అమిత్ షా డిజిటల్ ర్యాలీ.. తేజస్వి యాదవ్ ఫైర్

బీహార్ లో అప్పుడే ప్రధాన పార్టీల మధ్య ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆరోపణల పర్వం ప్రారంభమైంది. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా రాష్ట్రంలో నిర్వహించనున్న డిజిటల్ ర్యాలీపై..

అమిత్ షా డిజిటల్ ర్యాలీ.. తేజస్వి యాదవ్ ఫైర్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 07, 2020 | 5:02 PM

బీహార్ లో అప్పుడే ప్రధాన పార్టీల మధ్య ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆరోపణల పర్వం ప్రారంభమైంది. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా రాష్ట్రంలో నిర్వహించనున్న డిజిటల్ ర్యాలీపై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మండిపడ్డారు. ఓ వైపు రాష్ట్రం,   దేశం కరోనా విలయంతో   సతమతమవుతుండగా అమిత్ షా ఈ ర్యాలీని నిర్వహించడంలోని ఔచిత్యమేమిటని ఆయన ప్రశ్నించారు. కోవిడ్-19, లాక్ డౌన్.. ఈ రెండూ విపత్తును తెచ్చిపెట్టినందుకు వాళ్ళు (జేడీ-యు, బీజేపీ ప్రభుత్వం) సెలబ్రేట్ చేసుకుంటున్నారా అన్నారాయన. ఈ సంవత్సరాంతంలో బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. అమిత్ షా ఈ ర్యాలీకి పూనుకోవడాన్ని తేజస్వి యాదవ్ ఇలా  పరోక్షంగా తప్పు పట్టారు. ఆదివారం ఆయన పాట్నాలో తమ పార్టీ నేతలు, కార్యకర్తలతో బాటు వెరైటీగా స్టీలు ప్లేట్లపై గరిటెలు, స్పూన్లతో పది నిముషాలపాటు కొడుతూ నిరసన తెలిపారు. ఈ నిరసనలో మాజీ సీఎం రబ్రీదేవి కూడా పాల్గొన్నారు. బీహార్ లోని పేదలను ఈ ప్రభుత్వం గూండాలు, దోపిడీదారులుగా పరిగణిస్తోందని తేజస్వి యాదవ్ ఆరోపించారు. కేవలం రాజకీయ దాహాన్ని తీర్చుకోవడం కోసమే బీజేపీ నేతలు డిజిటల్ ర్యాలీల వంటివాటిని ఎంచుకుంటున్నారని ఆయన అన్నారు. ఇలా ఉండగా రానున్న అక్టోబరు లేదా నవంబరు నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలో తేజస్వి యాదవ్ ని తమ పార్టీ సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ నేతలు ప్రకటించారు.