ప్రపంచాన్ని శాసిస్తున్న టాప్ 10 కంపెనీలు

ఫుడ్ అండ్ బేవరేజ్ విభాగంలో ప్రపంచంలో కేవలం పది కంపెనీలు మాత్రమే ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాయి. నెస్లె, పెప్సికో, కోకో కోలా, యూనిలివర్, డానోన్, జెనరల్ మిల్స్, కెల్లోగ్స్, మార్స్, అసోసియేటెడ్ బ్రిటిష్ ఫుడ్స్, మాండెలెజ్ అనేవి ఆ పది కంపెనీలు. జాన్సన్ అండ జాన్సన్ కంపెనీ కూడా వీటితో పోటీపడుతోంది. ఈ కంపెనీలు ప్రతి ఏడాది వేల‌ కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. కెల్లోగ్స్ కంపెనీకి ప్రధానంగా ఇగ్గో, ప్రింజెల్స్, చీజ్ వంటి బ్రాండ్లు ఉన్నాయి. అసోసియేటెడ్ […]

ప్రపంచాన్ని శాసిస్తున్న టాప్ 10 కంపెనీలు
Follow us

| Edited By:

Updated on: Mar 21, 2019 | 3:53 PM

ఫుడ్ అండ్ బేవరేజ్ విభాగంలో ప్రపంచంలో కేవలం పది కంపెనీలు మాత్రమే ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాయి. నెస్లె, పెప్సికో, కోకో కోలా, యూనిలివర్, డానోన్, జెనరల్ మిల్స్, కెల్లోగ్స్, మార్స్, అసోసియేటెడ్ బ్రిటిష్ ఫుడ్స్, మాండెలెజ్ అనేవి ఆ పది కంపెనీలు. జాన్సన్ అండ జాన్సన్ కంపెనీ కూడా వీటితో పోటీపడుతోంది. ఈ కంపెనీలు ప్రతి ఏడాది వేల‌ కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి.

కెల్లోగ్స్ కంపెనీకి ప్రధానంగా ఇగ్గో, ప్రింజెల్స్, చీజ్ వంటి బ్రాండ్లు ఉన్నాయి. అసోసియేటెడ్ బ్రిటిష్ ఫుడ్స్‌కు డోర్సెట్ సెరెల్స్, ట్వినింగ్స్ టీ, ప్రిమార్క్ వంటి బ్రాండ్లను కలిగి ఉంది. జెనరల్ మిల్స్ విషయానికి వస్తే.. ఇది చీరియోస్, చెక్స్, యోప్లైట్, హంబర్గర్ హెల్పర్, హాజెన్ దాస్, బెట్టీ క్రకర్ వంటి బ్రాండ్లను నిర్వహిస్తోంది.

కోకాకోలా విషయానికి వస్తే కోకాకోలాతోపాటు దసాని, ఫ్యూజ్, హనెస్ట్ టీ వంటి బ్రాండ్లను కలిగి ఉంది. యూనిలివర్ తన పోర్ట్‌పోలియోను డైవర్సిఫైడ్ చేసింది. యాక్స్ బాడీ స్ప్రే, లిప్టన్ టీ, మాగ్నమ్ ఐస్ క్రీమ్, హెల్‌మన్స్ మయోనైజ్ వంటి బ్రాండ్లను నిర్వహిస్తోంది.

డానోన్‌కు యాక్టివా, యోక్రంచ్ వంటి పలు బ్రాండ్లు ఉన్నాయి. అలాగే ఈ కంపెనీ మెడికల్ న్యూట్రిషన్ ప్రొడక్టులను కూడా విక్రయిస్తుంది. మాండెలెజ్ కంపెనీ ఓరియో, ట్రిడెంట్ గమ్, సోర్ ప్యాచ్ కిడ్స్ వంటి బ్రాండ్లను కలిగి ఉంది. మార్స్ కంపెనీకి ఎక్కువగా చాకోలెట్ బ్రాండ్లు ఉన్నాయి. ఎంఅండ్ఎం, ఆర్బిట్ గమ్, స్ట్రాబర్స్, అంకుల్ బెన్స్ రైస్ వంటి బ్రాండ్లను నిర్వహిస్తోంది.

పెప్సికో పెప్సి మాత్రమే కాకుండా క్వాకర్ ఓట్‌మీల్, చీటోస్, ట్రోపికానా వంటి బ్రాండ్లను కలిగి ఉంది. ఇక చివరిగా నెస్లె విషయానికి వస్తే.. దీనికి గర్జర్ బాడీ ఫుడ్, పెరియర్, డిజియార్నో, హాట్ పాకెట్స్ ప్లస్, కిట్‌కాట్, బట్టర్‌ఫింగర్ వంటి బ్రాండ్లు ఉన్నాయి.