కొడుకును బలి తీసుకున్న గుంతలు .. ఆ తండ్రి ఏం చేశాడంటే ?

తన 16 ఏళ్ళ కొడుకు ప్రయాణిస్తున్న బైక్ హఠాత్తుగా ఓ గుంతలో పడిపోవడంతో ఆ యువకుడు మరణించాడు. ముంబైలో మూడేళ్ళ క్రితం జరిగిన ఘటన ఇది.. అయితే తన కుమారుడు ఈ యాక్సిడెంట్ లో చనిపోవడాన్ని తట్టుకోలేని ఆ తండ్రి.. అతనికి నివాళిగానా అన్నట్టు వాటిని పూడ్చడమే పనిగా పెట్టుకున్నాడు. నగర వీధుల్లో మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మిగిలిన గుంతలను పూడుస్తూ వచ్చాడు. 48 ఏళ్ళ దాదారావు బిల్హోరే ‘ ఒక యజ్ఞం ‘ […]

  • Anil kumar poka
  • Publish Date - 11:21 am, Sun, 27 October 19

తన 16 ఏళ్ళ కొడుకు ప్రయాణిస్తున్న బైక్ హఠాత్తుగా ఓ గుంతలో పడిపోవడంతో ఆ యువకుడు మరణించాడు. ముంబైలో మూడేళ్ళ క్రితం జరిగిన ఘటన ఇది.. అయితే తన కుమారుడు ఈ యాక్సిడెంట్ లో చనిపోవడాన్ని తట్టుకోలేని ఆ తండ్రి.. అతనికి నివాళిగానా అన్నట్టు వాటిని పూడ్చడమే పనిగా పెట్టుకున్నాడు. నగర వీధుల్లో మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మిగిలిన గుంతలను పూడుస్తూ వచ్చాడు. 48 ఏళ్ళ దాదారావు బిల్హోరే ‘ ఒక యజ్ఞం ‘ లా తలపెట్టిన కార్యమిది. ఇప్పటివరకు సుమారు 600 గుంతలను ఆయన పూడ్చాడట. తన కొడుకులా మిగిలిన వారెవరూ వీటి బారిన పడి మృతి చెందరాదన్నదే ఆయన ధ్యేయం. ఈ మూడేళ్ళలో ఇలా గుంతల ప్రమాదాల్లో దాదాపు 1500 మంది మరణించారని, ఇకనైనా ఈ అకాల మరణాలకు స్వస్తి చెప్పాలంటే నేను పలుగూ, పారా పట్టుకుని ఇందుకు నడుం కట్టక తప్పలేదని అంటున్నాడు దాదారావు బిల్హోరే. ఈ దేశాన్ని పాట్ హోల్స్ లేని దేశంగా మార్చాలన్న ఆయన లక్ష్యం నెరవేరితే మంచిదే ! ఎవరో వస్తారని,’ ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా ‘ అన్నట్టు ఈ మహత్తర లక్ష్య సాధనకు సమాయత్తమైన ఆయనను అభినందించాల్సిందే.