బాసర రైల్వేస్టేషన్‌లో దొంగల ముఠా కలకలం

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర రైల్వేస్టేషన్‌లో దొంగలు ప్రయాణికులను భయబ్రాంతులకు గురిచేశారు. దాదాపుగా 10 మంది మారణాయుధాలతో స్టేషన్‌లోకి ప్రవేశించారు. కత్తులు, గొడ్డళ్లతో హల్‌చల్ చేశారు. ప్రయాణికులను భయపెడుతూ చోరీలకు పాల్పడ్డారు. పార్కింగ్‌లో ఉన్న మూడు ద్విచక్ర వాహనాలను ఎత్తుకెళ్లారు. స్థానికుల సమాచారంతో పోలీసులు స్టేషన్‌కు చేరుకున్నారు. దీంతో దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు వెంబడించడంతో పొలాల్లో తమతో తెచ్చుకున్న బైక్‌లను వదిలి వెళ్లిపోయారు. పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *