‘థియేటర్లు తెరుస్తాం.. అనుమతివ్వండి’.. మల్టీప్లెక్స్‌ అసోసియేషన్ లేఖ

థియేటర్లు తెరిచేందుకు అవకాశం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ విజ్ఞప్తి చేసింది. గత ఆరు నెలల్లో లక్షల మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని తెలిపింది.

'థియేటర్లు తెరుస్తాం.. అనుమతివ్వండి'.. మల్టీప్లెక్స్‌ అసోసియేషన్ లేఖ
Follow us

|

Updated on: Sep 15, 2020 | 5:42 PM

Theaters Association Letter: థియేటర్లు తెరిచేందుకు అవకాశం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ విజ్ఞప్తి చేసింది. గత ఆరు నెలల్లో లక్షల మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని తెలిపింది. దాదాపు 9 వేల కోట్ల రూపాయలు నష్టపోయామని మల్టీప్లెక్స్‌ అసోసియేషన్ లేఖలో పేర్కొంది. ‘అన్‌లాక్‌ సినిమాస్ అండ్ సేవ్ జాబ్స్’ అంటూ స్పెషల్ క్యాంపెయిన్ మొదలుపెట్టింది.

అన్‌లాక్‌ 4లో భాగంగా మాల్స్‌, ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లు, రెస్టారెంట్లు, జిమ్‌లు కూడా ఓపెన్‌ అయ్యాయని మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ గుర్తు చేసింది. క్రౌడ్ మేనేజ్మెంట్, పరిశుభ్రత, శానిటైజేషన్ ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని.. సినిమా హాళ్లను తెరిపించాలంటూ కేంద్రాన్ని కోరింది. చైనా, కొరియా, బ్రిటన్‌, ఫ్రాన్స్ తదితర 12 దేశాల్లో థియేటర్లు నడుస్తున్నాయని తెలిపింది.

ఇండియాలో కూడా సినిమా హాళ్లు తెరిపించి ఆర్థికంగా తమను ఆదుకోవాలని మల్టీప్లెక్స్‌ అసోసియేషన్ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అలాగే వినోదం కోసం ఎదురుచూస్తున్న మూవీ లవర్స్‌కు కూడా వెసులుబాటు కల్పించాలని అభిప్రాయపడింది. ఒక్క ఎగ్జిబిషన్ సెక్టార్ మాత్రమే.. నెలకు 1500 కోట్ల చొప్పున లాక్ డౌన్ టైంలో.. ఆరు నెలలు ఏకంగా 9 వేల కోట్లు నష్టపోయింది అంటూ లెక్కలు చూపుతున్నారు. ఎంటర్టైన్మెంట్ విభాగంలో సినిమా అనేది కీలకం.. దేశవ్యాప్తంగా 10 వేల సినిమా థియేటర్లున్న ఈ పరిశ్రమ.. 2 లక్షల మందికి పైగా ఉపాధి కల్పిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్లంతా రోడ్డుమీద పడ్డారని తెలిపింది.

Also Read:

ఏపీ వాహనదారులకు అలెర్ట్.. లైట్ తీసుకుంటే ఇక అంతే!

బిగ్ బాస్ 4: ఈ సీజన్‌లో ఆమెదే భారీ రెమ్యునరేషన్

‘కరోనా వైరస్‌ను ల్యాబ్‌లో తయారు చేశారు.. ఆధారాలు ఉన్నాయి’

పేద విద్యార్థుల పాలిట దేవుడిగా మారిన సోనూసూద్…

అమెరికాను వణికిస్తున్న కొత్త రకం ‘బ్యాక్టీరియా’.!