సంక్రాంతికి ఊరెళ్తున్నారా ? అయితే జాగ్రత్త.. మీరు వెళ్ళే విషయాలను ఎవరికైనా షేర్ చేస్తే అంతే సంగతులు..

సంక్రాంతి పండగ సందడి మొదలైంది. పట్నంలో ఉన్నవారు పల్లె బాట పట్టారు. దాదాపు నగరం సగం వరకు ఖాళీ అయిపోయింది.

సంక్రాంతికి ఊరెళ్తున్నారా ? అయితే జాగ్రత్త.. మీరు వెళ్ళే విషయాలను ఎవరికైనా షేర్ చేస్తే అంతే సంగతులు..
Follow us

|

Updated on: Jan 13, 2021 | 1:32 PM

సంక్రాంతి పండగ సందడి మొదలైంది. పట్నంలో ఉన్నవారు పల్లె బాట పట్టారు. దాదాపు నగరం సగం వరకు ఖాళీ అయిపోయింది. ఇదే అదునుగా దొంగలు తెగ రెచ్చిపోతున్నారు. తాళం వేసిన ఇళ్ళే లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్‏లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈస్ట్ జోన్ పరిధిలో వరుస ఇళ్ళ దొంగతనాలు చేసిన అబ్దుల్ జాఫర్‏ని అదుపులోకి తీసుకున్నాం. అతని దగ్గరి నుంచి 23 తులాల బంగారం, డైమండ్ ఆర్నమెంట్‏తోపాటు అతని బైక్‏ను సీజ్ చేశామని హైదరాబాద్ సీపీ అంజినీ కుమార్ అన్నారు. వీరి దగ్గరి నుంచి సీజ్ చేసిన వాటి విలువ 12 లక్షలు ఉంటుందని తెలిపారు. 2006 నుంచి ఇప్పటివరకు ఇతనిపై మొత్తం 66 ఇళ్ళ దొంగతనాల కేసులున్నాయని.. సౌత్ జోన్ పరిధిలో హాబీబ్ అజమత్ అనే దొంగను కూడా అరెస్ట్ చేశామని తెలిపారు. అజమత్ పార్ట్నర్ షారుఖ్ పరారీలో ఉన్నాడని.. అజమత్ నుంచి 10 లక్షల 50 వేల విలువైన 20 తులాల బంగారంతోపాటు ఆటోను కూడా సీజ్ చేశామన్నారు. ఇతనిపై ఇప్పటివరకు దాదాపు 30 కేసులున్నాయన్నారు. సంక్రాంతి ఊరు వెళ్ళేవారు స్థానిక పీఎస్‏లో ఇన్‏ఫార్మ్ చేసి వెళ్ళాలని.. అలాగే సీసీ కెమెరాల స్టోరేజ్ డివైజ్ పనిచేస్తుందా లేదా అనేది చెక్ చేసుకొని వెళ్ళాలని తెలిపారు. ఇక ఊరు వెళ్ళే విషయాలను సోషల్ మీడియాలో ఎవరితోనూ షేర్ చేసుకోవద్దని తెలిపారు.

Also Read: ‘వ్యక్తిగతంగా నా జీవితంలో ఓ సంఘటన జరిగింది’.. ఆసక్తికర విషయాలను బయటపెట్టిన స్టైలిష్ స్టార్..

సురేఖ ఒప్పుకోదేమో అనుకున్నా.. ఆ సమయంలో ఇంట్లో కూర్చొని చాలా బాధపడ్డా.. ఎమోషనల్ అయిన మెగాస్టార్..

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?