Breaking News
  • అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు. నగరాల ప్రజలు బయటకు వెళ్లకుండా కట్టడి చేయాలి. వలస కూలీలకు వసతులు, సకాలంలో వేతనాలు చెల్లించేలా చూడాలి. విద్యార్థులు, కార్మికులను ఖాళీ చేయాలని కోరినవారిపై చర్యలు-కేంద్రం.
  • దేశవ్యాప్తంగా ఆల్కహాల్‌ విత్‌డ్రాల్‌ సిండ్రోమ్‌ . కేరళలో మద్యానికి బానిసై ఆరుగురు ఆత్మహత్య. ఆల్కహాల్‌ లేదన్న బాధతో షేవింగ్‌ లోషన్‌ తాగిన ఓ వ్యక్తి. తెలంగాణలో మద్యం దొరకడంలేదని ప్రాణం తీసుకున్న ఓ వ్యక్తి. తెలంగాణలో కల్లు దొరకక ఓ వ్యక్తి వింత ప్రవర్తన. ట్రాన్స్‌ఫార్మర్‌ను పట్టుకోవడంతో మృతి.v
  • తూ.గో: ఉ.6 నుంచి 10 వరకు నిత్యావసరాల కొనుగోలుకు అనుమతి. జిల్లాలో ఐదు ఐసోలేషన్‌ పడకలు సిద్ధం-మంత్రి పిల్లి సుభాష్‌. 15 వేల మంది ఉండేలా క్వారంటైన్‌ కేంద్రాలు. అక్వా రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం-మంత్రి పిల్లి సుభాష్‌.
  • ప్రధాని మోదీకి రాహుల్‌ లేఖ. మన దేశం పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రభుత్వ చర్యలకు సహకరించడానికి సిద్ధం-రాహుల్‌. లక్షల సంఖ్యలో రోజువారీ కూలీలు ఉన్నారు. లాక్‌డౌన్‌తో చాలామంది ప్రజలు చనిపోయే పరిస్థితి. లక్షలాది మంది యువత సొంత గ్రామాలకు వెళ్తున్నారు. వారిలో కరోనా ఉంటే తల్లిదండ్రులు, వృద్ధులకు సోకే అవకాశం. కొత్త ఆస్పత్రుల నిర్మాణం వెంటనే చేపట్టాలి-రాహుల్‌.
  • స్పైస్‌ జెట్‌ పైలట్‌కు కరోనా పాజిటివ్‌. మార్చి 21న చెన్నై నుంచి ఢిల్లీకి విమానాన్ని నడిపిన పైలట్‌. స్వీయ నిర్బంధంలోనే పైలట్‌.

అవయవదానంపై అలుపెరుగని పోరాటం.. దేశాలకే ఈ జంట ఆదర్శం

This Indian American Couple have been on the road for 400 days, అవయవదానంపై అలుపెరుగని పోరాటం.. దేశాలకే ఈ జంట ఆదర్శం

అతనో ప్రవాస భారతీయుడు.. ఇండియాలో పుట్టి అమెరికాలో సెటిలైన వ్యక్తి.. పేరు అనిల్ శ్రీవత్స.. ఔత్సాహిక పారిశ్రామికవేత్త అయినా అవయవదాన ప్రాముఖ్యత గురించి ఎంతో తెలిసినవాడు. 2014 లో తన సోదరుడికి తన కిడ్నీని డొనేట్ చేసినప్పటినుంచి..ఆయన నిస్వార్థంగా అవయవదానం గురించి ప్రచారం చేయడం ప్రారంభించారు. ‘ గిఫ్ట్ ఆఫ్ లైఫ్ ‘ పేరిట ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి.. ప్రచారోద్యమాన్ని నిర్వహిస్తూ.. 43 దేశాలు చుట్టారాయన. కారులో రోడ్డు మార్గం ద్వారా లక్ష కిలోమీటర్లకు పైగా ప్రయాణించడమే కాదు..  ఏకధాటిగా 400 రోజులు తన వాహనంలో సాగుతూ.. వివిధ దేశాల్లోని 73 వేల మందితో తన ప్రచారాన్ని షేర్ చేసుకున్నాడట.. ‘ నా సోదరుడికి  నేను ప్రేమతో కిడ్నీని దానం చేశాను..అదే ప్రేమ, అభిమానాలలోని విశేషం. విధిలేని పరిస్థితుల్లో ఉన్న ఓ అపరిచితుడికి ఒకరు అవయవదానం చేస్తే.. ఆ వ్యక్తి మీద ఆ అపరిచితుని ప్రేమ అంతాఇంతా కాదు.. అందుకే ప్రతిఫలాన్ని ఆశించక ఈ ప్రచారోద్యమాన్ని చేపట్టాను ‘ అంటాడు అనిల్ శ్రీవత్స.

ఈయన భార్య దీపాలి కూడా తన భర్త ‘సాహస యాత్ర’లో మమేకమైపోతుంది. ఆయనకు చేదోడువాదోడుగా నిలుస్తోంది. కారులోనే వంట వండడం, నిద్రించడం అలవాటు చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక నగరాల్లోని స్కూళ్ళు, కాలేజీలు, రోటరీ క్లబ్బుల్లోను, ఆఫీసుల్లోనూ, కమ్యూనిటీ సెంటర్లలోనూ ప్రసంగాలు చేసే అనిల్.. అవయవదానంపై ప్రజల్లో ఉన్న భయాలు, అపోహలను తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే అవయవదానానికి సంబంధించిన  లీగల్, ప్రొసీజరల్ సమస్యలు, వాటి పరిష్కార మార్గాలను కూడా ఆయన సూచిస్తున్నారు. 1997 -2006 మధ్య కాలంలో  ‘అనిల్ కీ ఆవాజ్’ పేరిట అమెరికా అంతటా రేడియో టాక్ షో నిర్వహించి లిమ్కా బుక్ రికార్డులకెక్కారు. ఇక…  తన స్వఛ్చంద సంస్థ తరఫున వచ్ఛే మార్చి నెలలో న్యూయార్క్ నుంచి ఆర్జెంటీనా వరకు కొత్త ప్రయాణానికి రెడీ అవుతున్నారు అనిల్ శ్రీవత్స.This Indian American Couple have been on the road for 400 days, అవయవదానంపై అలుపెరుగని పోరాటం.. దేశాలకే ఈ జంట ఆదర్శం

 

 

Related Tags