కుమారస్వామి రాజకీయ వైరాగ్యం..!

కర్నాటక మాజీ సీఎం, జేడీఎస్ అధ్యక్షుడు కుమారస్వామి ఇక త్వరలో రాజకీయ వైరాగ్యం తీసుకోనున్నారు. రాజకీయాల్లోకి రావడం, సీఎంగా అవ్వడం అన్నీ.. అనుకోకుండా జరిగాయన్నారు. దశాబ్దన్నరకాలం కర్ణాటక రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన కుమారస్వామి.. శనివారం హాసన్‌, మండ్య జిల్లా కె.ఆర్‌.పేటలలో కార్యకర్తల సమావేశాల్లో పాల్గొన్నారు. రాజకీయాల నుంచి దూరంగా వెళ్లిపోవాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు. రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని దేవుడు నాకు కల్పించాడు. సీఎం పదవిలో ఏ ఒక్కరినో సంతృప్తి పరచడానికి లేనని..14 నెలల కాలంలో రాష్ట్రాభివృద్ధికి […]

కుమారస్వామి రాజకీయ వైరాగ్యం..!
Follow us

| Edited By:

Updated on: Aug 04, 2019 | 12:15 PM

కర్నాటక మాజీ సీఎం, జేడీఎస్ అధ్యక్షుడు కుమారస్వామి ఇక త్వరలో రాజకీయ వైరాగ్యం తీసుకోనున్నారు. రాజకీయాల్లోకి రావడం, సీఎంగా అవ్వడం అన్నీ.. అనుకోకుండా జరిగాయన్నారు. దశాబ్దన్నరకాలం కర్ణాటక రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన కుమారస్వామి.. శనివారం హాసన్‌, మండ్య జిల్లా కె.ఆర్‌.పేటలలో కార్యకర్తల సమావేశాల్లో పాల్గొన్నారు. రాజకీయాల నుంచి దూరంగా వెళ్లిపోవాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు. రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని దేవుడు నాకు కల్పించాడు. సీఎం పదవిలో ఏ ఒక్కరినో సంతృప్తి పరచడానికి లేనని..14 నెలల కాలంలో రాష్ట్రాభివృద్ధికి ఎంతో కృషి చేశానన్నారు. ఇక ప్రశాంతంగా జీవించాలనుకుంటున్నానని, రాజకీయాల్లో కొనసాగాలని లేదని చెప్పారు.