Breaking News
  • తిరుమల: రేపు తిరుమలకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. రేపు తిరుమలకు విచ్చేయనున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, కర్ణాటక సీఎం యడియూరప్ప. రేపు సాయంత్రం శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి గరుడ సేవలో పాల్గొననున్న సీఎం జగన్. రేపు సాయంత్రం తిరుమలకు చేరుకోనున్న కర్ణాటక సీఎం యడియూరప్ప. రేపు రాత్రి తిరుమలలోనే బస చేయనున్న ముఖ్యమంత్రులు. 24న ఉదయం శ్రీవారిని దర్శించుకుని నాదనీరాజనం వేదికపై వేద పారాయణంలో పాల్గొననున్న ముఖ్యమంత్రులు. అనంతరం ఉదయం 8.10 గంటలకు కర్ణాటక సత్రాల నూతన సముదాయ నిర్మాణానికి భూమిపూజ చేయనున్న సీఎం జగన్, యడియూరప్ప. అనంతరం తిరుగు ప్రయాణం.
  • ఏరియా ఆస్పత్రి కేసీఆర్ కిట్ లలో గోలమాల్. వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో ఘటన పై విచారణ చేపట్టిన వైద్యాధికారులు . డెలివరీల డేటా ఎంట్రీలు చేయకుండా గోల్ మాల్ . ప్రతి కాన్పుకు అబ్బాయికి 11 వేలు అమ్మాయికి 12వేలుతో పాటు కేసీఆర్ కిట్ . బెనిఫిషరీస్ కు రావలసిన మొత్తం లో అవకతవకలను గుర్తించిన డిఎం అండ్ వో కార్యాలయం. 300 డెలివరీ డిటైల్స్ ఎంట్రీ కాకపోవడంతో వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు. డేటా ఎంట్రీలు గోల్ మాల్ పై బాధ్యుడిగా గుర్తించిన డేటా ఎంట్రీ ఆపరేటర్ సతీష్. సతీష్ పై పోలీసులకు ఫిర్యాదుచేసిన ఆసుపత్రి సూపరింటెండెంట్ . డిఎం అండ్ వో కార్యాలయంలో గుర్తించి ఏరియా ఆసుపత్రిని అప్రమత్తం చేశాం: టీవీ9 తో dm&ho స్వరాజ్యాలక్ష్మి. డెలివరీల డేటాపై సూపరింటెండెంట్ ను ఆదేశించడంతో అసలు విషయం బయట పడింది: dm&ho. పోలీస్ ల విచారణలో మరిన్ని విషయాలు వెల్లడవుతాయి: dm&ho.
  • తిరుపతి: శ్రీకాళహస్తి ఆలయంలోపల కు విగ్రహాలు తీసుకెళ్లిన కేసులో నిందితులను మీడియా ముందు హాజరుపర్చిన ఎస్పీ రమేష్ రెడ్డి. నిందితులు ముగ్గురూ పుత్తూరుకు చెందినవారు. వ్యక్తిగత సమస్యలు, దోషాలు పోవడానికి విగ్రహాలకు పూజలు చేసి ఆ విగ్రహాలను శ్రీకాలహాస్తి అలయంలోపల ఉంచారు. నందీశ్వరుడు, శివుడి విగ్రహాలను తిరుపతిలోనే ఏడు వేలకు కొనుగోలు చేశారు. వీరు ముగ్గురు అన్నదమ్ములు పెళ్లి కాకపోవడం, అప్పుల పాలయిపోవడం, ఇతర సమస్యలకు దోషం పోవాలంటే పూజలు చేయాలని ఒక స్వామీజీ చెప్పిన సలహాతో ఇలా చేశారు. పూజలు చేసిన విగ్రహాలను శ్రీకాళహస్తి ఆలయంలో పెడితే దోషాలు పోయి ..కలిసి వస్తుందని స్వామీజీ చెప్పాడు. వీరి చేత పూజలు చేయించి ఇంతటి వివాదానికి కారణమైన స్వామీజీ కోసం గాలిస్తున్నాము.
  • కోటి 12 లక్షల లంచం కేసులో రెండవరోజు నిందితుల కస్టడి. ఐదుగురు నిందితులను రెండవ రోజు విచారించనున్న ఏసీబీ. ఆర్డీవో అరుణా రెడ్డి ని చంచల్ గూడ జైలునుండి ఏసీబీ కార్యాలయానికి తరలించినున్న ఏసీబీ అధికారులు. అడిషనల్ కలెక్టర్ నగేష్ తో పాటు మిగిలిన ముగ్గురు నిందితులను నాలుగు రోజుల పాటు ఏసీబీ అధీనం లోనే నిందితులు. నగేష్ బ్యాంక్ లాకర్ పై నేడు విచారణ. 40 లక్షలు ఎక్కడ అనే దానిపై రాని స్పస్టత . అవినీతి, బినామీ ఆస్తులపై ఏసీబీ ప్రశ్నంచనున్న ఏసీబీ. పలువురు అనుమానితులను, సాక్షులను విచారించనున్న ఏసీబీ.
  • అమరావతి: పట్టణ ప్రాంతాల్లో మంచి నీటి సరఫరాపై ప్రభుత్వం కార్యచరణ. వివిధ జిల్లాల్లోని 21 పట్టణాలకు వివిధ రిజర్వాయర్ల నుంచి నీటి కేటాయింపులు చేస్తూ ఉత్తర్వులు. మొత్తంగా 50 పట్టణాల్లో రూ. 5050 కోట్ల ఏఐఐబీ నిధులతో మంచి నీటి సరఫరా ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రణాళికలు.
  • రెండవ రోజు ముగిసిన నిందితుల కస్టడీ. మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ బినామీ లపై కొనసాగిన విచారణ. రెండవ రోజు బయట పడ్డ నగేష్ ముగ్గురు బినామీలు. ముగ్గురు బినామీలను విచారించిన ఏసీబీ. నగేష్ భినామిలో కీలక పాత్ర పోషించిన ఓ మహిళ బినామి. మెదక్, మనోహర బాద్, మేడ్చల్ ,కామారెడ్డి లో పలు అక్రమాలను గుర్తించిన ఏసీబీ. మెదక్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది తో పాటు పలువురు కింది స్థాయి ఉద్యోగుల సైతం విచారించిన ఏసీబీ.
  • టీవీ9 చేతిలో హైదరాబాద్‌ డ్రగ్స్‌ కేసుల చార్జిషీట్‌. ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ ఆర్టీఐకి ఎక్సైజ్‌శాఖ రిప్లై. గత రెండేళ్లలో 12 డ్రగ్స్‌ కేసులు నమోదైనట్లు వెల్లడి. 12 కేసుల్లో 8 కేసుల్లోనే చార్జిషీట్‌ దాఖలు-ఎక్సైజ్‌శాఖ. టాలీవుడ్‌కు సంబంధించిన 4 కేసులపై సమాచారం ఇవ్వని శాఖ. ఎక్సైజ్‌శాఖ దాఖలుచేసిన 8 చార్జిషీట్లలో సంచలన అంశాలు.

పుల్వామా ఘటనతో జమ్ము విద్యార్ధుల పాలిట దైవంగా మారిన ఇత్రాత్

, పుల్వామా ఘటనతో జమ్ము విద్యార్ధుల పాలిట దైవంగా మారిన ఇత్రాత్

పుల్వామా ఘటన అనంతరం చెలరేగిన ఆందోళనలు జమ్ముకశ్మీర్ విద్యార్ధుల పాలిట శాపమైంది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో చదువుకుంటున్న కశ్మీరీ విద్యార్ధులకు బెదిరింపులు ప్రారంభమయ్యాయి. 24 గంటల్లో మీ రాష్ట్రం వెళ్లాలంటూ పలు సంస్థలు బెదిరింపులకు దిగడంతో కశ్మీరీ విద్యార్ధులు తీవ్ర భయానక పరిస్థితులను చూశారు. ఈ తీవ్ర పరిస్థితుల్లో జమ్ముకశ్మీర్ విద్యార్ధులను వారి సొంత స్థలాలకు చేర్చడానికి జమ్ముకశ్మీర్ స్టుడెంట్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు ఇత్రాత్ కీలక పాత్ర పోషించాడు. ఇంతకు అసలు కశ్మీరీ విద్యార్ధులకు బెదిరింపులు ఎలా మొదలయ్యాయి? వీరిని స్వస్థలాలకు తరలించిన ఈత్రాత్ ఎవరు? అతని గతం ఏంటి? వందల మంది విద్యార్ధులను ఎలా తరలించాడు? ఈ స్టోరీలో చూద్ధాం.

అసలు బెదిరింపులు ఎలా ప్రారంభమయ్యాయి..?
ఫిబ్రవరి 14న జమ్ముకశ్మీర్ కు చెందిన ఆదిల్ అనే జైషే ఎ మహ్మద్ ఉగ్రసంస్థకు చెందిన యువకులు ఓ కారుతో సీఆర్ఫీఎఫ్ జవాన్ల కాన్వాయ్ పై దాడికి దిగాడు. ఈ ఘటనలో 49మంది సీఆర్ఫీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. అయితే ఈ ఘటన జరిగిన కొద్ద గంటల్లోనే దాడికి పాల్పడ్డది జమ్ముకశ్మీర్ వ్యక్తి అని ప్రచారం అవ్వడంతో ఉత్తరాఖండ్ లో జమ్ముకశ్మీర్ విద్యార్ధులకు బెదిరింపు కాల్స్ మొదలయ్యాయి. దీంతో డెహ్రాడూన్ లో చదువుకుంటున్న విద్యార్ధులకు అక్కడి పలు సంస్థలు బెదిరింపులకు దిగాయి. మీరంతా 24గంటల్లో డెహ్రాడూన్ వదిలి వెళ్లిపోవాలని బెదిరింపులకు దిగాయి పలు రైట్ వింగ్ ఆర్గనైజేషన్స్. దీంతో భయబ్రాంతులకు గురైన జమ్ముకశ్మీర్ విద్యార్ధులు వారికి సంబంధించిన సంస్థ అయిన JKSO ని సంప్రదించారు.

ఇంతకు ఈ JKSO ఏమిటి…?

జమ్ముకశ్మీర్ లో ఉన్నత విద్య చదువుకోవడం ఓ సహాసమైన పని. కారణం నిత్యం అక్కడ ఉన్న భయానక పరిస్థితులు. దీంతో ఉన్నత విద్య కోసం విద్యార్ధులు పొరుగు రాష్ట్రాల్లో చదువుకునేందుకు ఆసక్తి చూపుతారు. అయితే ఇతర రాష్ట్రాల్లో చదువుకుంటున్న విద్యార్ధులకు ఏదైన ఆపద వస్తే ఆదుకునేందుకు ఓ ఆర్గనైజేషన్ ఉండాలన్న ఆశయంతో ఈత్రాత్ అనే మోకానికల్ విద్యార్ధి 2017లో జమ్ము కశ్మీర్ స్టుడెంట్ ఆర్గనైజేషన్ ను స్థాపించాడు. అప్పటి నుంచి జమ్ముకశ్మీర్ విద్యార్ధులందరినీ ఏకతాటిపై తెచ్చేందుకు ప్రయత్నించేవాడు. అయితే ఇదే సమయంలో ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడితో కశ్మీరీ విధ్యార్ధులకు బెదిరింపులు ప్రారంభమయ్యాయి. దీంతో తమని కాపాడాలంటూ జమ్ముకశ్మీరీ విద్యార్ధులు ఈత్రాత్ కు పెద్ద ఎత్తున కాల్స్ చేయడం మొదలు పెట్టారు. జమ్ముకశ్మీర్ విద్యార్ధుల కోసం ఓ హెల్ప్ లైన్ నంబరును కూడా ఈత్రాత్ ఏర్పాటు చేశాడు. ఈ హెల్ప్ లైన్ కు సగటున రోజుకు 300 కాల్స్ స్వీకరించినట్లు ఈత్రాత్ తెలిపారు. ఘటన జరిగిన తరువాత కేవలం ఐదురోజుల్లో ఈత్రాత్ జమ్ముకశ్మీర్ స్టుడెంట్ ఆర్గనైజేషన్ ద్వారా దాదాపు 800మందిని కశ్మీర్ కు తరలించినట్లు తెలిపాడు.

, పుల్వామా ఘటనతో జమ్ము విద్యార్ధుల పాలిట దైవంగా మారిన ఇత్రాత్

డెహ్రాడూన్ లో అసలు ఏం జరిగింది..?

పుల్వామా ఘటన అనంతరం డెహ్రాడూన్ లో రైట్ వింగ్ సంస్థల బెదిరింపులతో కశ్మీరీ విద్యార్ధులు భయబ్రాంతులకు గురయ్యారు. ఓ విద్యార్ధిపై గుర్తుతెలియని వ్యక్తులు తలపై బాది 24గంటల్లో డెహ్రాడూన్ వదిలి వెళ్లాలని హెచ్చరించారు. దీంతో ఆ విషయాన్ని తన సహచర విద్యార్ధులకు తెలియజేశాడు. దీంతో అక్కడి విద్యార్ధులు భయబ్రాంతులకు గురై.. రూంలన్నీ ఖాళీ చేశారు. ఒకే రూంలో 20మంది వరకు ఉంటూ.. డోర్ లాక్ వేసుకున్నారు. తమను ఏలాగైన రక్షించాలంటూ ఈత్రాత్ కు కాల్స్ చేశారు. తమ పరిస్థితి చాలా ఘోరంగా ఉందని.. రెండు రోజుల నుంచి కనీసం ఆహారం కూడా లేదని వాపోయారు. అయితే ఘటనపై అక్కడి సీఆర్ఫీఎఫ్ కు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అయితే వారు ఓ హెల్ప్ నంబర్ ను ఏర్పాటు చేశారు. అనంతరం డెహ్రాడూన్ లో కశ్మీరీ విద్యార్ధుల పట్ల ఏలాంటి బెదిరింపులు లేవని.. అవన్నీ అవాస్థవాలని కొట్టి పారేశారు. దీంతో చేసేందేమీ లేక అక్కడి నుంచి బయటపడేందుకు ప్రయత్నించారు. అయితే హాస్టల్స్ లో ఉంటున్న విద్యార్ధులు కశ్మీర్ వెళ్లేందుకు ప్రయత్నించగా ట్రాన్స్ పోర్ట్ ధరలు నింగినంటాయి. అయితే వీరందరిని కశ్మీర్ కు తరలించేందుకు ఈత్రాత్ తనవంతు ప్రయత్నాలు చేశాడు. డెహ్రాడూన్ నుంచి చంఢీగడ్ తరలించేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశాడు. అనంతరం చంఢీగడ్ లోని ఓ గురుద్వారాలో వారందరికీ షెల్టర్ ఏర్పాటు చేశాడు. రెండు రోజుల నుంచి ఆహారం లేకపోవడంతో వారందరికీ అక్కడే ప్రత్యేక భోజనాలు ఏర్పాటు చేశాడు. అనంతరం అక్కడి నుంచి 17ట్రక్కులను ఏర్పాటు చేసి దాదాపు 200మందిని రెండురోజుల్లో జమ్ముకశ్మీర్ కు తరలించాడు.

, పుల్వామా ఘటనతో జమ్ము విద్యార్ధుల పాలిట దైవంగా మారిన ఇత్రాత్

ఈత్రాత్ ఎవరు..?

ఉత్తర కశ్మీర్ కు చెందిన ఈత్రాత్.. 2008లో క్యాన్సర్ వ్యాధితో తన తల్లిని కోల్పోగా..2011లో గుండెపోటుతో తన తండ్రిని కోల్పోయాడు. ఇతని కుటుంబ సభ్యులంతా అక్కడే నివసిస్తున్నారు.
అయితే కశ్మీర్ లో జీవించడం చాలా కష్టమని. ఈత్రాత్ భావించేవాడు. తను పాఠశాల వెళ్లి వస్తుండగా సైనికులు తమ గుర్తింపు కార్డులను చూపిస్తేనే వదిలేసేవారని తెలిపాడు. అయితే జమ్ముకశ్మీర్ లో ఈ పరిస్థితి ఇలానే ఉంటే ఇక్కడ జీవించడం కష్టమని భావించేవాడు. ఇక్కడ అభివృద్ధి చెందాలంటే ఇక్కడ శాంతినెలకొనాలని ఈత్రాత్ భావించేవాడు. ఇతను మోకానికల్ ఇంజనీరింగ్ చదివిన అనంతరం జమ్ముకశ్మీర్ స్టుడెంట్ ఆర్గనైజేషన్ ప్రారంభించాడు. జమ్ముకశ్మీర్ విషయంలో 1947 నుంచి భారత్, పాక్ ప్రభుత్వాలు రాజకీయం చేస్తున్నాయని ఈత్రాత్ అంటున్నాడు. ఇరు దేశాల మధ్య జమ్ముకశ్మీర్ యువకులు నలిగిపోతున్నారని ఈత్రాత్ తెలిపాడు.

ఎన్డీఏలో చేరాలనుకున్న ఈత్రాత్..

నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఈత్రాత్ చేరాలనుకున్నాడు. అయితే ఎనిమిదవ తరగతిలో ఉన్నప్పుడు ఈ సంస్థలో చేరాలని నిర్ణయించుకున్నాడు. అయితే ప్లస్ టూ చదువుతున్న సమయంలో ఇక ఎన్డీఏ లో చేరేందుకు ప్రయత్నించాడు. అయితే ఇదే సంవత్సరం తనకు ఓ షాక్ తగిలింది. తన కుటుంబ సభ్యులకు సంబంధించిన ఓ ఫంక్షన్ సందర్భంగా ఏర్పాటు చేసుకున్న సౌండ్ సిస్టమ్ విషయంలో అక్కడి సైనికాధికారులు సౌండ్ సిస్టమ్ ను నిలిపివేయించారు. అనంతరం వీరి వద్ద నుంచి గుర్తింపు కార్డులను తీసుకుని విచారణ చేపట్టారు. ఈ సమయంలో ఈత్రాత్ అక్కడి మేజర్ ను కలిశాడు. అయితే నేను ఎన్డీఏ లో చేరాలనుకుంటున్నాను అని ఈత్రాత్ మేజర్ కు తెలియజేయడంతో.. ఆ మేజర్ అన్న వ్యాఖ్యలతో ఈత్రాత్ నిర్ఘాంతపొయాడు. మీ వంటి రాడికల్స్ ఎన్డీఏకు సరిపోరు అంటూ.. మీకు తెలివి ఉండదని.. అవహేళన చేశాడని ఈత్రాత్ తెలిపాడు. దీంతో ఈత్రాత్ తన ఎన్డీఏ కలను కలగానే మిగిల్చుకున్నాడు. అనంతరం తన ఉన్నత చదువులు ముగిసిన వెంటనే జమ్ముకశ్మీర్ స్టుడెంట్ ఆర్గనైజేషన్ ను ప్రారంభించాడు. ఇప్పుడు పుల్వామా ఘటనతో జమ్ముకశ్మీర్ విద్యార్ధులకు ఈ నవయువకుడు దైవంలా మారాడు.

Related Tags