దక్షిణ భారత దేశం నుంచి మోడీ పోటీ

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈసారి ఎన్నికల్లో దక్షిణాది నుంచి బరిలోకి దిగే అవకాశాలున్నాయి. దక్షిణాదిలో పట్టుసాధించాలని బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా కర్ణాటక రాష్ట్రం బెంగళూరు సౌత్ నుంచి ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా బరిలోకి దిగుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రధాని మోడీ ఉత్తరాది నుంచి కూడా పోటీ చేయనున్నారు. ఉత్తరప్రదేశ్ వారణాసితో పాటు బెంగళూరు సౌత్‌ను ఎంచుకున్నారు. అయితే తొలుత గుజరాత్ రాష్ట్రం గాంధీ నగర్, వారణాసి స్థానాల నుంచి పోటీ చేయాలని […]

దక్షిణ భారత దేశం నుంచి మోడీ పోటీ
Follow us

|

Updated on: Mar 23, 2019 | 8:11 AM

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈసారి ఎన్నికల్లో దక్షిణాది నుంచి బరిలోకి దిగే అవకాశాలున్నాయి. దక్షిణాదిలో పట్టుసాధించాలని బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా కర్ణాటక రాష్ట్రం బెంగళూరు సౌత్ నుంచి ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా బరిలోకి దిగుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రధాని మోడీ ఉత్తరాది నుంచి కూడా పోటీ చేయనున్నారు. ఉత్తరప్రదేశ్ వారణాసితో పాటు బెంగళూరు సౌత్‌ను ఎంచుకున్నారు. అయితే తొలుత గుజరాత్ రాష్ట్రం గాంధీ నగర్, వారణాసి స్థానాల నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే దక్షిణ భారత దేశం నుంచి ప్రాతినిధ్యం వహించాలని భావించడంతో పాటు గుజరాత్ గాంధీ నగర్ నుంచి అమిత్ షా పోటీ చేస్తుండటంతో మోడీ సౌతిండియా నుంచి బెంగళూరు సౌత్‌ను ఎంచుకున్నారు.

బెంగళూరు సౌత్ నుంచి అనంతకుమార్ వరుసగా ఆరుసార్లు విజయం సాధించారు. అనంతకుమార్ మరణానంతరం ఆయన భార్య తేజస్వినిని బరిలోకి దించాలని బీజేపీ అధిష్ఠానం భావించింది. అయితే, ప్రధాని మోదీ దక్షిణాదిపై దృష్టి కేంద్రీకరించడంతో తేజస్వినిని పక్కనపెట్టారు.