‘ఇది మీ హిందుత్వ’, గవర్నర్ పై నిప్పులు కక్కిన ఉధ్ధవ్ థాక్రే

మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ థాక్రే, గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ మధ్య హిందుత్వపై రగడ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో ఆలయాలను మళ్ళీ తెరవడంపై ఉధ్ధవ్ కి రాసిన లేఖలో కోష్యారీ..

  • Umakanth Rao
  • Publish Date - 11:37 am, Mon, 26 October 20

మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ థాక్రే, గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ మధ్య హిందుత్వపై రగడ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో ఆలయాలను మళ్ళీ తెరవడంపై ఉధ్ధవ్ కి రాసిన లేఖలో కోష్యారీ.. హిందుత్వ గురించి ప్రస్తావించడం తీవ్ర వివాదానికి దారి తీసింది. విజయదశమి రోజున ఉధ్ధవ్  మళ్ళీ ఈ అంశాన్ని లేవనెత్తుతూ.. ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన ప్రసంగాన్ని గవర్నర్  గమనించాలన్నారు. హిందుత్వ గురించి ఆయన ఏం చెప్పారో చూడండి అన్నారు. మహారాష్ట్రలో బీఫ్ పై బ్యాన్ విషయంలో మీరు అభ్యంతరం చెబుతారని, కానీ పక్కనున్న గోవాలో బ్యాన్ అంశంలో మీకు అభ్యంతరం లేదని సెటైర్ వేశారు. ఇదే మీ హిందుత్వ నినాదమా అని ప్రశ్నించారు. ఈ విషయంలో బీజేపీ ద్వంద్వ విధానాలు పాటిస్తోందని ఆయన ఆరోపించారు, .