Breaking News
  • దేశంలో కొనసాగుతున్న కరోనా విజృంభన గడచిన 24 గంటల్లో అత్యధికంగా 24, 879 పాజిటివ్ కేసులు నమోదు కాగా 487 మంది మృతి. దేశంలో కరోన బాధితుల సంఖ్య 7, 67, 296 చేరినట్లు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ. 2, 69, 789 మందికి కొనసాగుతున్న చికిత్స. కరోన నుండి ఇప్పటి వరకు కోలుకున్న 4, 76, 378 మంది బాధితులు. కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 21, 129 మంది మృతి.
  • మూడో రోజు కొనసాగుతున్న సచివాలయం కూల్చివేత పనులు. భారీ బందోబస్తు మధ్య పనులు.. దారులన్నీ మూసివేత. నాలుగు బ్లాకులతో పాటు పాత భవనాలు నేలమట్టం. సమాంతరంగా ఇతర బ్లాకుల్లో కూల్చివేత పనులు. మరో మూడు రోజుల్లో కూల్చివేత పనులు పూర్తి. 15రోజుల పాటు అర్ధరాత్రి వేళ శిధిలాల తరలింపు. వారం పాటు సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.
  • యూపీ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే అరెస్ట్. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్‌లో అరెస్ట్. కొద్ది రోజుల క్రితం డీఎస్పీ సహా 8 మంది పోలీసులను కాల్చి చంపిన వికాస్ దూబే గ్యాంగ్. వికాస్ దూబే కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి గాలింపు. వరుసగా అనుచరుల ఎన్‌కౌంటర్, తాజాగా వికాస్ అరెస్ట్.
  • ప్ర‌ముఖ న‌టుడు, హాస్య‌న‌టుడు జ‌గ్ దీప్ క‌న్నుమూత‌. స‌య్య‌ద్ ఇష్తియాక్‌ అహ్మ‌ద్ జాఫ్రీ అలియాస్ జ‌గ్‌దీప్ క‌న్నుమూశారు. ఆయ‌న‌కు 81 ఏళ్లు. 1939 మార్చి 29న జ‌న్మించిన జ‌గ్‌దీప్‌. 400ల‌కు పైగా చిత్రాల్లో న‌టించిన జ‌గ్‌దీప్‌. షోలే, పురాణ మందిర్‌, అందాజ్ అప్నా అప్నా చిత్రాల‌తో మంచి పేరు. బాల న‌టుడిగా బి.ఆర్‌.చోప్రా అఫ్సానాతో ప‌రిచ‌యం. అబ్ దిల్లి దూర్ న‌హీ, కె.ఎ.అబ్బాస్ చిత్రం `మున్నా`, గురు ద‌త్ చిత్రం `ఆర్ పార్‌`, భిమ‌ల్ రాయ్ చిత్రం `దో బిగా జ‌మీన్‌` చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా న‌టించిన జ‌గ్‌దీప్.
  • హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్. వాహనదారులు హెల్మెట్ ధరించి బైక్ నడపండి. నిన్న గోపాల్‌పురంలో ఒక వ్యక్తి బైక్ పై వెళ్తూ జారిపడి తలకు గాయమైంది.. తరువాత ఆసుపత్రిలో మరణించాడు. బహుశా అతను హెల్మెట్ ధరించి ఉంటే బ్రతికి ఉండేవాడు.. హెల్మెట్ మీ భద్రత కోసం.. పోలీసుల తనిఖీ కోసం కాదు. బైక్ పై వెళ్లేవారు తప్పకుండా హెల్మెట్ పెట్టుకుని ప్రయాణం చేయండి.
  • విశాఖ: కేజీహెచ్ వైరాలజీ ల్యాబ్ లో కరోనా కలకలం. టెస్ట్ లు నిర్బహించే ముగ్గురు టెక్నీషియన్లకు కరోనా పాజిటివ్. ల్యాబ్ లో సేవలందించే 20 మందికి పరీక్షలు.. అందరికీ నెగెటి. వైరాలజీ ల్యాబ్ లో సేవలు తాత్కాలికంగా నిలిపివేత.. ల్యాబ్ లో శానిటైజ్ చేస్తున్న జీవీఎంసీ సిబ్బంది. ప్రత్యామ్నాయంగా కేజీహెచ్ లోని నాకో ల్యాబ్ ను వినియోగిస్తున్న వైద్య సిబ్బంది.

మీ ఫోన్‌లో ఈ యాప్ ఉంటే.. వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ..!

This Keyboard App Is Stealing Money From Android Users: Uninstall It Immediately!, మీ ఫోన్‌లో ఈ యాప్ ఉంటే.. వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ..!

స్మార్ట్ ఫోన్ వచ్చినప్పటి నుంచి.. సౌలభ్యాలు ఎన్ని పెరిగాయో.. అనర్థాలు, మోసాలు కూడా అంతే పెరిగాయి. ఫోన్‌లో ఇంటర్నెట్ ఉన్నప్పుడు ఎదో యాప్‌ డౌన్‌లోడ్ చేయడం అందరికీ అలవాటే. అయితే ఆ యాప్‌లలో కొన్ని మోసాలకు కేరాఫ్ అడ్రస్‌లుగా మారాయి. మన ఫోన్‌లో కొన్ని యాప్స్ డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడు మన ప్రమేయం లేకుండానే కొన్ని ప్రక్రియలు జరిగిపోతుంటాయి. దానికి కారణం కొన్ని మాల్ వేర్ ఎటాక్స్. అన్ని యాప్స్ క్షుణ్ణంగా పరీక్షించి డౌన్‌లోడ్ చేసుకుని.. ఇక మన ఫోన్ సేఫ్ అనుకున్నా.. మళ్లీ ఏదో రూపంలో ప్రమాదం పొంచి ఉంటూనే ఉంది. ఎప్పటికప్పుడు ఈ మాల్‌వేర్ దాడులు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ మాల్‌వేర్‌కు సంబంధించిన యాప్స్‌ని గూగుల్ ఎప్పటికప్పుడు గుర్తిస్తూ డిలీట్ చేస్తూనే ఉంది. అయినా కూడా కొత్తకొత్త యాప్స్‌లో మాల్‌వేర్ మళ్లీ బయటపడుతోంది.

This Keyboard App Is Stealing Money From Android Users: Uninstall It Immediately!, మీ ఫోన్‌లో ఈ యాప్ ఉంటే.. వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ..!

తాజాగా మరోసారి ఇలాంటి పరిస్థితే వచ్చింది. ai.type కీబోర్డ్ యాప్‌లో మాల్‌వేర్ ఉన్న విషయం బయటపడటంతో.. స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది. మొబైల్ టెక్నాలజీ సంస్థ అప్‌స్ట్రీమ్‌కు చెందిన పరిశోధకులు ai.type కీబోర్డ్ యాప్‌ యూజర్లను దోచుకున్న విషయాన్ని బయటపెట్టారు. ఈ యాప్ కీబోర్డ్ ఉపయోగించే వినియోగదారుల బ్యాంకు అకౌంట్లు అటోమెటిక్‌గా ఖాళీ అవుతున్నాయని పేర్కొన్నారు. వినియోగదారుల ప్రమేయం లేకుండానే.. ప్రీమియం థర్డ్ పార్టీ సర్వీసుల్ని సబ్‌స్క్రైబ్ చేస్తున్నట్లు వీరి పరిశోధనలో తేలినట్లు వెల్లడించారు. మీరు కూడా ఒకవేళ ఈ కీబోర్డ్ యాప్ వాడుతున్నారంటే.. మీకు తెలియకుండా మీ అకౌంట్ల నుంచి డబ్బులు ఖాళీ అవుతుంటాయి.

This Keyboard App Is Stealing Money From Android Users: Uninstall It Immediately!, మీ ఫోన్‌లో ఈ యాప్ ఉంటే.. వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ..!

 

ఇప్పటివరకు ఈ మాల్‌వేర్ ఎఫెక్ట్‌తో 1.4 కోట్ల పేమెంట్ రిక్వెస్ట్‌లు జరిగినట్లు అప్‌స్ట్రీమ్‌ పరిశోధకులు వెల్లడించారు. సెక్యూరిటీ-డీ ప్లాట్‌ఫామ్ ద్వారా వచ్చిన ఆ రిక్వెస్టులను బ్లాక్ చేశారు. లక్ష పదివేల డివైజ్‌ల నుంచి ఈ రిక్వెస్ట్‌లు వచ్చినట్లు గుర్తించారు. అయితే ఈ యాప్‌ను ప్లేస్టోర్ నుంచి 2019 జూన్‌లోనే గూగుల్ డిలీట్ చేసింది. అయితే అప్పటికే ఈ యాప్‌ను కొందరు డౌన్‌లోడ్ చేసుకున్నారు. వారంతా డిలీట్ చేయకపోవడంతో.. చిక్కుల్లో పడిపోయారు. ప్రస్తుతం ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులో లేకపోయినా.. థర్డ్ పార్టీ యాప్‌స్టోర్‌లలో ఉంది. అక్కడ్నుంచి లక్షలాది మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్స్ చేస్తూనే ఉన్నారు. ఒకవేళ మీ స్మార్ట్‌ఫోన్‌లో గనుక ఈ యాప్ ఉపయోగిస్తున్నా.. ఉన్నా వెంటనే డిలిట్ చేయడం ఎంతో మంచిది.

 

Related Tags