తెలుగు బిగ్ బాస్: ఆ ముగ్గురిదే భారీ రెమ్యునరేషన్.. వారెవరంటే?

‘బిగ్ బాస్’.. వివాదాలు ఎన్ని ఉన్నా ఈ షోకి ప్రేక్షకాదరణ మాత్రం అంతకంతకూ పెరుగుతూనే ఉంటుంది. 2006వ సంవత్సరంలో హిందీలో ఆరంభమైన ఈ రియాలిటీ షో ఫ్రాంచైజీ.. 2018కి కన్నడ, మలయాళీ, తెలుగు, తమిళ, మరాఠీ, బెంగాలీ భాషల్లో కూడా ఫేమస్ కావడం విశేషం. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ హోస్టుగా మొదటి సీజన్ హిట్ కాగా.. రెండో సీజన్‌కు నాని హోస్టుగా వ్యవహరించాడు. అయితే ఈ సీజన్‌లో నాని కంటే కంటెస్టెంట్ కౌశల్‌కే ఎక్కువ పేరొచ్చిందని చెప్పాలి. […]

తెలుగు బిగ్ బాస్: ఆ ముగ్గురిదే భారీ రెమ్యునరేషన్.. వారెవరంటే?
Follow us

|

Updated on: Nov 06, 2019 | 3:13 PM

‘బిగ్ బాస్’.. వివాదాలు ఎన్ని ఉన్నా ఈ షోకి ప్రేక్షకాదరణ మాత్రం అంతకంతకూ పెరుగుతూనే ఉంటుంది. 2006వ సంవత్సరంలో హిందీలో ఆరంభమైన ఈ రియాలిటీ షో ఫ్రాంచైజీ.. 2018కి కన్నడ, మలయాళీ, తెలుగు, తమిళ, మరాఠీ, బెంగాలీ భాషల్లో కూడా ఫేమస్ కావడం విశేషం. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ హోస్టుగా మొదటి సీజన్ హిట్ కాగా.. రెండో సీజన్‌కు నాని హోస్టుగా వ్యవహరించాడు. అయితే ఈ సీజన్‌లో నాని కంటే కంటెస్టెంట్ కౌశల్‌కే ఎక్కువ పేరొచ్చిందని చెప్పాలి. ‘కౌశల్ ఆర్మీ’ పూర్తిగా బిగ్ బాస్ ఓటింగ్ సిస్టమ్‌ను శాసించిందని చెప్పొచ్చు.

ఇది ఇలా ఉండగా అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరించిన మూడో సీజన్ తాజాగా పూర్తయిన సంగతి తెలిసిందే. ఎన్నో మలుపులు, ట్విస్టులతో ఈ సీజన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా రాహుల్ అండ్ పునర్నవిల మధ్య కెమిస్ట్రీ ఒక వర్గం ప్రేక్షకులను విపరీతంగా అలరించాయని చెప్పొచ్చు. ఇకపోతే రాక్‌స్టార్ రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ విన్నర్ కాగా.. యాంకర్ శ్రీముఖి రన్నరప్‌గా నిలిచింది. ఇక ఆ తర్వాత బాబా భాస్కర్, వరుణ్ సందేశ్, అలీ రెజాలు తర్వాత స్థానాల్లో ఉన్నారు.

ఇకపోతే ఇప్పటివరకు జరిగిన తెలుగు బిగ్ బాస్ సీజన్లలో ముగ్గురు కంటెస్టెంట్లు మాత్రమే భారీ పారితోషికం అందుకున్నారు. సీజన్ 1‌లో పాల్గొన్న నటుడు సమీర్ వారానికి 10 లక్షలు అందుకోగా.. సీజన్ 3లో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి వారంలోనే ఎగ్జిట్ అయిన నటి హేమ వారానికి 9.7 లక్షలు అందుకున్నట్లు సమాచారం. వీరితో పాటు ప్రస్తుతం హౌస్‌లో ఉన్న యాంకర్ శ్రీముఖి 100 రోజులకు 3 కోట్లు పారితోషికం పుచ్చుకుందని తెలుస్తోంది. అటు వరుణ్ సందేశ్ కూడా కోటి రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం.