అటు ఇటు అయితే పొరపాటేనట..!

అటు ఇటు అయితే పొరపాటు లేదోయ్‌ అన్నాడో సినీకవి. కానీ నిజజీవితంలో పొరపాటే కాదు.. పరువూ పోయింది ఓ అబ్బాయికి. సారీ.. అమ్మాయికి. అవును అతన్ని ఆమెలా మార్చడానికి ప్రేమ వల విసిరిన ఓ వ్యక్తి.. చివరకు వద్దుపొమ్మంటూ మోసం చేశాడు. ఎంజాయ్‌ చేసినంత కాలం చేసి.. వ్యభిచారి ముద్రవేసి వదిలించుకున్నాడు. ఇప్పుడామె న్యాయం కోసం పోరాటం చేస్తోంది. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని ధర్మారం మండల కేంద్రానికి చెందిన అభిలాష్‌కు.. […]

అటు ఇటు అయితే పొరపాటేనట..!
Follow us

|

Updated on: Dec 23, 2019 | 8:16 PM

అటు ఇటు అయితే పొరపాటు లేదోయ్‌ అన్నాడో సినీకవి. కానీ నిజజీవితంలో పొరపాటే కాదు.. పరువూ పోయింది ఓ అబ్బాయికి. సారీ.. అమ్మాయికి. అవును అతన్ని ఆమెలా మార్చడానికి ప్రేమ వల విసిరిన ఓ వ్యక్తి.. చివరకు వద్దుపొమ్మంటూ మోసం చేశాడు. ఎంజాయ్‌ చేసినంత కాలం చేసి.. వ్యభిచారి ముద్రవేసి వదిలించుకున్నాడు. ఇప్పుడామె న్యాయం కోసం పోరాటం చేస్తోంది.

ఈ సంఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని ధర్మారం మండల కేంద్రానికి చెందిన అభిలాష్‌కు.. హార్మోన్ల ప్రభావంతో చిన్నప్పటి నుంచి అమ్మాయి లక్షణాలు ఉండేవి. BSC  MLT  కోర్సు చేసిన అభిలాష్‌కు..  అదే మండలం బొమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కట్టా సంతోష్‌తో ఏర్పడ్డ పరిచయం.. ప్రేమగా మారింది. కానీ విషయం ఎక్కడా బయటపడకుండా జాగ్రత్త పడ్డారు. కొన్నిరోజులు తిరిగాక అభిలాష్‌ను లింగమార్పిడి చేసుకోమని ఒత్తిడి చేశాడు సంతోష్‌. దాంతో ముంబై వెళ్లి అర్చనగా తిరిగి వచ్చాక.. ఈ నెల అక్టోబర్‌లో ఇద్దరు వివాహం చేసుకున్నారు. పెద్దపల్లిలోని రాఘవపూర్‌లో ఓ ఆలయంలో స్నేహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్న అర్చన, సంతోష్‌లు.. కొన్నిరోజులు కలిసే తిరిగారు. అయితే ఈ మధ్యకాలంలో అర్చనపై మోజు తగ్గడంతో సంతోష్‌ వేధించడం మొదలు పెట్టాడు. వదిలించుకునేందుకు వ్యభిచారం చేస్తోందని ప్రచారం చేసి తప్పించుకున్నాడని బాధితురాలు వాపోయింది.. తన బతుకేదో బతుకుతుంటే.. లేని ఆశలు రేపి మోసం చేయడమే కాకుండా.. దుష్ప్రచారం చేస్తున్నాడంటూ  సంతోష్‌పై న్యాయపోరాటానికి దిగింది అర్చన.

అర్చనకు మద్దతుగా ట్రాన్స్‌జెండర్లు కూడా ముందుకు వచ్చారు. ఆమెకు అండగా నిలుస్తూ.. సంతోష్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అభిలాష్‌ జీవితంలోకి వచ్చిన సంతోష్‌ లేనిపోని ఆశలు రేపి అర్చనగా మార్చి.. మోసం చేశాడంటూ మండిపడ్డారు. అతనికి బుద్దివచ్చేలా చూడాలని వారంతా హెచ్చరించారు. కుటుంబసభ్యులను కాదని పెళ్లి చేసుకున్నందుకు..వారే కాదు.. తానూ పుట్టిన ఊళ్లో తలెత్తుకోలేక పోతున్నానని అర్చన వాపోయింది.. ఓవైపు సంతోష్‌పై న్యాయపోరాటం చేస్తూనే చదువుకున్న అమ్మాయి కావడంతో.. జాబ్‌ చేస్తూ స్వశక్తితో పైకి రావాలని అర్చనకు మనోధైర్యం ఇస్తున్నారు ట్రాన్స్‌జెండర్లు.