ఈ ద్రాక్ష గుత్తి ధర అక్షరాలా రూ.7.5 లక్షలు! నమ్ముతారా?

ద్రాక్ష పండు చూడగానే అందరికి సహజంగానే నోరూరుతుంది. ఇంక లేటు చెయ్యడం ఎందుకు అని ఒక రూ.50 లేదా రూ.100 పెట్టి ఒక కేజీనో..అరకేజీనో కొనేసి ఎంచక్కా తినేస్తాం. అంతే కద సింపుల్ అంటారా!..అయితే మీకు దిమ్మతిరగే న్యూస్ ఒకటి చెప్తాం. ఒక ఎర్రని ద్రాక్ష గుత్తి వెల 11 వేల డాలర్లు(భారత కరెన్సీలో రూ.7.5 లక్షలు)లు అంటే మీరు నమ్ముతారా?. నిజమండి అదే ధరకు ఒక ద్రాక్ష గుత్తి అమ్ముడుపోయింది. వామ్మో.. ఒక ద్రాక్ష గుత్తికి అంత ధరా? అంత స్పెషల్ ఏముందనే కదా మీ ప్రశ్న? మీ డౌటు ఇప్పడు క్లారిఫై అయిపోతుంది.

రుబీ రోమన్ గ్రేప్స్‌గా పిలిచే ద్రాక్ష పండ్లను చాలా అరుదుగా పండిస్తారు. ఎంతో అందంగా, ఎర్రగా కనిపించే ఈ ద్రాక్ష పండ్లను 2008 నుంచి పండించడం మొదలుపెట్టారు. జపాన్‌లోని ఇషికావా దీవిలో పరిమిత సంఖ్యలో వీటిని పండిస్తారు. సీజన్లో మొదటి విక్రయానికి ముందు ఒక ద్రాక్ష గుత్తిని వేలానికి పెడతారు. దీన్ని కొనుగోలు చేసేందుకు వందలాది మంది ఔత్సాహికులు పోటీపడతారు. ఈ ఏడాది మొదటి ద్రాక్ష గుత్తిని రీసెంట్‌గా కనజవాలో వేలానికి పెట్టారు.

జపాన్‌కు చెందిన ప్రముఖ గాయకుడు తకాషీ హొసాకవా ఈ ద్రాక్ష గుత్తిని వేలంలో గెలుచుకున్నాడు. దీనికి రూ.11 వేల డాలర్లను చెల్లించనున్నాడు. మొత్తం ఈ గుత్తిలో 24 ద్రాక్ష పండ్లు ఉన్నాయి. సాధారణ రోజుల్లో ఈ జాతి ద్రాక్ష గుత్తి ధర 460 డాలర్లు (రూ.31,537) వరకు ఉంటుందట. ద్రాక్ష తినాలన్నా కూడా కొన్నిసార్లు పెట్టి పుట్టాలండోయ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *