Breaking News
  • త్వరలో జనసేన క్రియాశీలక కార్యకర్తలతో పవన్‌ సమావేశాలు. 4 వారాల పార్టీ కార్యక్రమాల ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి.. పార్టీ కోసం పనిచేసే వారి జాబితా తయారు చేయాలి. ఈ నెల చివరి వారం నుంచి కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలు.. బీజేపీతో ప్రయాణంపై సమావేశాల్లో చర్చించనున్న పవన్‌కల్యాణ్‌. గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీచేసిన.. అభ్యర్థుల సమావేశం కూడా ఏర్పాటు చేయాలన్న పవన్‌కల్యాణ్‌.
  • ఇంధన పొదుపులో టీఎస్‌ ఆర్టీసీకి జాతీయ స్థాయిలో రెండో పురస్కారం. పురస్కారాన్ని అందుకున్న ఎండీ సునీల్‌శర్మ. రాష్ట్ర స్థాయిలో మూడు డిపోలకు దక్కిన అవార్డులు.
  • చెన్నైలో రోడ్డు ప్రమాదం. బైక్‌ను ఢీకొన్న కారు, ఇద్దరు మృతి. మృతులు తెలుగు యువకులుగా గుర్తింపు. విశాఖకు చెందిన బాలమురళి, హైదరాబాద్‌కు చెందిన రాహుల్‌గా గుర్తింపు. చెన్నైలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేస్తున్న బాలమురళి, రాహుల్‌.
  • రాజ్‌కోట్‌ వన్డే: ఆస్ట్రేలియా విజయలక్ష్యం 341 పరుగులు. ఆరు వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసిన భారత్‌.
  • మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి అస్వస్థత. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో సోమిరెడ్డికి చికిత్స.

అప్పుడు దాచింది…ఇప్పుడు ఇచ్చేయండి.

, అప్పుడు దాచింది…ఇప్పుడు ఇచ్చేయండి.

దిల్లీ: ఏవైనా అనుకోని ఆర్థిక ఇబ్బందులు తలెత్తితే వినియోగించేందుకు ఆర్‌బీఐ దాచిపెట్టిన రూ.27,380 కోట్లను తమకు బదలాయించాలని కేంద్రం కోరింది. ఈ విషయాన్ని పీటీఐ వెల్లడించింది. 2016-17 సంవత్సరానికి రూ.13,190 కోట్లను, 2017-18లో రూ.14,190 కోట్లను ఆర్‌బీఐ రిస్క్‌ అండ్‌ రిజర్వు ఫండ్‌ కింద పక్కన పెట్టింది. గత ఏడాది రిజర్వులను దృష్టిలో పెట్టుకొని రిజర్వు మిగులును కేంద్రానికి బదలాయించాలని ఆర్థిక శాఖ కోరింది. అంతకుముందు ఆర్థిక శాఖ కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్‌బీఐ నుంచి రూ.28వేల కోట్ల మధ్యంతర డివిడెండ్‌ను ఆశిస్తున్నట్లు తెలిపారు.
ఆర్‌బీఐ ఆర్థిక సంవత్సరం జులై-జూన్‌  మధ్య ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ ఇప్పటికే రూ.40వేల కోట్లను ప్రభుత్వానికి బదలాయించింది. ఒక వేళ తాజాగా ప్రభుత్వం కోరిన మొత్తాన్ని కూడా ఆర్‌బీఐ బదలాయిస్తే ఆ మొత్తం రూ.68వేల కోట్లకు చేరుతుంది. మరో పక్క ప్రభుత్వం వచ్చే ఏడాది రూ.69వేల కోట్ల మధ్యంతర డెవిడెండ్‌ను ఆశిస్తోంది.

, అప్పుడు దాచింది…ఇప్పుడు ఇచ్చేయండి.