఇంతకాలం స్థబ్దుగా ఉన్న దొంగలు మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఈ సారి ఏకంగా రైతు పండించిన ధాన్యం బస్తాలను ఎత్తుకెళ్లిన ఘటన వేలుబెల్లి శివారు పోలారం గ్రామంలో చోటుచేసుకుంది.  ప్రకృతి వైపరిత్యాలు, చీడపురుగుల నుంచే కాకుండా పండిన పంటను ఇప్పుడు దొంగల భారి నుంచి కూడా రక్షించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అధిక వర్షాలతో పంట దిగుబడి తగ్గి, రైతులు ఓ వైపు భాద పడుతుంటే, పండిన కాస్తో కూస్తో పంటను కూడా వదలకుండా దొంగలు దోచుకెళ్తున్నారు.

ప్రమీల అనే మహిళా రైతు రెండు ఎకరాలలో పండించిన ధాన్యాన్ని ముప్పై ధాన్యం బస్తాలలో నింపి కల్లంలోనే ఉంచింది. తెల్లారితే మార్కెట్ కు తీసుకెళ్లేందుకు సిద్ధపడుతుండగా ధాన్యం బస్తాలు చోరీకి గురయ్యాయి. 30 బస్తాలు ధాన్యం కాగా అందులో నుంచి 24 బస్తాలు దొంగలు ఎత్తుకెళ్లారు. దీంతో లబోదిబో మంటూ బాధిత రైతు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Also Read :

శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల, పనిచెయ్యని టీటీటీ వెబ్‌సైట్, అసహనం వ్యక్తం చేస్తోన్న భక్తులు

AP Assembly : నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..అస్త్రశస్త్రాలతో అధికార, ప్రతిపక్షాలు రెడీ !

Ind vs Aus : రెండో వన్డే​లో క్రేజీ సీన్, ఆసిస్ లేడీ ఫ్యాన్‌కు ప్రపోజ్ చేసిన ఇండియా కుర్రోడు