సిగరెట్‌ మానండి..ఆఫర్‌ పట్టండి..ఉద్యోగులకు ఓ కంపెనీ బంపర్‌ బొనాంజా

పొగతాగడమనేది ఆరోగ్యానికి హానికరం. ధూమపానానికి బానిసలై ఎంతోమంది బలైపోతున్నారు. ఐతే ప్రభుత్వాలు కూడా స్మోకింగ్‌ ఈజ్‌ ఇంజ్యూరియస్‌ టూ హెల్త్‌ అని ప్రకటనలకు మాత్రమే పరిమితమవుతాయి. కానీ జపాన్‌లోని ఓ కంపెనీ మాత్రం తమ ఉద్యోగుల ఆరోగ్యమే..సంస్థకు మహాభాగ్యమని వినూత్న ఆలోచన చేసింది. ఫైన్‌లు, బలవంతంగా కాకుండా ఆఫర్ల ద్వారాఉద్యోగులను స్మోకింగ్‌కు దూరం చేయాలనుకుంది. అనుకున్నదే తడవుగా ఆచరణలోకి తెచ్చేసింది. సిగరెట్స్‌ తాగని వారికి ఏడాదిలో అదనంగా 6 సెలవులిస్తున్నట్లు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. టోక్యోకు చెందిన […]

సిగరెట్‌ మానండి..ఆఫర్‌ పట్టండి..ఉద్యోగులకు ఓ కంపెనీ బంపర్‌ బొనాంజా
Follow us

| Edited By: Srinu

Updated on: Dec 02, 2019 | 4:20 PM

పొగతాగడమనేది ఆరోగ్యానికి హానికరం. ధూమపానానికి బానిసలై ఎంతోమంది బలైపోతున్నారు. ఐతే ప్రభుత్వాలు కూడా స్మోకింగ్‌ ఈజ్‌ ఇంజ్యూరియస్‌ టూ హెల్త్‌ అని ప్రకటనలకు మాత్రమే పరిమితమవుతాయి. కానీ జపాన్‌లోని ఓ కంపెనీ మాత్రం తమ ఉద్యోగుల ఆరోగ్యమే..సంస్థకు మహాభాగ్యమని వినూత్న ఆలోచన చేసింది. ఫైన్‌లు, బలవంతంగా కాకుండా ఆఫర్ల ద్వారాఉద్యోగులను స్మోకింగ్‌కు దూరం చేయాలనుకుంది. అనుకున్నదే తడవుగా ఆచరణలోకి తెచ్చేసింది. సిగరెట్స్‌ తాగని వారికి ఏడాదిలో అదనంగా 6 సెలవులిస్తున్నట్లు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది.

టోక్యోకు చెందిన మార్కెటింగ్‌ సంస్థ పియాలా ఐఎన్‌సీ కార్యాలయం..బిల్డింగ్‌లోని 29వ ఫ్లోర్‌లో ఉంటుంది. అక్కడి నుంచి ఉద్యోగులు కిందికి వచ్చి పొగ తాగడానికి కనీసం 15 నిమిషాలుపడుతుంది. దీంతో సిగరెట్‌ తాగని ఓ ఉద్యోగి..స్మోకింగ్‌ చేసేందుకు వెళ్తున్నవారి వల్ల సమయం వృథా అవుతోందని..ఫలితంగా తమపై పనిభారం పడుతోందని పేపర్‌పై రాసి కంపెనీ కంప్లైంట్‌ బాక్స్‌లో వేశాడు. దీన్ని చూసిన సీఈవో స్మోకింగ్‌ చేయని వారికి 6 అదనపు సెలవులు ఇవ్వాలని నిర్ణయించారు. వెంటనే ఈ కాన్సెప్ట్‌కు శ్రీకారం చుట్టారు.

ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఈ విధానం అమలులోకి వచ్చింది. ఇప్పటికే కొంతమంది ఈ ఆఫర్‌ను ఉపయోగించుకుంటున్నారు. మరోవైపు టైమ్‌ వేస్ట్‌ అవకుండా సంస్థను డెవలప్‌ చేసుకోవడంతో పాటు..ఉద్యోగుల ఆరోగ్యంపైనా శ్రద్ధ చూపిస్తున్నసంస్థపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లు ఇటు కంపెనీకి ప్రయోజనం..అటు ఎంప్లాయ్‌ హెల్త్‌..ఇలా రెండు రకాలా లాభమేనని కొనియాడుతున్నారు.