‘నాకు పెట్టకుండా నువ్వే తింటావా’.. వైరల్ వీడియో

Thers no fooling this baby eating ice cream, ‘నాకు పెట్టకుండా నువ్వే తింటావా’.. వైరల్ వీడియో

సాధారణంగా పిల్లలకు తెలియకుండా పెద్దవాళ్లు తినాల్సిన పరిస్థితి అప్పుడప్పుడు ఏర్పడుతుంది. ముఖ్యంగా ఐస్‌క్రీమ్‌ల వంటివి తినాల్సి వస్తే మరీ జాగ్రత్తగా పడతారు. ఎందుకుంటే అలాంటి పదార్ధాలు పిల్లలకు తినిపిస్తే జలుబు వంటి సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి. ఇలాంటి సమయాల్లోనే వాటిని పిల్లలకు దూరంగా ఉంచాల్సి వస్తుంది. ఒకవేళ ఇలాంటివి తినాల్సి వస్తే వారికి తెలియకుండానే ముగించేస్తుంటారు. కానీ ఓ చిన్నారి మాత్రం ఇలాంటి విషయాల్ని ఇట్టే పసిగట్టేస్తోంది. తనకు పెట్టకుండా తండ్రి ఐస్‌క్రీమ్ తింటున్నాడని గుర్తుపట్టి ముఖంమ్మీద కొట్టింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *