‘సాహో’కి మొదటి ఛాయిస్ ‘ఆమె’.. కానీ!

Katrina Kaif Is The First Choice For Saaho, ‘సాహో’కి మొదటి ఛాయిస్ ‘ఆమె’.. కానీ!

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘సాహో’. ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ టాలీవుడ్‌కు పరిచయం కాబోతోంది. కాగా ఈ మూవీలో అమ్రితా నాయర్ పాత్రలో కనిపించనున్న ఈ భామ భారీ రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా చిత్ర యూనిట్ మొదట్లో హీరోయిన్‌ను ఎంపిక చేసే విషయంలో చాలా సమయం తీసుకున్న విషయం తెలిసిందే.

ఆయితే తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేయాలని చిత్ర యూనిట్ భావించిందట. కానీ ఆమె దాదాపు 5 కోట్ల రెమ్యునరేషన్ అడగటంతో.. మేకర్స్ శ్రద్ధాను తీసుకున్నారని తెలుస్తోంది. కాగా ‘సాహో’ సినిమా మరో 8 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *