Viral News : ఆ గ్రామంలో 80శాతం మంది జనవరి 1నే పుట్టారట..అసలు మిస్టరీ ఏంటంటే..?

ఉత్తర్​ప్రదేశ్​ ప్రయాగ్​రాజ్​లోని బారా గ్రామంలో ఉన్న జనాభాలో 80శాతం మంది జనవరి ఒకటో తారీఖున పుట్టారట. అబ్బా..నిజమా అంటే...

Viral News :  ఆ గ్రామంలో 80శాతం మంది జనవరి 1నే పుట్టారట..అసలు మిస్టరీ ఏంటంటే..?
Follow us

|

Updated on: Jan 02, 2021 | 6:37 PM

Viral News :   ఉత్తర్​ప్రదేశ్​ ప్రయాగ్​రాజ్​లోని బారా గ్రామంలో ఉన్న జనాభాలో 80శాతం మంది జనవరి ఒకటో తారీఖున పుట్టారట. అబ్బా..నిజమా అంటే వారు వెంటనే ఇంట్లోకి వెళ్లి ఆధార్ తీసుకొచ్చి ఇదిగో ప్రూఫ్ అంటున్నారు. ఒక ఫ్యామిలీ ఉంది అనుకోండి.. ఆ ఇంట్లోని నాన్న, అమ్మ, కుమారుడు, కూతురు, కోడలు, వారి పిల్లల పుట్టినరోజులు సైతం జనవరి ఫస్ట్ తేదీనే ఉన్నాయి. పుట్టిన ఏడాదిలో మార్పులు ఉన్నప్పటికీ..తేదీ మాత్రం జనవరి ఫస్టే.

అసలు కిటుకు అక్కడే ఉంది :

ఈ పుట్టినరోజుల వెనుక ఒక ఇంట్రస్టింగ్ విషయం ఉందండోయ్. 2010లో కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డును పౌరుల గుర్తింపు కార్డుగా ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 2012లో ప్రయాగ్​రాజ్​లోని ‘బారా’ గ్రామానికి ఆధార్​కార్డు వివరాలు నమోదు చేసే అధికారులు వచ్చారు. అప్పుడు ఊరిలో ఎవరినీ బర్త్ డేట్ అడిగినా..తమకు తెలియదని సమాధానం చెప్పారు. సంవత్సరం అయితే అంచనా వేసి చెప్పగలిగారు. దీంతో వారందరికీ జనవరి ఒకటో తారీఖును జన్మదినంగా రికార్డు చేశారు అధికారులు. దీంతో ఊర్లో 80శాతం మంది జనవరి ఒకటో తేదీనే పుట్టినట్లు అయ్యింది. వీటిని సరిచేయడానికి తర్వాత అధికారులు ఎటువంటి ప్రయత్నాలు చేయలేదని..గ్రామస్థులు చెబుతున్నారు.

Also Read :

APSRTC : ఏపీఎస్ ఆర్టీసీ సరికొత్త సర్వీస్.. పోస్టల్‌శాఖ ద్వారా కొరియర్‌.. ఇకపై హోమ్ డెలివరీ!

 Leaders Visit To Ramatheertham : రాజకీయ రణరంగమైన రామతీర్థం..నేతల పర్యటనలతో పెరగిన హీట్