కరోనా కట్టడికి భౌతిక దూరమే శ్రీరామ రక్ష..!

కరోనా వైరస్ ప్రపంచాన్ని ముచ్చెమలు పట్టిస్తోంది. రోజు రోజుకీ కేసుల సంఖ్య గణనీయంగా రగడమే తప్ప తగ్గడం లేదు. కరోనా వైరస్‌ వ్యాప్తి మరో రెండేళ్ల వరకూ ప్రపంచాన్ని వీడి పోదని అంతర్జాతీయ పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. అప్పటివరకూ కరోనా సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవల్సిందేనని సూచిస్తున్నారు. ఒకవేళ దీనికి మందు కనిపెట్టినా వ్యాధి వ్యాప్తిని మాత్రం నివారించక తప్పదు. అందుకే దేశంలో లాక్‌డౌన్‌ తొలగించినా ప్రజా వ్యవస్థ.. ముందులా సాధారణ జీవితాన్ని గడపలేకపోవచ్చు. వ్యక్తిగతంగా తరచూ చేతులు […]

కరోనా కట్టడికి భౌతిక దూరమే శ్రీరామ రక్ష..!
Follow us

|

Updated on: May 26, 2020 | 3:20 PM

కరోనా వైరస్ ప్రపంచాన్ని ముచ్చెమలు పట్టిస్తోంది. రోజు రోజుకీ కేసుల సంఖ్య గణనీయంగా రగడమే తప్ప తగ్గడం లేదు. కరోనా వైరస్‌ వ్యాప్తి మరో రెండేళ్ల వరకూ ప్రపంచాన్ని వీడి పోదని అంతర్జాతీయ పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. అప్పటివరకూ కరోనా సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవల్సిందేనని సూచిస్తున్నారు. ఒకవేళ దీనికి మందు కనిపెట్టినా వ్యాధి వ్యాప్తిని మాత్రం నివారించక తప్పదు. అందుకే దేశంలో లాక్‌డౌన్‌ తొలగించినా ప్రజా వ్యవస్థ.. ముందులా సాధారణ జీవితాన్ని గడపలేకపోవచ్చు. వ్యక్తిగతంగా తరచూ చేతులు కడుక్కోవడం వంటి తదితర జాగ్రత్తలు పాటించడంతో పాటు ముఖ్యంగా మనిషికి మనిషి మధ్య భౌతిక దూరానికి కట్టుబడి ఉండక తప్పదు. ఇదే కొవిడ్‌-19 వ్యాప్తిని అరికట్టగలిగిన బలమైన ఆయుధం అంటున్నారు వైద్య, ఆరోగ్య నిపుణులు. మార్చి నెలలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుంచీ ఇప్పటికీ దేశంలో కరోనా బాధితులు పెరుగుతూనే ఉన్నారు. అందుకే సామాజిక దూరాన్ని పాటించడం తప్పనిసరిగా అమలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. ఇందుకు సంబంధించిన ప్రాచీన కాలంలో కూడా సామాజిక దూరానికి ప్రాముఖ్యత నిచ్చారు. ప్రఖ్యాత తాత్వికుడు అరిస్టాటిల్‌ మాటలు గుర్తు చేసుకుంటే.. మనిషి స్వాభావికంగా సామాజిక జంతువు అంటాడు. అందుకే సామాజిక దూరం అనేది మనుషుల సహజ లక్షణానికి విరుద్ధమైనది. సామాజిక సందర్భంలో ఆలోచించినప్పుడు మనం నివశించే ప్రదేశం, ఎలాంటి ఇంట్లో ఉంటున్నాము.. ఆర్థిక స్థితి, జీవనోపాధి వంటి చాలా విషయాలు సామాజిక దూరాన్ని పాటించడంలో సవాళ్లుగా కనిపిస్తాయి. కొవిడ్‌-19 మహమ్మారి విజృంభిస్తున్నప్పటికీ సామాజిక దూరం అమలు చేయడంలో కొంత విఫలమవడానికి కారణాలూ ఇలాంటివే. అయితే ప్రాచీన కాలంలో మానవుడి అనుసరించిన పరిస్థితులు మరోసారి పునరావృతం అవుతున్నాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. సామాజిక, వ్యక్తిగత అలవాట్లయిన భౌతిక దూరం పాటించడం, చేతులు ఎప్పటికప్పుడు కడుక్కోవడం వంటి చర్యలు మనిషి ఆరోగ్యకరమైన జీవన విధానానికి అద్దం పడుతున్నాయి. 1918లో స్పానిష్‌ ఫ్లూ విజృంభించినప్పుడు ఈ సామాజిక దూరమే మనుషుల్ని కాపాడింది. అందుకే కొవిడ్‌-19 వ్యాప్తి కాకుండా ఉండటానికి ప్రపంచ దేశాలన్నీ సామాజిక దూరాన్నే ఆయుధంగా వాడుతున్నాయి. నిజానికి, సామాజిక దూరం.. సామాజిక సంబంధాలను విచ్ఛిన్నం చేసేదనే భావన కలిగిస్తుంది. అలాగే సమాజంలో ఉన్న వివిధ తరగతుల మధ్య వివక్షకు కారణం కావచ్చనే వాదన కూడా లేవనెత్తింది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ పదాన్ని వాడకుండా భౌతిక దూరం అనే పదాన్ని వాడమని ప్రోత్సహించింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో భౌతిక దూరన్ని పాటించమని కచ్చితంగా చెబుతున్నారు నిపుణులు. దీనివల్ల వ్యాధి వ్యాప్తిని నివారించడంతో పాటు వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఎంతో భద్రత ఉంటుంది. కొవిడ్‌-19 దశల వారీగా విస్తరించకుండా ఉంటుంది. ఇప్పటికే భారతదేశం రెండో దశలో ఉంది. అంటే వైరస్‌ విదేశాల నుంచి వచ్చిన వారికే కాకుండా ప్రాంతీయులకూ వ్యాపించింది. ఈ దశలో వైరస్‌ మూలాలు, దాని వ్యాప్తిని గుర్తించడం వీలవుతుంది. ఇక ఇది మూడో దశకు చేరుకోకుండా ఉండటానికి భౌతిక దూరం పాటించడమే కీలకమైన అంశం. ఇక భౌతిక దూరం పాటించే కాలంలో సామాజిక సంబంధాలూ మెరుగుపడుతాయి. ప్రస్తుతమున్న సాంకేతికతను వినియోగించుకుంటూ వీడియో కాల్స్‌ వంటి తదితర మార్గాల ద్వారా క్వారంటైన్‌ వంటి సామాజిక ఒంటరితనాన్ని అధిగమించవచ్చు. ఇక సాంప్రదాయంగా మనం విలువనిస్తున్న ‘సామాజిక మేలు’కు ఇది తోడ్పడుతుంది.