ఆర్టీస్ బస్సుల నంబర్ ప్లేట్స్‌పై.. ఆ “Z”కథ ఏంటో తెలుసా..?

వాహనాల నంబర్ ప్లేట్లు.. ఇవి ప్రతి వాహనానికి వేరువేరుగా ఉంటాయి. అంతేకాదు.. ఇవి ప్రతి రాష్ట్రానికి ఒక్కో సీరిస్‌తో ఉంటాయి. ప్రతి వాహనానికి ఇవి వేరువేరుగా ఉంటాయి. అందులో నంబర్లతో పాటుగా.. ఇంగ్లీష్ అక్షరాలను చేర్చి నంబర్‌ను కేటాయిస్తుంటారు రవాణా శాఖ అధికారులు. అయితే ఈ నంబర్లలో మన తెలంగాణ రాష్ట్రంలో ఓ ప్రత్యేకత ఉంటుంది. అదేంటంటే.. పోలీసుల వాహనాలను గుర్తించేందుకు ఓ గుర్తు ఉంటే.. అదే సమయంలో ఆర్టీసీ బస్సులకు కూడా ఓ సింబల్ ఉంటుంది. […]

ఆర్టీస్ బస్సుల నంబర్ ప్లేట్స్‌పై.. ఆ Zకథ ఏంటో తెలుసా..?
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 03, 2019 | 7:50 PM

వాహనాల నంబర్ ప్లేట్లు.. ఇవి ప్రతి వాహనానికి వేరువేరుగా ఉంటాయి. అంతేకాదు.. ఇవి ప్రతి రాష్ట్రానికి ఒక్కో సీరిస్‌తో ఉంటాయి. ప్రతి వాహనానికి ఇవి వేరువేరుగా ఉంటాయి. అందులో నంబర్లతో పాటుగా.. ఇంగ్లీష్ అక్షరాలను చేర్చి నంబర్‌ను కేటాయిస్తుంటారు రవాణా శాఖ అధికారులు. అయితే ఈ నంబర్లలో మన తెలంగాణ రాష్ట్రంలో ఓ ప్రత్యేకత ఉంటుంది. అదేంటంటే.. పోలీసుల వాహనాలను గుర్తించేందుకు ఓ గుర్తు ఉంటే.. అదే సమయంలో ఆర్టీసీ బస్సులకు కూడా ఓ సింబల్ ఉంటుంది. పోలీసులు వాహనాలు దాదాపు 9P కోడ్‌తోనే ఉంటాయి. అయితే ఏపీ, తెలంగాణలోని ఆర్టీసీ బస్సుల నెంబర్ ప్లేట్లపై ‘జడ్’ అనే అక్షరం ఉంటుంది. ఇలా ‘జడ్’ అనే అక్షరం ఒక్క బస్సులపైనే ఎందుకు ఉంటుందన్న విషయం చాలా మందికి తెలియదు.

ఈ “Z” అనే అక్షరం వెనక చాలా కథే ఉంది. మన హైదరాబాద్ ప్రాంతాన్నినిజాం పరిపాలించినప్పుడు అప్పటి నిజాం ప్రభుత్వం రోడ్డు, రైలు మార్గాల అభివృద్ధి కోసం ‘నిజాం స్టేట్ రైల్ అండ్ రోడ్డు ట్రాన్స్‌పోర్టు’ సంస్థను ఏర్పాటు చేసింది. అయితే ఈ సంస్ధ 1932 జూన్‌లో తొలిసారిగా సిటీ బస్సు సర్వీసులను ప్రవేశపెట్టింది. ఈ బస్సులను అప్పటి నిజాం ఉస్మాన్ అలీఖాన్.. తన తల్లి జహ్రాబేగం పేరుతో నమోదు చేయించారు. దీంతో అప్పటి నుంచి నేటి వరకు ఆర్టీసీకి చెందిన ప్రతి బస్సు నెంబర్‌లో నిజాం ఉస్మాన్ అలీఖాన్ తల్లి జహ్రాబేగం పేరులోని మొదటి అక్షరం “జడ్”తోనే రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. అయితే హైదరాబాద్ సంస్థానాన్ని.. నిజాం భారత్‌లో విలీనం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో నిజాం ఓ కండిషన్ పెట్టాడు. హైదరాబాద్ సంస్థానం పరిధిలో ప్రజా రవాణా కోసం ఆర్టీసీ ద్వారా ఉపయోగించే ఏ బస్సుకైనా “Z” అనే అక్షరాన్ని ఉపయోగించాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నాడు. దీంతో అప్పటినుంచి ఆ సంప్రదాయం కంటిన్యూ అవుతోంది. అందుకే ఇప్పటికీ.. తెలంగాణ, ఏపీల్లోని ఆర్టీసీ బస్సులు, ఆర్టీసీ సంస్థకు చెందిన ఇతర వాహనాలు నెంబర్ ప్లేట్ లో “Z” అనే అక్షరం ఖచ్చితంగా ఉంటుంది.

అయితే ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ కార్మికులు డిమాండ్ చేస్తుంటే.. సీఎం కేసీఆర్.. విలీనం కుదరదంటూ తేల్చి చెప్పారు. అదే సమయంలో పలు బస్‌రూట్లను ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పేందుకు సిద్ధమయ్యారు. అయితే దీనిపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ స్పందించారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ అనేది కేసీఆర్ నిర్ణయంకే వదిలేస్తున్నామని.. అయితే ఆర్టీసీ బస్సుల నంబర్ ప్లేట్‌కు మాత్రం “Z” అక్షరం మాత్రం మార్చవద్దని అసదుద్దీన్ కోరాడు. దీంతో ఇప్పుడు ఈ “Z” అక్షరం కథ ముందుకు వచ్చింది.

వేసవి ఉపశమనం కోసం వంటించి చిట్కాలు.. ఈ సూపర్ డ్రింక్స్ మీ కోసం..
వేసవి ఉపశమనం కోసం వంటించి చిట్కాలు.. ఈ సూపర్ డ్రింక్స్ మీ కోసం..
నిన్ను నా సినిమాలోకి తీసుకున్నందుకు పశ్చాత్తాపడుతున్నా..
నిన్ను నా సినిమాలోకి తీసుకున్నందుకు పశ్చాత్తాపడుతున్నా..
ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రం ఈ పండు.. ఉదయాన్నే తింటే ఇక నో టెన్షన్..
ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రం ఈ పండు.. ఉదయాన్నే తింటే ఇక నో టెన్షన్..
భారత పర్యటనకు ముందు ఎలాన్ మస్క్‌కు బిగ్ షాక్..
భారత పర్యటనకు ముందు ఎలాన్ మస్క్‌కు బిగ్ షాక్..
తన ఇంట్లో చొరబడ్డ దొంగలకు డబ్బు సాయం చేసిన టాలీవుడ్ యాక్టర్
తన ఇంట్లో చొరబడ్డ దొంగలకు డబ్బు సాయం చేసిన టాలీవుడ్ యాక్టర్
మాట నిలబెట్టుకున్నలారెన్స్.. దివ్యాంగులకు ఇళ్లు, బైక్స్ .. వీడియో
మాట నిలబెట్టుకున్నలారెన్స్.. దివ్యాంగులకు ఇళ్లు, బైక్స్ .. వీడియో
ప్రభాస్‏ను కాపీ కొట్టిన హీరోయిన్.. నెటిజన్స్ రియాక్షన్ ఇదే...
ప్రభాస్‏ను కాపీ కొట్టిన హీరోయిన్.. నెటిజన్స్ రియాక్షన్ ఇదే...
సక్సెస్‌కు చిరునామా ఈ అంధుడే.. ప్రపంచాన్ని శాసిస్తున్న శ్రీకాంత్
సక్సెస్‌కు చిరునామా ఈ అంధుడే.. ప్రపంచాన్ని శాసిస్తున్న శ్రీకాంత్
రష్యా సహాయంతో భారత్ రూ.2 లక్షల కోట్లు సంపాదించింది
రష్యా సహాయంతో భారత్ రూ.2 లక్షల కోట్లు సంపాదించింది
పుచ్చకాయ vs కర్బూజ: వేసవిలో ఏది మంచిదంటే..
పుచ్చకాయ vs కర్బూజ: వేసవిలో ఏది మంచిదంటే..