Breaking News
  • ఖమ్మం డీసీసీబీ చైర్మన్‌గా నాగభూషయ్య . ఖమ్మం వైస్‌ చైర్మన్‌గా దొండపాటి వెంకటేశ్వరరావు. ఖమ్మం డీసీఎంఎస్‌ చైర్మన్‌గా రాయల శేషగిరిరావు. డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌గా కొత్వాల శ్రీనివాసరావు ఎన్నిక.
  • మహబూబ్‌నగర్‌ డీసీసీబీ చైర్మన్‌గా నిజాంపాషా.. వైస్‌ చైర్మన్‌గా కొర్రమొని వెంకటయ్య. మహబూబ్‌నగర్‌ డీసీఎంఎస్‌ చైర్మన్‌గా ప్రభాకర్‌రెడ్డి. వైస్‌ చైర్మన్‌గా హర్యానాయక్‌ ఎన్నిక.
  • మెదక్‌ డీసీసీబీ చైర్మన్‌గా చిట్టి దేవేందర్‌రెడ్డి ఎన్నిక. వైస్‌ చైర్మన్‌గా పట్నం మాణిక్యం. డీసీఎంఎస్‌ చైర్మన్‌గా శివకుమార్‌ .
  • నల్గొండ డీసీసీబీ చైర్మన్‌గా గొంగిడి మహేందర్‌రెడ్డి. వైస్‌ చైర్మన్‌గా ఏసిరెడ్డి దయాక్‌రెడ్డి. డీసీఎంఎస్‌ చైర్మన్‌గా వట్టె జానయ్య. వైస్‌ చైర్మన్‌ నారాయణరెడ్డి.
  • వరంగల్‌ డీసీసీబీ చైర్మన్‌గా మార్నేని రవీందర్‌రావు.. వైస్‌ చైర్మన్‌గా కుందూరు వెంకటేశ్వర్‌రెడ్డి. డీసీఎంఎస్‌ చైర్మన్‌గా రామస్వామినాయక్‌ వైస్‌ చైర్మన్‌గా దేశిని శ్రీనివాస్‌రెడ్డి.

ఎన్ఆర్ఐ ప్రీతీరెడ్డి హత్య కేసులో పలు అనుమానాలు

, ఎన్ఆర్ఐ ప్రీతీరెడ్డి హత్య కేసులో పలు అనుమానాలు

మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎన్నారై ప్రతీరెడ్డి ఆస్ట్రేలియాలో హత్యకు గురికావడం సంచలనం రేపింది. వృత్తిరీత్యా ప్రీతిరెడ్డి సిడ్నీలో డెంటిన్. మార్చి 3న ఆమె అదృశ్యమైంది. ఆమె కారును ట్రేస్ చేశారు సిడ్నీ పోలీసులు. చెక్ చేస్తే కారులో వున్న సూట్‌కేస్‌లో ప్రీతిరెడ్డి డెడ్‌బాడీ కన్పించింది. ప్రీతిరెడ్డి స్వగ్రామం నవాబ్‌పేట మండలం గురుకుంట వాసులు ఈ వార్త తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యారు. బాగా చదివి ఉన్నతస్థితికి ఎదిగిన తమ ఊరి ఆడబిడ్డ హత్యకు గురైందంటే నమ్మలేకపోతున్నామన్నారు. ప్రీతిరెడ్డిని ఎవరు..? ఎందుకు..? హత్యచేశారో తెలియడంలేదన్నారు ఆమె బంధువులు.

ప్రీతిరెడ్డి నరసింహారెడ్డి, రేణుక దంపతుల పెద్ద కుమార్తె. రెండో అమ్మాయి కూడా డాక్టరే. కుటుంబమంతా సిడ్నీలో స్థిరపడ్డారు. ఇటీవలె బంధువల పెళ్లికి అంతా హైదరాబాద్ వచ్చి వెళ్లారన్నారు బంధువులు. ప్రీతికి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు భావిస్తున్న క్రమంలో ఇలా ఘోరం జరిగిందన్నారు.

, ఎన్ఆర్ఐ ప్రీతీరెడ్డి హత్య కేసులో పలు అనుమానాలు

అయితే.. ప్రీతిరెడ్డి హర్షవర్థన్ అనే వ్యక్తి ఇద్దరు ప్రేమించుకున్నారని.. ఈ మధ్యనే బ్రేకప్ చేసుకున్నారని తెలిసింది. ప్రీతిరెడ్డి హత్య జరిగిన కొద్ది గంటల్లోనే హర్షవర్థన్ యాక్సిడెంట్‌లో చనిపోడం అనుమానాలను వ్యక్తం చేస్తుంది. హర్షవర్థనే ప్రీతిని చంపి తాను చనిపోయినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

కాగా.. ప్రీతిరెడ్డి హత్యపై ఆస్ట్రేలియా పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేశారు. మరోవైపు ప్రీతి హత్యతో బంధువుల కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రీతి తండ్రి నరసింహారెడ్డి ఎంతో కష్టపడి పిల్లలను మంచిస్థాయికి తీసుకువచ్చారన్నారు. ఇద్దరమ్మాయిలు కూడా ఎంతో మంచివాళ్లన్నారు.

Related Tags