Breaking News
  • విజయవాడ: ప్రకాశం బ్యారేజ్‌ దగ్గర ఉద్రిక్తత. ధర్నాచౌక్‌ నుంచి మందడం బయల్దేరిన కర్నాటక రైతులు. అనుమతిలేదంటూ ప్రకాశం బ్యారేజ్‌ దగ్గర అడ్డుకున్న పోలీసులు.
  • చంద్రబాబుతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ భేటీ. అమరావతి కార్యాచరణపై చర్చ.
  • మైలవరం ఫారెస్ట్ అధికారిపై వైసీపీ మండలాధ్యక్షుడు దాడికియత్నం. అటవీ భూమిని చదును చేస్తుండగా అడ్డుకున్న ఫారెస్ట్ అధికారి . ఫారెస్ట్‌ అధికారితో వాదనకు దిగిన వైసీపీ నేత పామర్తి శ్రీను.
  • ప.గో: చంద్రబాబుది యూటర్న్‌ గవర్నమెంట్‌ అయితే.. జగన్‌ది రద్దుల గవర్నమెంట్‌. మంగళగిరిలో లోకేష్‌ ఓడిపోయి.. మండలిలోకి వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలు అడుకుంటున్నారు. రాజకీయ పునరావాసానికి మండలి వేదికగా మారింది-బీజేపీ నేత అంబికా కృష్ణ.
  • తూ.గో: తునిలో కారులో ఇరుక్కున్న మూడేళ్ల బాలుడు. మూడేళ్ల బాబును కారులో వదిలి వెళ్లిన తల్లిదండ్రులు. కారు డోర్లు లాక్‌ కావడంతో ఉక్కిరిబిక్కిరైన బాలుడు. కారు అద్దాలు పగలగొట్టి చిన్నారిని కాపాడిన స్థానికులు.

ఈ దొంగోడి కష్టం వృథా అయ్యిందంట.. ఇంటి ఓనర్‌ను తిడుతూ లేఖ రాసి..

Thief Calls Houseowner 'Kanjoos' in a Note after He Returns Empty-Handed, ఈ దొంగోడి కష్టం వృథా అయ్యిందంట.. ఇంటి ఓనర్‌ను తిడుతూ లేఖ రాసి..

దొంగతనం చేయడం అంటే అంత ఈజీ అనుకున్నారా..? ఎంతో కష్టపడి ఇంటి తాళం కానీ.. కిటికీలు కానీ పగలగొట్టి.. లోపలికి ఎంటర్ కావాలి. ఇది ఓ దొంగోడి అభిప్రాయం. అయితే ఒక్కోసారి కొందరు దొంగలు చేసే పనులు చూస్తే.. వింతగానే కాదు.. నవ్వు కూడా వస్తుంది. అలాంటి ఘటనే ఒకటి మధ్యప్రదేశ్‌లో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలోని ఆదర్శనగర్‌‌లో డిసెంబర్ 4వ తేదీన ఓ ప్రభుత్వ సంస్థలో ఇంజనీరింగ్‌గా పనిచేస్తున్న పర్వేశ్ సోనీ అనే అతని ఇంట్లో చోరీ జరిగింది. అయితే ఓ దొంగ సదరు ఇంట్లోకి కిటికీ పగులగొట్టి చొరబడ్డాడు. అయితే ఆ కిటికీలు పగులగొట్టడానికి ఆ దొంగకు తీవ్రంగా కష్టపడాల్సి వచ్చిందట. అయితే ఎట్టకేలకు ఎలాగూ ఇంట్లోకి ఎంటర్ అయ్యాక.. తీరా చూస్తే.. అక్కడ దోచుకోడానికి ఏం లేవట. దీంతో చిర్రెత్తిపోయిన దొంగ.. అన్ని రూమ్స్‌ జల్లెడపట్టాడట. అయినా కూడా ఏం దొరకలేదట.

Thief Calls Houseowner 'Kanjoos' in a Note after He Returns Empty-Handed, ఈ దొంగోడి కష్టం వృథా అయ్యిందంట.. ఇంటి ఓనర్‌ను తిడుతూ లేఖ రాసి..

దీంతో తీవ్ర ఆగ్రహంతో ఆ ఇంటి యజమానిని గుర్తు చేసుకున్నాడట. నేను ఇంత కష్టపడి వస్తే.. కనీసం చిల్లి గవ్వ లేకుండా ఇంటిని పెడతావా.. నీ అంత కంజూస్ వాడు ఎక్కడ కూడా ఉండటంటూ ఓ లేఖ రాసి వదిలి వెళ్లాడట. అంతేకాదు.. ఆ లేఖలో ఆ ఇంటి ఓనర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడట. నేను కిటికీ తొలగించడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా అంటూ.. నీ అంత పిసినారి ఎవరూ ఉండరంటూ తన ఆక్రోశాన్ని లేఖ రూపంలో వదిలి.. దిగాలుగా వెనుదిరిగాడట. అయితే మరుసటి రోజు ఉదయం.. ఇంట్లో పనిచేయడానికి వచ్చిన ఆ ఇంటి పనివాళ్లకు ఈ దొంగోడి లేఖ దొరికింది. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. కాగా, దీనికి సంబంధించిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Thief Calls Houseowner 'Kanjoos' in a Note after He Returns Empty-Handed, ఈ దొంగోడి కష్టం వృథా అయ్యిందంట.. ఇంటి ఓనర్‌ను తిడుతూ లేఖ రాసి..