Breaking News
  • అసెంబ్లీ సాక్షిగా ఐదు కోట్ల ఆంధ్రులను మోసం చేశారు. న్యాయం చేయమని రోడ్డుపైకి వచ్చిన మహిళను అరెస్ట్ చేస్తున్నారు. మహిళలపై లాఠీచార్జ్‌ దారుణం-నారా లోకేష్‌. మండలిలో రేపు ఏం జరుగుతుందో ప్రజలే చూస్తారు-లోకేష్‌.
  • బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఎన్నిక సంతోషకరం. తెలంగాణ తరపున అభినందనలు తెలిపాం. తెలంగాణపై దృష్టిపెట్టాలని కోరాం-టీఎస్‌ బీజేపీ చీఫ్‌ డా.లక్ష్మణ్‌. త్వరలో తెలంగాణలో జేపీ నడ్డా పర్యటిస్తారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ ఒక గూటి పక్షులే-డా.లక్ష్మణ్‌.
  • అమరావతి: పవన్‌తో పోలీసుల మంతనాలు. రాజధాని గ్రామాల పర్యటన వాయిదా వేసుకోవాలంటున్న పోలీసులు.
  • కరీంనగర్‌లో గంజాయి ముఠా గుట్టురట్టు. రూ.30 లక్షల విలువైన గంజాయి పట్టివేత. ముగ్గురు అరెస్ట్‌, ట్రక్‌ స్వాధీనం.
  • చెన్నై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత. అబుదాబి నుంచి చెన్నైకి తరలిస్తున్న 3.7 కేజీల బంగారం పట్టివేత. ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న కస్టమ్స్ అధికారులు.

లిక్కర్ కిక్కుకు ఆక్సిజన్ బోనస్.. ఢిల్లీ బార్‌లో సూపర్ ఆఫర్

This Delhi Bar Is Offering People Oxygen For Rs 300 For 15 Minutes!, లిక్కర్ కిక్కుకు ఆక్సిజన్ బోనస్.. ఢిల్లీ బార్‌లో సూపర్ ఆఫర్

హస్తినలో కాలుష్య తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. దాన్ని నియంత్రించడానికి సీఎం అరవింద్ కేజ్రీవాల్ తగిన చర్యలు చేపడుతున్నారు. ఇదిలా ఉంటే దీపావళీ అనంతరం ఢిల్లీలో వాయు కాలుష్యం తారాస్థాయికి పెరిగిపోయింది. అక్కడ నివసిస్తున్న ప్రజలు మాస్కులు ధరించకుండా రోడ్లపైకి రావాలంటేనే కష్టతరం అయిపొయింది. దీంతో రాజధాని వాసులకు స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించాలనే ఉద్దేశంతో లోకల్‌గా ఉన్న ఓ బార్ కేవలం రూ.299కే స్వచ్ఛమైన ఆక్సిజన్ పీల్చుకునే అవకాశం కలిపిస్తోంది. వినడానికి విచిత్రంగా ఉన్నా.. ఇదొక చిత్రమైన ఆఫర్.

దేశ రాజధానిలోని సాకేత్ ప్రాంతానికి చెందిన ఆక్సీప్యూర్ బార్‌లో కేవలం రూ.299 చెల్లిస్తే.. 15 నిమిషాలు స్వచ్ఛమైన ఆక్సిజన్ పీల్చుకోవచ్చట. ఈ ఏడాది మే నెలలో ఈ బార్ ప్రారంభం కాగా.. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కస్టమర్లకు స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించాలని ఆ అద్భుతమైన ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. అయితే ఈ ఆఫర్‌కు కండిషన్స్ అప్లై అంటున్నారు బార్ నిర్వాహకులు. ఒక్క రోజుకు.. ఒక కస్టమర్ మాత్రమే దీన్ని ఉపయోగించుకోవచ్చని వారు తెలిపారు. ఇక కస్టమర్ల కోసం స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను పలు రకాల ఫ్లేవర్లలో సిద్ధం చేశారు. దీన్ని పీల్చుకోవడానికి ప్రత్యేకమైన పరికరాలను కూడా ఇస్తారు. కాగా, త్వరలోనే ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కూడా ఓ బార్ ఏర్పాటు చేస్తామని నిర్వాహకులు చెబుతున్నారు.