Breaking News
  • దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై మహిళా సంఘాల అభ్యంతరం. ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా హైకోర్టుకు లేఖ రాసిన మహిళా సంఘాలు. కస్టడీలో ఉన్న నిందితులను ఎలా ఎన్‌కౌంటర్‌ చేస్తారని లేఖ. కోర్టులో కేసు నడుస్తుండగా చట్టాన్ని ఎలా చేతుల్లోకి తీసుకుంటారు. ఎన్‌కౌంటర్‌ చేసిన వారిపై చర్యలు తీసుకునేలా డీజీపీని ఆదేశించాలి. మృత దేహాలకు ఫోరెన్సిక్‌ నిపుణులతో పోస్టుమార్టం చేయించాలి. పోస్టుమార్టం వీడియో తీయించాలి-లేఖలో మహిళా సంఘాలు. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అందుబాటులో లేకపోవడంతో సోమవారం విచారిస్తామన్న హైకోర్టు.
  • కేంద్రీయ సైనిక్‌ బోర్డ్‌కు పవన్‌కల్యాణ్‌ విరాళం. కోటి రూపాయలు విరాళం ప్రకటించిన పవన్‌కల్యాణ్‌. స్వయంగా ఢిల్లీ వెళ్లి డీడీ అందిస్తా-పవన్‌కల్యాణ్‌.
  • ఎన్‌కౌంటర్లు సమస్యకు పరిష్కారం కాదు-ట్విట్టర్‌లో ఆర్జీవీ. సమాజంలో ఉద్రేకాలను తగ్గించేందుకు ఎన్‌కౌంటర్లు దోహదం చేయొచ్చు-ట్విట్టర్‌లో రామ్‌గోపాల్‌వర్మ.
  • తూ.గో: ఆంధ్రా పాలిటెక్నిక్‌ కాలేజ్‌లో విద్యార్థులపై దాడి. విద్యార్థులపై దాడి చేసిన బయటి వ్యక్తులు. ఇద్దరు విద్యార్థులకు గాయాలు పోలీసులకు ఫిర్యాదు, కేసు నమోదు.
  • గుంటూరు: పిడుగురాళ్ల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు. లెక్కలు చూపని రూ.56,700 స్వాధీనం, కేసు నమోదు.
  • ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైంది-చంద్రబాబు ట్వీట్‌. ఉల్లి ధరలతో జనం అల్లాడుతుంటే దేశమంతా ధరలు పెరిగాయని వైసీపీ మంత్రులు చెప్పడం హాస్యాస్పదం-ట్విట్టర్‌లో చంద్రబాబు. ఆరు నెలల్లోనే రాష్ట్రాన్ని దళారుల రాజ్యంగా మార్చారు. ఒక్క ఉల్లి మాత్రమే కాదు.. నిత్యావసరాల ధరలన్నీ చుక్కలనంటాయి. రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అన్నారు.. ఏమైంది. ఉల్లి కోస్తే వచ్చే కన్నీళ్లు.. ఉల్లిని కొంటున్నప్పుడే వస్తున్నాయి. ఉల్లి ధరల తడాఖా ఏంటో స్థానిక సంస్థల్లో మహిళలు చూపిస్తారు -ట్విట్టర్‌లో చంద్రబాబు
  • మహబూబ్‌నగర్‌: దిశ నిందితుల మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తి. రాత్రికి మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాస్పత్రిలోనే నిందితుల మృతదేహాలు. రేపు మహబూబ్‌నగర్ ఆస్పత్రికి వెళ్లనున్న ఎన్‌హెచ్ఆర్సీ ప్రతినిధులు. ఎన్‌హెచ్‌ఆర్సీ ప్రతినిధుల బృందం పరిశీలించిన తర్వాతే నిందితుల మృతదేహాలకు అంత్యక్రియలు. మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాస్పత్రి దగ్గర భారీగా పోలీస్‌ బందోబస్తు.

80 ఏళ్ల యోగా బామ్మ..ఆసనాలు చూస్తే..అవాక్కే !

This 80-Year-Old Grandmom’s Yoga Postures Will Shock you!, 80 ఏళ్ల యోగా బామ్మ..ఆసనాలు చూస్తే..అవాక్కే !

గత దశాబ్ధ కాలంగా  మన జీవన శైలిలో అనేక రకాల మార్పులు చోటు చేసుకున్నాయి. పెరిగిన జీవన వేగంతో పాటు కాలుష్యం కారణంగా ..లెక్కకు మించిన అంతుబట్టని అనారోగ్యాలతో సగటు మనిషి సతమతమవుతున్నాడు. ఆదాయాలు పెరిగినంతగా మనిషి జీవన ప్రమాణాలు పెరగటం లేదు. లెక్కకు మించిన వైద్య విధానాలు ఉన్నప్పటికీ చెప్పుకోదగ్గ ఫలితాలు కనిపించటం లేదు. మంచి ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ ఉండాలంటే..మనం తినే తిండి విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఫిట్‌నెస్‌గా ఉండాలంటే..యోగా, జిమ్‌, వాకింగ్‌ లాంటివి చేస్తుంటారు. అయితే, ఆరోగ్యంతో పాటు మనసు ప్రశాంతంగా ఉండాలంటే..యోగా ఎంతో మంచిదని పెద్దలు చెబుతుంటారు. మనసు ఉల్లాసంగా ఉండాలే గానీ, వయసుతో నిమిత్తం లేకుండా ఎలాంటి పనులైనా ఈజీగా చేసుకోవచ్చు. అందుకే చాలా మంది ప్రశాంతతను కోరుకుంటారు. దానికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తోంది యోగా. తాజాగా 85 ఏళ్ల ఓ బామ్మ తన యోగాసనాలతో వావ్‌ అనిపిస్తోంది.

ఆమెకు ఆస్పత్రి అంటే తెలియదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఆ అవసరం రాలేదు కాబట్టి. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొలనూరు గ్రామంలో నివసిస్తున్న జిగురు కనకలక్ష్మికి 85 ఏళ్లు. ఇప్పటివరకు ఆమెకు చిన్న జ్వరం కూడా రాలేదట. కనకలక్ష్మికి ఐదుగురు సంతానం. నలుగురు కుమారులు, ఓ కూతురు ఉన్నారు. అయితే, ఎనిమిది పదుల వయసు దాటినప్పటికీ తన శరీరాన్ని హరివిల్లుల వంచేస్తూ కఠినమైన యోగాసనాలను అవలీలగా వేస్తుంది. తన ఆరోగ్య రహస్యం..ప్రతినిత్యమూ వ్యాయామము, యోగా అని గర్వంగా చెబుతుంది.
మనిషి జీవితంలో సమస్యలు అందరికీ వస్తాయని, శ్రమపడితేనే రోగాలు దరిచేరవని అంటున్న బామ్మ..గత 20 ఏళ్ల క్రితమే మాంసాహారాన్ని పూర్తిగా వదిలేసి, కేవలం శాఖాహారం భోజనంతోనే జీవిస్తున్నానని చెబుతుంది. ఏదేమైనప్పటికీ క్రమం తప్పకుండా యోగా చేస్తానని, ఒక్కరోజు యోగా చేయకపోతే..శరీరం లేజీగా తయారవుతుందని అంటోంది. తన పనులన్నీ తానే చేసుకుంటూ..అద్భుతమైన యోగాసనాలు వేస్తున్న కనకలక్ష్మిని చూసి గ్రామస్తులు సైతం నివ్వెర పోతున్నారు. నేటి తరం యువత ఈ బామ్మను ఆదర్శంగా తీసుకుని ఆరోగ్యంగా జీవించాలని స్థానికులు సూచిస్తున్నారు.