ఫాస్టెస్ట్ బులెట్ ట్రైన్ కి గ్రీన్ సిగ్నల్.. స్పీడ్ ఎంతంటే..?

ప్రపంచంలోకెల్లా అత్యంత వేగంగా ప్రయాణించే బులెట్ రైలుకి.. జపాన్ లో పచ్చ జెండా ఊపేశారు. కానీ.. ఇది అఫీషియల్ లాంచింగ్ కాదు. మూడేళ్ళ పాటు ట్రయల్ రన్ నిర్వహించి.. మరికొన్ని మెరుగులు దిద్ది.. ఆ తర్వాతే దీన్ని అధికారికంగా పట్టాలెక్కిస్తారు. Alfa-X అనే పేరుతో పిలిచే ఈ ఫాస్టెస్ట్ బులెట్ ట్రైన్ కి సంబంధించి ఒక కీలక ఫీచర్ నయితే ఇప్పటికి సిద్ధం చేశారు. రైలు ముందు భాగంలో ఏర్పాటు చేసిన 72 అడుగుల పొడవైన ‘నోస్’ డిజైనింగ్ సక్సెస్ అయిందట. టన్నెల్స్ ద్వారా ప్రయాణించే సమయంలో ఎదురయ్యే నాయిస్ ని, ప్రెజర్ ని ఈ ‘పొడవాటి ముక్కు’ ద్వారా నివారించవచ్చట.

గరిష్టంగా 10 బోగీలుండే ఈ Alfa-X బులెట్ ట్రైన్ ఎంత వేగంతో దూసుకెళ్లగలదు? గంటకు 224 మైళ్ళు..! దాదాపు 360 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని అంచనా. ఇప్పటివరకూ ప్రపంచంలోకెల్లా ఫాస్టెస్ట్ బులెట్ ట్రైన్స్ సగటు వేగం గంటకు 200 మైళ్ళు. Maglev లోకోమోటివ్స్ తో కలిగిన రైళ్లు మాత్రమే 268 మైళ్ళు పరుగెత్తగలవు. ఇప్పుడీ Alfa-X కూడా అన్ని కసరత్తులూ పూర్తయ్యే సరికి.. మరిన్ని అనూహ్యమైన ఎట్రాక్షన్స్ తో జపనీస్ జనానికి అందుబాటులోకి రావొచ్చని భావిస్తున్నారు. భూకంపాల్ని తట్టుకునే సామర్థ్యం కూడా దీనికుందట. బులెట్ ట్రైన్ నెట్వర్క్ ని సీరియస్ గా విస్తరించుకుంటూ పోతున్న జపాన్ ప్రభుత్వానికి Alfa-X బులెట్ ట్రైన్ మరో గర్వకారణం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *