Credit Card బిల్లులు చెల్లించేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి!

బిల్లు వచ్చినప్పుడు దాన్ని ఒకేసారి కట్టలేక.. కనీస చెల్లింపు లేదా మొత్తం అమౌంట్‌ను ఈఎమ్‌ఐలోకి మార్చడం లాంటి పనులు చేస్తూంటారు. నిజానికి ఈ రెండు పనులు చేయడం తప్పే..

Credit Card బిల్లులు చెల్లించేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి!
Follow us

| Edited By:

Updated on: Feb 21, 2020 | 6:23 PM

Credit Card bill: క్రెడిట్ కార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం రూ.10వేల జీతం తీసుకుంటోన్న ప్రతీ ఒక్కరికీ క్రెడిట్ కార్డు ఉంటుంది. అందులోనూ బ్యాంకులు ఇచ్చే బోలెడు ఆఫర్లు ఇస్తుండటంతో.. ఇప్పుడు ప్రతీ ఒక్కరి దగ్గరా క్రెడిట్ కార్డ్స్ ఉంటున్నాయి. అందులోనూ.. డబ్బు లేని సమయంలో ఈ క్రెడిట్ కార్డు బాగా ఉపయోగపడుతుంది. ముందుగానే బ్యాంకు నుంచి సొమ్మును అప్పుగా వాడేసి.. తరువాత బిల్లును చెల్లిస్తున్నాం. వాడుకున్నంత సేపూ బాగానే ఉన్నా.. నెలసరి బిల్లు వచ్చే సరికి మాత్రం కళ్లు తిరుగుతాయ్. వచ్చే జీతం అటు క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక.. ఇటు ఇంట్లోకి సరిపెట్టలేక సతమతమవుతుంటారు.

దీంతో.. బిల్లు వచ్చినప్పుడు దాన్ని ఒకేసారి కట్టలేక.. కనీస చెల్లింపు లేదా మొత్తం అమౌంట్‌ను ఈఎమ్‌ఐలోకి మార్చడం లాంటి పనులు చేస్తూంటారు. నిజానికి ఈ రెండు పనులు చేయడం తప్పే. మనకు తెలియకుండానే వీటితో పీకల్లోతు అప్పుల్లోకి కూరుకుపోవల్సి వస్తుంది. ఇక్కడే మనం ఒక విషయం ఆలోచించాలి. మన జీతం కంటే.. అధికంగా క్రెడిట్ కార్డు బిల్లు వచ్చిందంటే.. డబ్బు విషయంలో మనం సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదని అర్థమవుతుంది.

కాబట్టి.. క్రెడిట్ కార్డు బిల్లు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు వాడకుండా.. మన నెలసరి జీతాన్ని బట్టి ఖర్చు చేసుకోవడం ఉత్తమం. అలాగే.. ప్రతీ నెలా వచ్చే జీతంలో కనీసం వెయ్యి నుంచి 5 వేల లోపు డబ్బును పొదుపు చేయడం ఉత్తమం. ఎందుకంటే.. అత్యవసర ఆపదలు వచ్చినప్పుడు అవి బాగా ఉపయోగపడతాయి.

అలాగే.. క్రెడిట్ కార్డు బిల్లులు కట్టేటప్పుడు ఎప్పుడైనా వాయిదాల(ఈఎమ్‌ఐ)‌ జోలికి వెళ్లకపోవడమే ఉత్తమం. ఎందుకంటే.. అసలు కన్నా అధికంగా.. దానిపై వడ్డీలను చెల్లించాల్సి ఉంటుంది. దీంతో తెలియకుండా మనం అధికంగా డబ్బులు కట్టాల్సివస్తుంది. ఒక వేళ ఉన్నా.. వీలైనంత త్వరగా వాటిని క్లియర్ చేసుకోవడం మంచింది.

ఓడినా ప్రపంచ రికార్డ్ లిఖించిన బెంగళూరు జట్టు.. అదేంటంటే?
ఓడినా ప్రపంచ రికార్డ్ లిఖించిన బెంగళూరు జట్టు.. అదేంటంటే?
ప్రభాస్ కోసం స్పెషల్ గిఫ్ట్ పంపిన వేణు స్వామి సతీమణి.. వీడియో
ప్రభాస్ కోసం స్పెషల్ గిఫ్ట్ పంపిన వేణు స్వామి సతీమణి.. వీడియో
జనసేనకు భారీ ఊరట.. ఆ పార్టీకే గాజు గ్లాస్ గుర్తు..!
జనసేనకు భారీ ఊరట.. ఆ పార్టీకే గాజు గ్లాస్ గుర్తు..!
చెన్నై ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. గాయపడిన ధోని..
చెన్నై ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. గాయపడిన ధోని..
కాలి బొటన వేలు కంటే.. పక్కన వేలు పొడుగ్గా ఉందా.. దానికి అర్థం ఇదే
కాలి బొటన వేలు కంటే.. పక్కన వేలు పొడుగ్గా ఉందా.. దానికి అర్థం ఇదే
ఐశ్వర్య రాయ్ పాటకు ఇరగదీసిన ప్రేమలు హీరోయిన్.. వీడియో వైరల్..
ఐశ్వర్య రాయ్ పాటకు ఇరగదీసిన ప్రేమలు హీరోయిన్.. వీడియో వైరల్..
ఫేస్‌బుక్ యూజర్లకు గుడ్ న్యూస్.. మెసెంజర్‌లో మరో కొత్త ఫీచర్
ఫేస్‌బుక్ యూజర్లకు గుడ్ న్యూస్.. మెసెంజర్‌లో మరో కొత్త ఫీచర్
యూజర్లకు షాకిచ్చిన మస్క్‌..ఇక వారు కూడా ఫీజు చెల్లించాల్సిందే..
యూజర్లకు షాకిచ్చిన మస్క్‌..ఇక వారు కూడా ఫీజు చెల్లించాల్సిందే..
అసలు సమరం షురూ! నామినేషన్ల పర్వానికి సర్వం సిద్ధం
అసలు సమరం షురూ! నామినేషన్ల పర్వానికి సర్వం సిద్ధం
బెంగళూరుకు 'మాస్టర్‌స్ట్రోక్'‌తో ఇచ్చిపడేసిన హెడ్
బెంగళూరుకు 'మాస్టర్‌స్ట్రోక్'‌తో ఇచ్చిపడేసిన హెడ్