మహిళ ప్రాణాలు కాపాడిన పోలీసులు

Women was saved by Police, మహిళ ప్రాణాలు కాపాడిన పోలీసులు

మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆత్మహత్యాయత్నం చేసిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్‌ నగర్‌లో ఎస్సై ఓంకార్‌ యాదవ్‌ సిబ్బందితో  కార్డెన్‌సెర్చ్‌ ముగించుకుని తిరిగి వెళ్తుండగా హమాలి వాడ గేట్‌ సమీపంలో ఓ మహిళ రైల్వే ట్రాక్‌పైఅనుమానస్పదంగా కనిపించింది. రైలుకు అడ్డంగా వెళ్తూ..బలవన్మరణానికి పాల్పడుతున్నట్లుగా కనిపించింది. సదరు మహిళలను గమనించిన ఎస్సై మహిళా సిబ్బందితో హుటాహుటినా..చాకచక్యంగా  ఆమెను కాపాడారు. అనంతరం బాధితురాలిని అదుపులోకి తీసుకున్నపోలీసులు ఆమె సరైన కౌన్సెలింగ్ నిమ్మిత్తం పీఎస్‌ కు తరలించారు. జరిగిన ఘటనలో ఓ మహిళను ప్రాణాపాయం నుంచి కాపాడిన పోలీసులను స్థానికులు ఎంతగానో అభినందించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *