మూడో బిడ్డను కావాలంటే… ఓటు హక్కు వదులుకోవాల్సిందేనా..?

Ramdev On Population Control, మూడో బిడ్డను కావాలంటే… ఓటు హక్కు వదులుకోవాల్సిందేనా..?

మన దేశంలో జనాభా పెరుగుదలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా సూచించారు. వచ్చే యాభై ఏళ్లలో భారత్‌ జనాభా 150 కోట్లకు మించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. ఎందుకంటే, అంతకంటే ఎక్కువమందికి మనం సౌకర్యాలు ఇవ్వలేమని అన్నారు. దంపతులెవరూ ఇద్దరు పిల్లలను మించి కనకూడదని చట్టం తీసుకొచ్చినప్పుడే ఇది సాధ్యపడుతుందని.. ఒకవేళ వారు మూడో బిడ్డను కంటే.. కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఆ బిడ్డకు ఓటు హక్కు కల్పించకూడదని, ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేలా నిషేధం విధించాలని సూచించారు. ప్రభుత్వ పథకాల ద్వారా అందే లబ్ధి మూడో బిడ్డకు అందకుండా చూడాలని.. మతంతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరూ జనాభా నియంత్రణ పాటించాలని బాబా రాందేవ్ సూచించారు.

కాగా, గోవధ,మద్యంలపై సంపూర్ణ నిషేధం విధించాలని కూడా రాందేవ్ డిమాండ్ చేశారు. ఇస్లామిక్ దేశాల్లో మాదరి మన దేశంలోనూ మద్యం ఉత్పత్తి, అమ్మకం, విక్రయాలను బ్యాన్ చేయాలని.. రుషులకు జన్మస్థలమైన భారత్ లో మద్య నిషేధంపైనా, గోవధపైనా సంపూర్ణ నిషేధం విధించాలన్నారు. ఇలా చేయడం ద్వారా గోవుల పేరుతో జరుగుతున్న దాడులు నియంత్రణలోకి వస్తాయని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *