Breaking News
  • భారత్‌లో విజృంభిస్తోన్న కరోనా వైరస్‌.భారత్‌లో నిన్న 54,736 కరోనా కేసులు నమోదు, 853 మంది మృతి దేశవ్యాప్తంగా 17,50,724కు చేరిన పాజిటివ్‌ కేసులు.భారత్‌లో ఇప్పటి వరకు కరోనాతో 37,364 మంది మృతి.5,67,730 యాక్టివ్‌ కేసులు, ఇప్పటి వరకు 11,45,630 మంది డిశ్చార్జ్.
  • సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసుపై షాకింగ్ నిజాలు అంటూ చెప్పిన డాక్టర్. సుశాంత్ ది ఆత్మహత్య కాదు.అతనిని కొట్టి చంపి .. ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించారని రక్షణ శాఖ ఆర్డినెన్స్ ఆసుపత్రిలో డాక్టర్ గా పనిచేస్తున్న మీనాక్షి మిత్రా సంచలన వ్యాఖ్యలు చేశారు . వీడియోలో మృతదేహంపై గాయాలు , పడి ఉన్న తీరును విశ్లేషించిన డాక్టర్. ట్విట్టర్ లో వీడియో ని చూపిస్తూ... చెప్పిన డాక్టర్.
  • చెన్నై: తమిళ సినీ నిర్మాతల మండలి కి వ్యతిరేకం గా భారతి రాజా సంచలన నిర్ణయం . నటుడు విశాల్ ని టార్గెట్ చేస్తూ దర్శకుడు భారతి రాజా ఆధ్వర్యం లో కొత్త నిర్మాతల మండలి ఏర్పాటు . ప్రస్తుత నిర్మాతల మండలి అధ్యక్షుడి గా ఉన్న నటుడు విశాల్ దాదాపు 7 కోట్లకు మేర అవినీతి కి పాల్పడట్టు భారతి రాజా వర్గం ఆరోపణ . తమిళ నిర్మాతలకు సంబంధిచి ఎటువంటి మంచి జరగడం లేదంటూ ,సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతలను టార్గెట్ చేస్తూ దోచుకుంటున్నారని ఆరోపణలు.
  • టాలీవుడ్ దర్శకుడు తేజ కు కారోనా పాజిటివ్ గత వారం వెబ్ సిరీస్ షూటింగ్ డైరెక్ట్ చేసిన తేజ యూనిట్ సబ్యులకు, కుటుంబ సభ్యులకు కారోనా టెస్టులు, తేజకు తప్ప అందరికి నెగిటివ్.
  • చెన్నై: అయోధ్య లో రామమందిరం నిర్మాణం ఫై స్పందించిన కంచి పీఠాధిపతి స్వామి విజయేంద్ర సరస్వతి. ఆలయ నిర్మాణం ఫై 1986 నుండి నేటి వరకు ఎన్నో ఇబ్బందులను అధిగమించి నేడు భూమి పూజ నిర్వహించడం చాల శుభపరిణామం . ప్రజలందరూ కులమతాలకు అతీతం గా దేశ భక్తి ,దైవ భక్తి ప్రతిభింబించేలా రామమందిరం నిర్మాణానికి సహకరించాలి .
  • అమరావతి: 3 రాజధానుల బిల్లు ఆమోదంపై హైకోర్టులో మరో పిల్. హైకోర్టులో మూడు పిటిషన్లు దాఖలు చేసిన రాజధాని రైతులు శ్రీనివాసరావు, సాంబశివరావు. అధికార వికేంద్రీకరణ బిల్లుల ఆమోదం సవాలు చేస్తూ ఒక పిటిషన్. సీఆర్డీఏ రద్దు సవాలు చేస్తూ రెండో పిటిషన్. జేఎన్ రావు కమిటీ, హైపవర్ కమిటీ, బోస్టన్ స్. కన్సల్టెన్సీ నివేదికలు, కమిటీలను సవాలు చేస్తూ మూడో పిటిషన్ దాఖలు. రేపు విచారణకు వచ్చే అవకాశాలు. ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసిన రాజధాని పరిరక్షణ సమితి.

బ్యాంక్ లో రూ.6వేలు పడాలంటే ఆధార్ ఉండాల్సిందే..

, బ్యాంక్ లో రూ.6వేలు పడాలంటే ఆధార్ ఉండాల్సిందే..

అన్నదాతకు సాయంగా కేంద్రం పలు పథకాలను ప్రారంభించింది. అందులో ఒకటి కిసాన్ సమ్మన్. ఈ నిధి కింద రైతులందరికీ రూ.6 వేలు అందించనున్నట్లు ఇటీవల బడ్జెట్ లో కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దీనికి ముఖ్యంగా ఆధార్ కార్డును తప్పనిసరి చేసింది. ఈ డబ్బులు రైతులు తీసుకోవాలంటే ఆధార్ లింక్ తప్పనిసరి. ఆధార్ కార్డు లేని రైతులు తక్షణమే దరఖాస్తూ చేయాలని కూడా సూచించింది. అయితే.. అందుకు ప్రత్యామ్నాయంగా ఆధార్ ఎన్ రోల్మెంట్ స్లిప్ లేదా ఓటర్ ఐడీ, రేషన్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పోస్ట్ ఆఫీస్ పాస్ బుక్, గెజిటెడ్ అధికారి లేదా తహశీల్దార్ అధికారిక పత్రం, కిసాన్ ఫోటో పాస్ బుక్, పాస్ పోర్ట్ వీటిల్లో ఏదో ఒకటి సమర్పించాలని కేంద్ర వ్యవసాయ శాఖ సూచించింది.

, బ్యాంక్ లో రూ.6వేలు పడాలంటే ఆధార్ ఉండాల్సిందే..

ఒకవేళ ఆధార్ కార్డ్ ఉన్నప్పటికీ వేలిముద్రలు అటాచ్ మెంట్ కాకపోతే ఫేస్ ఐడెంటిఫికేషన్ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలని స్పష్టం చేసింది. ఇవి కూడ సాధ్యం కాకపోతే.. ఆధార్ కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయాలి లేదా రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్ కు ఓటీపీ పంపడంద్వారా వివరాలను ఎన్ రోల్ చేసుకోవాలని సూచించింది.

Related Tags