‘ఏం చేస్తున్నావ్.. నాకు కోపం వస్తోంది.. నీ జుట్టు కత్తిరించేస్తా’.. వైరల్ అవుతున్న బుడ్డోడు..

సాధారణంగా చిన్న పిల్లలను ఎక్కడికైనా బయటికి తీసుకెళ్తే.. వాళ్లు అల్లరి పనులతో ఇల్లు పీకి పండిరి వేస్తారు. అలాంటిది వాళ్లను కటింగ్ షాపుకు తీసుకెళ్తే చేసే హంగామా అంతా ఇంతా కాదు.

  • Ravi Kiran
  • Publish Date - 7:13 pm, Wed, 25 November 20

Video Of A Child Getting A Haircut: సాధారణంగా చిన్న పిల్లలను ఎక్కడికైనా బయటికి తీసుకెళ్తే.. వాళ్లు అల్లరి పనులతో ఇల్లు పీకి పండిరి వేస్తారు. అలాంటిది వాళ్లను కటింగ్ షాపుకు తీసుకెళ్తే చేసే హంగామా అంతా ఇంతా కాదు. టాప్ లేచిపోవాల్సిందే. తాజాగా నాగ్‌పూర్‌కు చెందిన అనూప్ అనే వ్యక్తి తన కొడుకు అనుశ్రుత్‌ను హెయిర్ కటింగ్ కోసం సెలూన్‌కు తీసుకెళ్లాడు. అక్కడ బార్బర్ తన జట్టును కట్ చేస్తుండగా పిల్లాడు కోపంతో మాట్లాడిన మాటలను వాళ్ల నాన్న వీడియో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఆ వీడియోకు జనాలు ఫిదా అయిపోయారు.

‘ఏం చేస్తున్నావ్. నాకు కోపం వస్తోంది. నిన్ను కొడతా. నీకు కటింగ్ చేస్తాను. నేను పెద్దోడిని. నాకు కటింగ్ చేయనివ్వను’ అంటూ పిల్లాడు కోపంలో ముద్దుముద్దుగా మాట్లాడాడు. అలాగే హెయిర్ కటింగ్ అనంతరం అనుశ్రుత్‌ ‘కటింగ్ వాలా అంకుల్’పై తన కోపాన్ని చూపిస్తున్న మరో వీడియో కూడా నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. ఈ రెండు వీడియోలను బాలీవుడ్ ప్రముఖులు కూడా రీ-ట్వీట్ చేశారు.