Breaking News
  • దేశంలో కరోనా వైర‌స్ వీర‌విహారం చేస్తోంది. రోజురోజుకూ కేసులు సంఖ్య‌తో పాటు, మరణాల సంఖ్య కూడా ప్ర‌మాద‌క‌ర రీతిలో పెరుగుతోంది. కొత్తగా 24 వేల 850 మంది వైరస్​ సోకింది. మరో 613 మంది క‌రోనా కార‌ణంగా ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా వివ‌రాలు వెల్లడించింది. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,73,165. ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసులు2,44,814. వ్యాధి బారి నుంచి కోలుకున్న‌వారు 4,09,083. క‌రోనాతో మొత్తం ప్రాణాలు విడిచినవారి సంఖ్య 19,268.
  • కోవిడ్-19 వార్ రూమ్ ఏర్పాటు చేయనున్న ఢిల్లీ సర్కారు
  • డీఆర్డీవో నిర్మించిన ఆస్పత్రిలో అన్ని రకాల సదుపాయాలున్నాయి. ఇక్కడ వైద్యం పూర్తిగా ఉచితం. ఆర్మీ వైద్యులు సైవలందిస్తారు. కంటోన్మెంట్లోని చెత్త డంపింగ్ ప్రాంతాన్ని చదును చేసి సర్దార్ పటేల్ ఆస్పత్రిగా మార్చాం. డీఆర్డీవో ఇప్పటి వరకు 70 రకాల దేశీయ వైద్య ఉత్పత్తులు తయారు చేసింది. నెలకు 25,000 వెంటిలేటర్లు తయారు చేసే సామర్థ్యం కలిగి ఉన్నాం. దేశీయ అవసరాలు పోను ఎగుమతి చేసేందుకు కూడా సిద్ధం. జి. సతీశ్ రెడ్డి, డీఆర్డీఓ ఛైర్మన్.
  • రేపటి నుండి తెరుచుకోనున్న హైదరాబాద్లోని పలు మార్కెట్లు. బేగంబజార్ ట్రూప్ బజార్,జనరల్ బజార్ మార్కెట్లు. కరోనా భయం తో స్వచ్చందంగా షాప్స్ మూసేసి షొప్స్ యజమానులు . 10 రోజుల తరువాత రెపటినుండి యధాతధంగా నడవనున్న మార్కెట్లు.
  • చెన్నై : హాస్పిటల్ మూసివేత. చెన్నైలోని విజయా హాస్పిటల్లో కరోనా కలకలం. 50 మందికి పైగా హాస్పిటల్ సిబ్బందికి కరోనా పాజిటివ్. కరోనా తో హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ శరత్ రెడ్డి మృతి. హాస్పిటల్ ఈమెర్జెన్సీ సర్వీసులు నిలిపివేత. హాస్పిటల్లో ఉన్న ఇన్ పేషేంట్ లను ఇతర హాస్పిటల్స్ కు తరలింపు. హాస్పిటల్ లో సిబ్బందికి, వచ్చిన రోగులకు కరోనా టెస్టులు. నెల్లూరు, చిత్తూరు జిల్లాల నుంచి తరచూ వైద్యం కోసం విజయ హాస్పిటల్ కు వెళుతున్న వారిలో ఆందోళన.
  • రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో ప్రధాని మోదీ భేటీ. లద్దాఖ్ పర్యటన నుంచి తిరిగొచ్చిన వెంటనే భేటీ. సరిహద్దు ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మద్ధతు సహా పలు అంశాలపై చర్చ.

ఇదే తుది తీర్పు కావాలి: ఆశాదేవి

This should be final verdict says Ashadevi, ఇదే తుది తీర్పు కావాలి: ఆశాదేవి

ఎట్టకేలకు నిర్భయ దోషులకు ఉరిశిక్ష తేదీ ఖరారయ్యింది. మార్చి 3న నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలుకానుంది. ఆ రోజు ఉదయం 6 గంటలకు ఉరి తీయనున్నారు. ఈమేరకు పాటియాలా కోర్టు కొత్త డెత్ వారెంట్ జారీ చేసింది.

ఇప్పటికైనా తనకు న్యాయం జరుగుతుందని నిర్భయ తల్లి ఆశాదేవి వ్యాఖ్యానించింది. కోర్టుల చుట్టూ ఏడాదిన్నరగా తాను తిరుగుతున్నానని, తాజాగా పాటియాలా కోర్టు  జారీచేసిన డెత్ వారెంట్ ల నేపథ్యంలో ఈసారైనా మార్చి 3న తప్పనిసరిగా దోషులకు ఉరి శిక్ష పడుతుందన్న విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేసింది. ఇదే తుది తీర్పు కావాలని కూడా ఆశిస్తున్నట్లు తెలిపింది.

డిసెంబరు 16, 2012న ఢిల్లీలో ‘నిర్భయ’ అత్యాచారం, హత్య కేసులో ముఖేశ్ కుమార్ సింగ్, పవన్, వినయ్, అక్షయ్ దోషులు. వీరికి మరణ శిక్షలు ఖరారయ్యాయి. అయితే వీరు రకరకాల పిటిషన్లతో ఈ శిక్షల అమలులో జాప్యం జరిగేలా ప్రయత్నించారు. ఆ ప్రయత్నాలకు చెక్ పెడుతూ ట్రయల్ కోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది.

 

Related Tags