ఒంటికాలిపై దర్శనమిచ్చే… తిరువిక్రమ స్వామి ఆలయం!

అక్కడ ఉన్న ఆ ఆలయాన్ని భూలోక స్వర్గం అని పిలుస్తుంటారు. సహజంగా దేవుళ్ళు నిల్చోని దర్శనం ఇస్తారు, లేదా కూర్చోని దర్శనమిస్తుంటారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో శయన స్థితిలో దర్శనమిస్తుంటారు. అయితే ఇక్కడ స్వామి వారు ఎడమకాలిపై నిలబడి, కుడికాలిని గాలిలోకి ఎత్తిన భంగిమలో దర్శనం ఇస్తుంటారు. అలా ఎందుకు స్వామి వారు దర్శనమిస్తారు? ఈ దేవతా మూర్తిని దర్శించినప్పుడు సహజంగా ప్రతి భక్తునికి కలిగే ఆలోచనతోపాటు… ఆశ్చర్యం. అయితే అందుకు కారణం లేకపోలేదని అంటున్నారు స్థానికులు. […]

ఒంటికాలిపై దర్శనమిచ్చే... తిరువిక్రమ స్వామి ఆలయం!
Follow us

| Edited By:

Updated on: Oct 14, 2019 | 11:05 AM

అక్కడ ఉన్న ఆ ఆలయాన్ని భూలోక స్వర్గం అని పిలుస్తుంటారు. సహజంగా దేవుళ్ళు నిల్చోని దర్శనం ఇస్తారు, లేదా కూర్చోని దర్శనమిస్తుంటారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో శయన స్థితిలో దర్శనమిస్తుంటారు. అయితే ఇక్కడ స్వామి వారు ఎడమకాలిపై నిలబడి, కుడికాలిని గాలిలోకి ఎత్తిన భంగిమలో దర్శనం ఇస్తుంటారు. అలా ఎందుకు స్వామి వారు దర్శనమిస్తారు? ఈ దేవతా మూర్తిని దర్శించినప్పుడు సహజంగా ప్రతి భక్తునికి కలిగే ఆలోచనతోపాటు… ఆశ్చర్యం. అయితే అందుకు కారణం లేకపోలేదని అంటున్నారు స్థానికులు. అలాగే విచిత్ర భంగిమలో నిల్చొని దర్శనమిచ్చే ఈ ఆలయానికి సమీపంలో ఉన్న నదికి చాలా ప్రత్యేకత ఉంది. మరి స్వామివారు ఇలా దర్శన ఇవ్వడం వెనుక పురాణం కథ ఏమిటి? వివరాల్లోకెళితే…

తిరువిక్రమ పెరుమాళ్ ఆలయం తమిళనాడు రాష్ట్రం, విలుప్పురం జిల్లాలో తిరుక్కోవళ్ళూర్ అనే గ్రామం ఉంది. ఇది విల్లిపురానికి ఉత్తరంవైపు 45కి.మీ దూరంలో ఉంది. ఇక్కడే తిరువిక్రమ పెరుమాళ్ అనే ఆలయం ఉంది.

శ్రీవైష్ణవ దివ్య క్షేత్రం 

శ్రీమహావిష్ణువు 108 దివ్య క్షేత్రాలలో ఈ దేవాలయం ఒకటి. ఇక్కడ విష్ణువును ‘ఉలగలంత పెరుమాళ్’ గా, లక్ష్మి దేవిని ‘పూంగుతై’ గా కొలుస్తున్నారు ఈ ఆలయాన్ని ఇది రెండు వేల సంవత్సరాల కిత్రం పల్లవరాజులు నిర్మించారని ప్రసస్థి.

దక్షిణ భారతదేశంలో ఎత్తైన స్థంబాలలో ఇది మూడవది

ఈ ఆలయ నిర్మాణం అనేక దశలలో జరిగినట్లు ఇక్కడ ఉన్న శాసనాల ద్వారా తెలుస్తున్నది. ఈ ఆలయంలో నాలుగు స్థంబాలున్నాయి. అందులో తూర్పువైపుగా ఉన్న స్థంభం 195 అడుగుల ఎత్తు ఉంది. అయితే దక్షిణ భారతదేశంలో ఎత్తైన స్థంబాలలో ఇది మూడవదిగా చెబుతారు.

పురాణ కథ పూర్వం ఒక సారి దేవాలయం పక్కనే ఉన్న మృకండమహర్షి ఆశ్రమంలోని ఒక మూలకి ముగ్గురు ఆళ్వారులు వర్షం నుండి రక్షించుకోవడం కోసం అక్కడ నిల్చొన్నారు. అయితే వీరు ముగ్గరు ఆశ్రమంలో ఉన్న ఒక ఇరుకు గదిలో ఒక రాత్రి అంతా నిలబడి మాట్లాడుకుంటుండగా, వారి మధ్య ఎవరో నిలబడి ఉండటం వలన గది మరింత ఇరుకుగా ఉన్నట్లు అనిపించింది. అప్పుడు ఆ గదిలో వారికి పెరుమాళ్ విగ్రహం దర్శనమిచ్చింది. ఆ దృశ్యాన్ని చూసిన ఆళ్వారుల మనస్సు ఆనందంతో పులకరించింది.

మూలవిరాట్ తిరువిక్రమస్వామి

ఈ ఆలయంలోని మూలవిరాట్ పేరు తిరువిక్రమస్వామి . ఈ స్వామి వారు సుమారు 21 అడుగుల ఎత్తు ఎడమకాలిపై నిలబడి కుడికాలిని గాలిలోకి ఎత్తిన భంగిమలో ఉంటారు. కుడిచేత శంఖం, ఎడమచేత చక్రం ధరించి ఉంటుంది. స్వామి వారి యొక్క కుడి చేతి చూపుడు వేలు పైకి చూపెడుతూ భక్తులకు దర్శనిమిస్తారు.

పూర్వం ఒకప్పుడు బలిచక్రవర్తి పాతాళానికి త్రొక్కిన తర్వాత పూర్వం ఒకప్పుడు బలిచక్రవర్తి పాతాళానికి త్రొక్కిన తర్వాత ఇచట వెలసినట్లు స్థలపురాణం తెలుపుతున్నది. అందువల్లే స్వామి వారు ఒంటికాలిపైన నిలబడి ఉన్నారని స్థలపురాణం తెలియజేస్తున్నది. ఈ స్వామి వారిని తమిళంలో అయ్యన్నార్ అని కూడా పిలుస్తారు. ఇక్కడి అమ్మవారి పేరు పుషవల్లితాయార్.

మరో విశేషం ఏంటంటే

ఈ ఆలయానికి ఆనుకుని పెన్నానది ప్రవహిస్తుంది. అయితే ఒకప్పుడు బ్రహ్మదేవుడు గంగలో కాళ్ళు కడుక్కుని ఇక్కడికి వచ్చి త్రివిక్రమస్వామికి ఆరాధన చేసేవాడట. ఆ సమయంలో బ్రహ్మదేవుని పాదములకు ఉన్న గంగాజలం బొట్లు అక్కడ నేలపై పడి పెన్నా నదిగా మారినది. అందుకే ఈ నదిని కూడా గంగా నది అంత పవిత్రంగా భావిస్తారు. ఈ పెన్నానదిని దర్శించినవారికి సర్వపాపాలు హరించుకుపోతాయి. ఇక బుషులు ముక్తి పొందిన స్థలంగా మరియు భూలోక స్వర్గంగా తిరుక్కోవళ్లూర్ ను పేర్కొంటారు.

తెన్ తిరుప్పేరై నుండి ఆళ్వార్ తిరునగరి పోవు మార్గమున కాలిబాట మార్గములో ఈ క్షేత్రము గలదు.

చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!