భూమి పూజలో దేవతలకు ఆహ్వానం పలికిన అర్చకులు..

మందిర శంకుస్థాపన మహోత్సవంలో భాగంగా అయోధ్యలో అర్చకులు రామార్చన పూజ నిర్వహించారు. భూమి పూజ కోసం తరలి రావాలంటూ వేదమంత్రాలు జపిస్తూ ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికారు. ఇందులో నాలుగు దశల్లో.......

భూమి పూజలో దేవతలకు ఆహ్వానం పలికిన అర్చకులు..
Follow us

|

Updated on: Aug 05, 2020 | 12:32 PM

మందిర శంకుస్థాపన మహోత్సవంలో భాగంగా అయోధ్యలో అర్చకులు రామార్చన పూజ నిర్వహించారు. భూమి పూజ కోసం తరలి రావాలంటూ వేదమంత్రాలు జపిస్తూ ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికారు. ఇందులో నాలుగు దశల్లో ఈ పూజను నిర్వహించారు.

తొలిదశలో రాముడు మినహా ఇతర దేవతలను ప్రార్థించారు. వారికి పేరు పేరునా ఆలయ శంకుస్థాపనకు ఆహ్వానించారు. రెండో దశలో అయోధ్య నగరంతోపాటు రాముడి సైన్యాధికారులైన నలుడు, నీలుడు, సుగ్రీవుడిని పూజించారు. మూడో దశలో రాముడి తండ్రి దశరుథుడు,ముగ్గురు తల్లులు కౌసల్య, సుమిత్ర, కైకేయికి స్వాగతించారు, రాముడి సోదరులకు పూజలు నిర్వహించారు.

అనంతరం నాలుగో దశలో శ్రీరామచంద్రమూర్తిని ప్రార్థించారు. అయితే ఇందులో తొలి పూజలను అందుకునే విఘ్నేశ్వరునికి స్వర్ణ తాపరంతో చేయించిన తొలి ఆహ్వానంను అందించారు. మీరు ఇక్కడ చూస్తున్నది ఆ స్వర్ణ పత్రం.