Breaking News
  • ఢిల్లీ భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. 2 లక్ష 26 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 226770. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 110960. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 109462. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 6348. . కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • టీవీ9 తో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు. తెలంగాణలో కోవిడ్ కు సంబంధించి అన్ని సిధంగా ఉన్నాయి. ఎవ్వరు భయపడవలసిన అవసరం లేదు. డాక్టర్ల ను కాపాడుకుంటాం. రాష్ట్రంలో ఎడులక్షల ppe కిట్స్. N95మాస్కులు ఎనిమిది లక్షలు ఉన్నాయి.
  • అమరావతి లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపు నేపథ్యంలో ఈ నెల 8వ తేదీ నుంచి అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు తిప్పడానికి రంగం సిద్ధమవుతోంది. బస్సులు తిప్పడానికి అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం పొరుగు రాష్ట్రాలను కోరింది. ఈ విషయంలో తమిళనాడు మినహా తెలంగాణ, కర్ణాటక, ఒడిశా ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని లేఖ రాశారు. ఏపీఎస్‌ ఆర్టీసీ కూడా అంతర్రాష్ట్ర సర్వీసులు తిప్పేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది.
  • ఢిల్లీ: ఢిల్లీలో మాస్కులేకుండా ఇళ్లనుంచి బయటకు వెళ్తే 500 రూపాయల జరిమాన. ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన లెఫ్ట్నెంట్ గవర్నర్. కరోనా కేసులు పెరుగుతున్నందున నేపథ్యంలో ఈ నిర్ణయం.
  • టిటిడి ఏఈవో ధర్మారెడ్డి కామెంట్స్. ఇతర రాష్ట్రాలతో ఉన్నవారు..ఆన్ లైన్లో తిరుమల దర్శన టికెట్ తీసుకున్నప్పటికీ..ఆ టికెట్..రాష్ట్రాల సరిహద్దుల వద్ద ఎంట్రీకి పనికిరాదు. వేరే రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ కి రావాలంటే ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఇచ్చిన సూచనల మేరకు పాసులు తీసుకోవాలి. వీఐపీ బ్రేక్ దర్శనాలు సిఫార్స్ లేఖలు అనుమతించేది లేదు. ఎవరినీ దర్శనాలకి ఎవరికీ రికమండే షన్ పత్రాలు ఇవ్వొద్దు. ఎవరైతే వీఐపీలు ఉన్నారో వారికి మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలకి అనుమతిస్తాము.
  • విశాఖ: సుధాకర్ తల్లి కావేరీ భాయ్. సుధాకర్ కు, నాకు, సుధాకర్ కొడుకు లలిత్ ను సీబీఐ విచారించింది. నా కొడుకును చాలా బాధ పెట్టారు. ఆరోగ్యంగా ఉన్న వాడిని ఆసుపత్రిలో పెట్టి అనారోగ్యానికి పాలు చేశారు. నా బిడ్డకు జరిగిన ట్రీట్ మెంట్.. ఎవరికీ జరగకూడదు సుధాకర్ కు జరిగిన అన్యాయం అందరికీ తెలుసు.. కానీ భయపడి ఎవరూ నోరు విపొఅడం లేదు. పాలకులే కష్టాలు తెచ్చిపెడితే.. ఇంకా కష్టం ఎవరికి చెప్పుకోవాలి. ఇటువంటి ఘటన ఎవరికి జరిగినా నేను నిలబడతా.. వదిలిపెట్టను.

ఫ్రెంచ్ ఫ్రైస్ రోజూ తింటున్నారా.. బీ కేర్‌ఫుల్..!

This is what will happen if you eat french fries or other fry food Every day, ఫ్రెంచ్ ఫ్రైస్ రోజూ తింటున్నారా.. బీ కేర్‌ఫుల్..!

ఫ్రెంచ్ ఫ్రైస్.. అమెరికాలో ఇది ఫేమస్ ఫుడ్.. కానీ ప్రస్తుతం మన భారతీయులు కూడా దీనిని ఎగబడి తింటున్నారు. అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే దేనితోనో తయారు చేసే ఫుడ్ అనుకుంటే పొరబాటే. ఇది మనకు నిత్యం దొరికే బంగాళదుంపతోనే తయారు చేసేవే. సాధారణంగా మన దేశంలో బంగాళదుంపలతో అనేక రకాల ఫ్రైలను తయారు చేస్తారు.  ఆలుగడ్డలను నిలువుగా, సన్నటి ముక్కలుగా కోసే విధానమే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్. అలా కోసిన వాటిని ఆయిల్‌లో ఫ్రై చేసి రెడీ చేస్తారు. ఇవి చాలా రుచికరంగా ఉంటాయి. చిప్స్‌ వలే ఇవి కూడా కరకరలాడతాయి. అయితే ప్రస్తుతం వీటిని చాలా మంది రోజు తినడం చేస్తున్నారు. అలా నిత్యం వీటిని తినడం ద్వారా పలు అనారోగ్య కారణాలకు గురవ్వడం ఖాయమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

నిత్యం ఫ్రెంచ్ ఫ్రైస్ తినడం ద్వారా వచ్చే అనర్థాలు..

* నిత్యం ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ తినడం ద్వారా అధిక బరువు పెరిగే అవకాశం ఉంది.
* వీటిలో పిండి పదార్ధాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు వీటిని ఆయిల్‌లో వేసి తయారు చేస్తారు. దీనితో ఇవి రుచికరంగా ఉన్నా.. శరీరానికి హానీ కల్గిస్తాయి.
* ఈ పిండి పదర్ధాలు శరీరంలో త్వరగా జీర్ణం కాక.. అధికంగా పేరుకు పోవడంతో బరువు పెరుగుతారు.

This is what will happen if you eat french fries or other fry food Every day, ఫ్రెంచ్ ఫ్రైస్ రోజూ తింటున్నారా.. బీ కేర్‌ఫుల్..!
* వీటిని ఆరోగ్యానికి హాని చేసే ట్రాన్స్ ఫాట్స్‌లో ముంచి తీసి.. ఆయిల్ డిప్‌ ఫ్రై చేస్తారు. దీంతో గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ బారిన పడే ప్రమాదం ఉంది.
* అంతేకాదు రోజు తింటే క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంది.
* ఈ ఫ్రెంచ్ ఫ్రైలలో ఉప్పు అధికంగా ఉంటుంది. వీటిని అధికంగా తినడం ద్వారా మనకు తెలియకుండానే శరీరంలోకి సాల్ట్ ఎక్కువగా వెళ్తుంది. దీంతో మనకు బీపీ పెరుగుతుంది. ఇది భవిష్యత్తులో హార్ట్ ఎటాక్, కిడ్నీ వ్యాధుల బారిన పడేలా చేసే అవకాశం ఉంది.

This is what will happen if you eat french fries or other fry food Every day, ఫ్రెంచ్ ఫ్రైస్ రోజూ తింటున్నారా.. బీ కేర్‌ఫుల్..!
* అంతేకాదు వీటిలో అక్రిలామైడ్ ఉంటుంది. ఇది మెదడులోని నరాలను దెబ్బతీయడమే కాకుండా.. నరాల బలహీనత వచ్చే అవకాశం ఉంది. ఇది క్రమంగా న్యూరోడీజనరేటివ్ వ్యాధికి దారితీస్తుంది.

ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఫుడ్‌పై అధ్యయనం చేసిన అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌ వారు ఈ వివరాలు తెలియజేశారు. 45 నుంచీ 79 ఏళ్ల వయసున్న మొత్తం 4,400 మంది డేటా సేకరించిన పరిశోధకులు.. దాదాపు ఎనిమిదేళ్ల పాటు వారిని పరిశీలించారు. వాళ్లంతా ఫ్రెంచ్ ఫ్రైలను వారానికి నాలుగైదు రోజులు తినేవారే. అయితే అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌ వారి పరిశోధన ముగిసేనాటికి వీరిలో 236 మంది చనిపోయారు. సో ఇకనుంచైనా ఫ్రెంచ్ ఫ్రైస్ రోజు తినే అలవాటు ఉన్నవారు.. మానేస్తే మీకే మంచిది. ఎందుకంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది.

Related Tags