Breaking News
  • 'మా' అసోసియేషన్‌లో ముసలం. నిన్నటి నుంచి తెరుచుకోని ఆఫీస్‌ తలుపులు. అధ్యక్ష, కార్యదర్శుల మధ్య విభేదాలతో ఆఫీస్‌కు రాని సిబ్బంది. మాట్లాడేందుకు నిరాకరించిన కార్యవర్గ సభ్యులు.
  • బిల్లులపై చర్చ జరగకుండానే ఏపీ మండలి వాయిదా పడే అవకాశం. బిల్లుపై చర్చకు ఒప్పించేందుకు వైసీపీ సభ్యుల ప్రయత్నాలు. అంగీకరించని విపక్ష సభ్యులు. రూల్‌ 71పై చర్చ జరగాలని పట్టుబట్టిన విపక్ష సభ్యులు.
  • హైదరాబాద్‌: ధరమ్‌ కరం రోడ్‌లో పిచ్చికుక్కల స్వైరవిహారం. 10 మంది చిన్నారులకు తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.
  • తిరుమల: రథసప్తమి సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. రథసప్తమి సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు. మాడ వీధుల్లో షెడ్లు ఏర్పాటు-టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి.
  • హైదరాబాద్‌: రాష్ట్రంలో రాజకీయాలను డబ్బు శాసిస్తోంది. రాజ్యాధికారం సాధిస్తేనే విద్య, ఉద్యోగాలు వస్తాయి-లక్ష్మణ్‌. డబ్బుతో రాజకీయాలు నడపడం అప్రజాస్వామికం. దళితుల హక్కుల కోసం చేసే పోరాటంలో బీజేపీ ముందుంటుంది -తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌.

‘ ముద్దుల పాపా ! అంత చిరాకెందుకమ్మా ?’

The infant's scowling face, ‘ ముద్దుల పాపా ! అంత చిరాకెందుకమ్మా ?’

పుట్టి మూడు వారాలైనా కాలేదు. కానీ అప్పుడే పెద్ద ఆరిందాలా ముఖం పెట్టి బోసి నవ్వులను తనలోనే దాచుకుంటోంది ఆ చిన్నారి. పాపలు కిలకిలా నవ్వుతుంటే అరవిరిసిన పువ్వులే గుర్తుకొస్తాయి. కల్లా కపటం తెలియని వారి అమాయక చూపులు కట్టి పడేస్తాయి. అల్లరి చేసినా.. చేయకున్నా..అందాల పసిమొగ్గలను చూస్తే మనసు భారాన్ని తగ్గించుకుని రిలాక్స్ ఫీలవడం మానవ సహజం. అయితే మనం చూస్తున్నది ఓ గడుగ్గాయి పాప ముఖం.

అమెరికాలోని ఓహియో లో జస్ట్.. మూడు వారాల క్రితమే పుట్టిన లూనా మూసా అనే పాపాయిని ఫోటో తీయడానికి ఉత్సాహంతో వచ్చాడో ఫోటోగ్రాఫర్. అసలు నవ్వితే చాలు.. నవరత్నాలు రాలకపోయినా.. ఫోటో షూట్ కోసం ఆ పాప ముఖమే చాలనుకుంటూ తన కెమెరాకు పని చెప్పాడు. కానీ ఆ చిట్టితల్లి గట్టిదే ! ఫేస్ బిడాయించుక్కూచుంది. మొత్తం ప్రపంచంలోని చిరాకంతా తన ముఖంలోనే ఉన్నట్టు కదిలితే ఒట్టు ! ఇప్పుడే ఇలా ఉంటే.. ఇక కాస్త పెద్దయితే ఈ చిన్నారి వైనం చెప్పాలా ? ఏమైతేనేం.. ఈ చిట్టి అమ్మడి ఫేస్ ఇంటర్నెట్ ని షేక్ చేసేస్తోంది. ‘ గ్రంపీ ఎక్స్ ప్రెషన్.. మార్వెలస్.. సో క్యూట్.. ‘ అనే కామెంట్స్ కి కొదవేలేదు.. ఇక సోది ఆపి.. ఆ చిన్నారిని అలా వదిలేద్దాం.. మరీ చిరాకు పెట్టేస్తే ఆ ముఖం ఇంకా నెట్ లో దుమారం రేపడం ఖాయం..