ఈ పొంగల్ సినిమా అభిమానులకు రచ్చ రంబోలా

కరోనా ప్రభావం తగ్గింది. ప్రభుత్వాాలు షూటింగులు జరపుకునేందుకు, థియేటర్లు ఓపెన్ చేసుకునేందుకు అనుమతులు ఇచ్చాయి. అయినా కానీ సినిమా వర్గాలను నైరాశ్యం వీడలేదు.

ఈ పొంగల్ సినిమా అభిమానులకు రచ్చ రంబోలా
Follow us

|

Updated on: Oct 29, 2020 | 1:05 PM

కరోనా ప్రభావం తగ్గింది. ప్రభుత్వాాలు షూటింగులు జరపుకునేందుకు, థియేటర్లు ఓపెన్ చేసుకునేందుకు అనుమతులు ఇచ్చాయి. అయినా కానీ సినిమా వర్గాలను నైరాశ్యం వీడలేదు. అవును మరి రకరకాల కాంబినేషన్లు, అనేక రకాల ఈక్వేషన్లు..అన్ని సెట్ అవ్వాలంటే సమయం పడుతుంది. అన్నీ సెట్ చేసి సినిమాలు రిలీజ్ చేసినా… ప్రేక్షకులు గతంలో మాదిరిగా థియేటర్లకి వస్తారో రారో? అనే పరిస్థితులు నెలకున్నాయి. యాభై శాతం సీటింగ్‌ కెపాసిటీతో థియేటర్లలో సినిమాల ప్రదర్శనలు నిర్వహించాల్సి రావడం, అది వర్కువుట్ అవుతుందో లేదో అనే భయం, రేట్లు పెంచితే  సినిమా అనేది సగటు ప్రేక్షకుడికి లగ్జరీగా మారిపోతుందేేమో అన్న అనుమానం..ఇలా చాలా అంశాలు మేకర్స్‌ని వెంటాడుతున్నాయి.

తెలుగు రాష్ట్రాలలో థియేటర్లు కూడా ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. వచ్చే నెలలో థియేటర్ల తలుపులు తెరుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తెలుగు లోగిళ్లలో సినిమా ఎప్పట్నుంచో సంక్రాంతి పండుగలో భాగమయ్యింది. పొంగల్‌కి అన్నా ఈ వైరస్ పీడ పోయి..థియేటర్లు ప్రేక్షకులతో కలకలలాడతాయని అందరూ ఆశతో ఎదురు చూస్తున్నారు.  ఇప్పటికే పలువురు నిర్మాతలు తుది దశకు చేరుకున్న వారి సినిమాలను సంక్రాంతి సందర్భంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. రామ్‌ ‘రెడ్‌’, రానా ‘అరణ్య’, అఖిల్‌ ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్’, రవితేజ ‘క్రాక్‌’ చిత్రాలు సంక్రాంతి రేస్‌లోకి దిగబోతున్నాయి. టాప్ హీరో పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్న ‘వకీల్‌సాబ్’‌ సంక్రాంతికే విడుదలయ్యే చాన్స్ కనిపిస్తోంది. ఇలా ఈ పొంగల్ సినీ ప్రేక్షకులకు నిజమైన పండుగను తీసుకురావాలని ఆశిద్దాం.

Also Read :

హెలికాఫ్టర్‌లో పెళ్లికి వెళ్లిన ఎన్ఆర్ఐ ఫ్యామిలీ… కేసు నమోదు

తుంగభద్ర పుష్కరాలు : స్నానానికి అనుమతి లేదు !

అప్పట్లో పెళ్లి చేసుకుంటే దేవుడికి కూడా కట్నం ఇచ్చేవారట !